Breaking News

PEDDAPALLY

నిత్యావసర సరుకులు పంపిణీ

సారథిన్యూస్​, రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఆదివారం లయన్స్​క్లబ్​ ఆధ్వర్యంలో ప్రైవేట్​ ఉపాధ్యాయులకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్​ క్లబ్​ అధ్యక్షుడు గుగ్గిళ్ల రవీంద్రాచారి మాట్లాడుతూ.. కరోనా, లాక్​డౌన్​తో ప్రైవేట్​ టీచర్ల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. అందుకే వారికి తమవంతుగా ఈ సాయం చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో లయన్స్​క్లబ్​ ప్రధాన కార్యదర్శి భిక్షపతి, కోశాధికారి గుండా రాజు, సభ్యులు శరత్ బాబు, డాక్టర్ వెంకటేశ్వర్లు, భేణిగోపాల్ త్రివేది, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Read More
పెద్దపల్లి జిల్లాను వణికిస్తున్న కరోనా

పెద్దపల్లి జిల్లాను వణికిస్తున్న కరోనా

సారథి న్యూస్, పెద్దపెల్లి: జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. పదిరోజుల్లో 43 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. వారిలో ఆరుగురు ఇప్పటికే మృతిచెందారు. మరో ఆరుగురు ఆరోగ్యం నిలకడగా ఉండి కోలుకున్నారు. కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వం లాక్ డౌన్లో సడలింపు విధించడంతో జిల్లా అధికార యంత్రాంగం చేతులెత్తేసింది. దీంతో గుంపులు గుంపులుగా తిరుగుతూ నిబంధనలు పాటించకుండా మాస్కులు ధరించకుండా భౌతిక దూరం పాటించకుండా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు సైతం ప్రభుత్వ కార్యక్రమాల్లో […]

Read More

భావితరాల కోసమే హరితహారం

సారథిన్యూస్​, గంగాధర/రామడుగు/రామగుండం: భావితరాలు బాగుండాన్న ఉద్దేశ్యంతోనే సీఎం కేసీఆర్​ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ పేర్కొన్నారు. శనివారం కరీంనగర్​ జిల్లా మంగపేట గ్రామంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. రామడుగు మండలం గోపాల్​రావుపేటలో లయన్స్​ క్లబ్​ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయము ఆవరణలో పోలీస్ కమిషనర్ వీ సత్యనారాయణ అధికారులు, సిబ్బందితో కల్సి పండ్ల మొక్కలను నాటారు. ఆయా కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కర్ర […]

Read More

నాటుసారాపై ఉక్కుపాదం

సారథిన్యూస్​, రామగుండం: నాటుసారాను తయారుచేసినా, విక్రయించినా కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లాలోని పలు గుడాంబా స్థావరాలపై పోలీసులు దాడులు జరిపారు. పొత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓదెల మండలం కొలనూరు చెరువు సమీపంలో గుడుంబా స్థావరాలపై దాడులు జరిపి గుడుంబా తయారీ కోసం నిల్వ ఉంచిన ఆరువందల లీటర్ల బెల్లం పానకం, 50 కిలోల బెల్లం, నాటుసారా తయారీ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. కుమార్​ అనే వ్యక్తిని అరెస్ట్​ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ […]

Read More

నాటిన మొక్కలను రక్షిద్దాం

పెద్దపల్లి: మొక్కలు నాటడమే కాక వాటిని సంరక్షించడం ముఖ్యమని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్​ పరిధిలోని మల్కాపూర్ వద్ద ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. మరోవైపు కరీంనగర్​ జిల్లా చొప్పదండి పోలీస్​స్టేషన్​లో సీఐ రమేశ్​, ఎస్సై అనూష మొక్కలు నాటారు. పెద్దపల్లి జిల్లాలోని ఎరువుల కర్మాగారం ప్రాంగణంలో ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ రాజన్​ […]

Read More

వీఆర్వో కుటుంబానికి కరోనా

సారథిన్యూస్​, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ తాహసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న వీఆర్ఏ, అతడి కుటుంబసభ్యులు నలుగురికి కరోనా సోకింది. కాగా కొంతకాలంగా వీఆర్ఏకు కరోనా లక్షణాలు కనిపించడంతో అతడి కుటుంబ సభ్యులు క్వారంటైన్​ లో ఉన్నారు. కరోనా పరీక్షలు చేయించుకోగా.. వీఆర్వోకు అతడి కుటుంబసభ్యులకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది.

Read More

మోకే ఉరితాడైంది

సారథిన్యూస్​, గోదావరిఖని: కల్లు తీసేందుకు వెళ్లిన ఓ గీతకార్మికుడికి.. మోకు మెడకు చుట్టుకొని ఊపిరాడక అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గుర్రంపల్లి గ్రామంలో విషాదం నింపింది. గుర్రంపల్లికి చెందిన మామిడి రాజు ప్రతిరోజు మాదిరిగానే కల్లు తీసేందుకు మోకు సాయంతో తాటిచెట్టు ఎక్కాడు. ఈ క్రమంలో మోకు.. మెడకు చుట్టుకున్నది. దీంతో ఉపిరాడక అక్కడికక్కడే మృతిచెందాడు. గమనించిన తోటి గీతకార్మికులు మృతదేహాన్ని చెట్టుపైనుంచి కిందకు దించారు.

Read More

ప్రాణం తీసిన సెల్ఫీ సరదా

సారథిన్యూస్​, గోదావరిఖని: సెల్ఫీ సరదా ఓ విద్యార్థి ప్రాణం తీసింది. గోదావరిఖనికి చెందిన యశ్వంత్(22) ఓ కళాశాలలో పాల్​టెక్నిక్​ డిప్లమో చదువుతున్నాడు. సోమవారం సరదాగా పెద్దపల్లి జిల్లాలోని సబ్బితం జలపాతం వద్దకు వెళ్లాడు. అక్కడ సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు.

Read More