అమరావతి: బిగ్బాస్ఫేం, పవన్‌కల్యాణ్ అభిమాని, ‘పరాన్నజీవి’ దర్శకుడు నూతన్ నాయుడు ఇంట్లో దళిత యువకుడు ఘోర అవమానానికి గురయ్యాడు. కర్రి శ్రీకాంత్ అనే ఓ దళిత యువకుడు నూతన్ నాయుడు ఇంట్లో పనిచేస్తున్నాడు. నూతన్ భార్య మధుప్రియ శ్రీకాంత్‌పై దొంగతనం నేరం మోపడంతో అతడు పనికి రావడం లేదు. ఈ క్రమంలో నూతన్ నాయుడు భార్య మధుప్రియ.. శ్రీకాంత్‌ను తన ఇంటికి పిలిపించి అతడికి గుండు కొట్టించింది. కాగా ఈ ఘటనపై దళితసంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. శుక్రవారం పవన్‌కల్యాణ్‌తో భేటీ ఆయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. వీర్రాజు ఏపీ బీజేపీ పగ్గాలు చేపట్టాక బీజేపీలోని ఓ వర్గం నేతలు, వైఎస్సార్సీపీ నేతలు ఖుషీగా ఉండగా.. టీడీపీ నేతల్లో నైరాశ్యం నెలకొంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఏపీ బీజేపీలో చంద్రబాబు పరోక్షంగా జోక్యం చేసుకుంటున్నారని.. ఆయన కొందరు నేతలను కోవర్టులుగా పంపి రాజకీయం నడిపిస్తున్నారని కొంతకాలంగా […]
సారథిన్యూస్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని వికేంద్రీకరణకు ప్రజామోదం లేదని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ విమర్శించారు. సీఎం జగన్ ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా సొంతంగా ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. ఆదివారం జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ప్రతినిధులతో పవన్ కల్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. అమరావతిలో అవినీతి జరిగితే విచారణ జరిపి దోషులను శిక్షించాలి. అంతే కానీ రాజధానిని మార్చడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారగానే రాజధానులు […]
సంచలన దర్శకుడు ఆర్జీవీ పవన్‌కల్యాణ్‌పై ‘పవర్‌స్టార్’ పేరుతో ఓ వ్యంగ్య చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి బుధవారం ఓ ట్రైలర్‌ను విడుదల చేశాడు. ఈ ట్రైలర్ ఓ రేంజ్లో వైరల్ అవుతుంది. దీంతో పవన్‌ఫ్యాన్స్ రాంగోపాల్‌వర్మపై పిచ్చికోపంతో ఉన్నారు. కానీ తమ కోపాన్ని ఎలా ప్రకటించాలో తెలియడం లేదు. వారు ఎంత రెచ్చిపోతే ఆర్జీవీకి అంత లాభం. అతడికి ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చిన వారవుతారు. దీంతో కొంతకాలంగా వారు మింగలేక కక్కలేక తెగ ఆయాస […]
పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్ సాబ్’ చిత్రంలో నటించేందుకు శృతి హాసన్ ఒప్పుకోలేదని సమాచారం. బాలీవుడ్ ‘పింక్’ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతున్నది. ఈ చిత్రంలో శృతిహాసన్ పాత్రకు అంత ప్రాముఖ్యత లేకపోవడంతో ఆమె నటించేందుకు అంగీకరించలేదట. చాలా గ్యాప్ తర్వాత తెలుగులో నటిస్తుండటంతో తక్కువ నిడివి ఉన్న పాత్రలు, ఐటమ్ సాంగ్స్ వంటివి చేయకూడదనే శృతి నిర్ణయం తీసుకుందట. ఈ చిత్రంలో శృతిహాసనే హీరోయిన్ అంటూ గత రెండు మూడు నెలలుగా […]