Breaking News

PANJAB

కాంగ్రెస్​ నేతకు జీవితఖైదు

న్యూఢిల్లీ: సిక్కుల ఊచకోత కేసులో నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ కు జీవిత ఖైదు విధిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇది చిన్న కేసు కాదని, నిందితుడికి బెయిల్ ఇవ్వడం కుదరదని చీఫ్ జస్టిస్ ఎస్ఎ బోబ్డె నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు.. ఇకనుంచి ఆ అవసరం లేదని రిపోర్టులు చెబుతున్నాయని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. బెయిల్ కు సంబంధించి నిందితుడు పెట్టుకున్న పిటిషన్ […]

Read More
86కు చేరిన మృతుల సంఖ్య

86కు చేరిన కల్తీ మద్యం మృతులు

చండీగఢ్: పంజాబ్‌లో కల్తీ మద్యం తాగి మరణించిన వారిసంఖ్య 86కు చేరింది. ఇప్పటికే తరన్​ ‌తరన్‌ జిల్లాలో 19, అమృత్‌సర్‌లో 11, బాటాల జిల్లాలో 9 మంది చనిపోయారు. తాజాగా శనివారం తరన్​ ‌తరన్‌లో మరో 44 మంది, అమృత్‌సర్‌లో ఒకరు, బాటాల జిల్లాలో ఇద్దరు చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 86కు చేరుకుంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు 10 మందిని అరెస్ట్​చేశారు. ఏడుగురు ఎక్సైజ్‌ అధికారులు, ఆరుగురు పోలీసులను పంజాబ్​ ప్రభుత్వం సస్పెండ్​ చేసింది. […]

Read More
నకిలీ మద్యం తాగి 21 మంది మృతి

నకిలీ మద్యానికి 21 మంది బలి

చండీఘర్​: పంజాబ్​ రాష్ట్రంలో నకిలీ మద్యం సేవించి దాదాపు 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్​సింగ్​ న్యాయవిచారణకు ఆదేశించారు. అమృత్​సర్​, బాటాలా, టరన్​టరన్​ ప్రాంతాలకు చెందిన వారు నకిలీ మద్యం సేవించి ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు పేర్కొన్నారు. ‘ఈ ఘటనపై న్యాయవిచారణకు ఆదేశించాను. దోషులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోం. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దు’ అంటూ సీఎం అమరీందర్​సింగ్​ ట్వీట్​ చేశారు.

Read More
విద్యార్థులకు బంపర్​ ఆఫర్​

విద్యార్థినులకు బంపర్​ ఆఫర్

చంఢీఘర్​: పంజాబ్​ సీఎం కెప్టెన్​ అమరీందర్​ సింగ్​ ఆ రాష్ట్రంలోని 11,12 వ తరగతి విద్యార్థినులకు బంపర్​ఆఫర్​ ప్రకటించారు. ఆన్​లైన్​ క్లాసులు వినేందుకు విద్యార్థినులకు ఉచితంగా స్మార్ట్​ ఫోన్లను పంపిణీ చేయనున్నారు. మొదటి విడత పంపిణీకి 50 వేల స్మార్ట్​ ఫోన్లు సిద్ధంగా ఉన్నాయని సీఎం తెలిపారు. స్మార్ట్​ ఫోన్ల పంపిణీకి చైనాకు చెందిన ఓ కంపెనీతో పంజాబ్​ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం నిర్ణయం పట్ల ఆ రాష్ట్రంలోని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం […]

Read More

పంజాబ్​ మంత్రికి కరోనా

చంఢీగర్​: కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తున్నది. రాజకీయ, సినీప్రముఖులను వదలడం లేదు. ఎవరైతే నాకేంటి అన్నట్టుగా వైరస్​ విజృంభిస్తున్నది. తాజగా పంజాబ్​ మంత్రి రాజిందర్​ సింగ్​ బజ్వాకు కరోనా పాజిటివ్​గా నిర్ధరాణ అయ్యింది. ఆయన కార్యాలయంలోని కొందరికి కరోనా రావడంతో శనివారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆయనకు కరోనా నెగిటివ్​గా వచ్చింది. అయినప్పటికి ఆయనకు కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో మంగళవారం మరోసారి కరోనా పరీక్షచేయగా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. మంత్రికి పాజిటివ్​ రావడంతో ఆయన కుటుంబసభ్యుల […]

Read More