Breaking News

PAKISTAN

పాక్​ విమానాల బ్యాన్​

పాక్‌ విమానాల బ్యాన్‌

వాషింగ్టన్‌: పాకిస్తాన్‌కు అమెరికా పెద్ద షాక్‌ ఇచ్చింది. నకిలీ లైసెన్సుల వివాదం నేపథ్యంలో పాకిస్తాన్‌ విమానయాన సంస్థ (పీఐఏ)పై నిషేధం విధించింది. పీఐఏపై యూరోపియన్‌ యూనియన్‌ ఇప్పటికే నిషేధం విధించింది. పాకిస్తాన్‌ నుంచి అమెరికాకు నడిచే పీఐఏ చార్టర్‌‌ ఫ్లైట్స్‌ అనుమతిని రద్దు చేస్తున్నట్లు యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ ప్రకటించింది. పాకిస్థాన్‌లో సగానికి పైగా పైలెట్‌ లైసెన్సులు నకిలీవని తేలడంతో ప్రంపచవ్యాప్తంగా పలుదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా అమెరికా ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌ఏఏ) […]

Read More
కోహ్లీతో పోల్చవద్దు

కోహ్లీతో పోల్చవద్దు

కరాచీ: బ్యాటింగ్ విషయంలో పదేపదే తనను భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో పోల్చడం సరైంది కాదని పాక్ పరిమిత ఓవర్ల కెప్టెన్​ బాబర్ ఆజమ్ అన్నాడు. ఏ విషయంలోనైనా తనను పాకిస్థాన్ దిగ్గజాలతో పోలిస్తే సంతోషిస్తానన్నాడు. ‘మీరు నన్ను మరెవరితోనైనా పోల్చాలనుకుంటే పాక్ ఆటగాళ్లతోనే పోల్చండి. ఎందుకంటే మియాందాద్, యూనిస్ ఖాన్, ఇంజమామ్​ లాంటి దిగ్గజాలు మాకూ ఉన్నారు. వాళ్లతో పోలిస్తే నా ఘనతలకు సరైన గుర్తింపు వస్తుంది. నేను కూడా బాగా గర్వపడతా. ప్రపంచ క్రికెట్ […]

Read More
దిగ్గజ బ్యాట్స్​మెన్ ఎవర్టన్ వీక్స్ ఇకలేరు

దిగ్గజ బ్యాట్స్​మెన్ ఎవర్టన్ వీక్స్ ఇకలేరు

బ్రిడ్జ్​టౌన్​: వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్​మెన్​ ఎవర్టన్ వీక్స్ (95) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఆరునెలల క్రితం తీవ్రమైన అనారోగ్యం నుంచి కోలుకున్న ఆయన వృద్ధాప్య సమస్యలోనే తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. 1925లో బార్బడోస్​లో పుట్టిన వీక్స్.. 1947–58 మధ్యకాలంలో విండీస్ తరఫున 48 టెస్టులు ఆడాడు. 58.61 సగటుతో 4,455 పరుగులు సాధించాడు. ఇందులో 15 శతకాలు, 19 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 1948లో.. 22 ఏళ్ల వయసులో ఇంగ్లండ్(కింగ్​స్టన్​ ఓవల్)పై టెస్ట్ అరంగేట్రం చేసిన వీక్స్.. […]

Read More
నా మెడపై యూనిస్​ కత్తి పెట్టాడు

నా మెడపై యూనిస్​ కత్తి పెట్టాడు

న్యూఢిల్లీ: బ్యాటింగ్​లో సలహాలు ఇచ్చినందుకు ఓసారి పాకిస్థాన్ మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్.. తనపై మెడపై కత్తిపెట్టాడని కోచ్​గా పనిచేసిన గ్రాంట్ ఫ్లవర్ ఆరోపించాడు. ఆ సమయంలో భయపడడం కంటే.. యూనిస్ మూర్ఖత్వానికి నవ్వొచ్చిందన్నాడు. ‘పాక్ జట్టులో యూనిస్ ఖాన్ భిన్నమైన వ్యక్తి. అన్ని నాకే తెలుసు అని భావిస్తుంటాడు. అందుకే అతనికి కోచింగ్ ఇవ్వడం కష్టం. అయితే బ్రిస్​బేన్​(2016)లో జరిగిన టెస్ట్ మ్యాచ్​ సందర్భంగా జరిగిన సంఘటన నాకు ఇంకా గుర్తుంది. అల్పాహారం సమయంలో బ్యాటింగ్ […]

Read More
హఫీజ్​కు మళ్లీ కరోనా

హఫీజ్​కు మళ్లీ కరోనా

కరాచీ: తొలిసారి చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్​గా తేలాడు.. తాను స్వయంగా వెళ్లి చేయించుకున్న టెస్టుల్లోనూ నెగెటివ్​గా వచ్చిందన్నాడు.. మూడోసారి జరిపిన పరీక్షలో మళ్లీ పాజిటివ్ అంటున్నారు పాక్ బ్యాట్స్​మెన్​ హఫీజ్. కరోనా వ్యవహారంలో ఎక్కడా స్పష్టత రావడం లేదు. పీసీబీ తొలిసారి నిర్వహించిన టెస్టుల్లో మొత్తం పది మంది క్రికెటర్లకు కరోనా సోకినట్లు వైద్య బృందాలు వెల్లడించాయి. అందులో హఫీజ్ కూడా ఉన్నాడు. అయితే ఈ ఫలితాన్ని మరోసారి ధ్రువీకరించుకోవాలనే ఉద్దేశంతో హఫీజ్ స్వయంగా టెస్టు […]

Read More
నాకు కరోనా లేదు

నాకు కరోనా లేదు

కరాచీ: తమ టీమ్​లో పదిమంది క్రికెటర్లు కరోనా బారిన పడ్డారని పాకిస్తాన్​ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రకటించిన మరుసటి రోజే ఆల్​రౌండర్​ మహ్మద్ హఫీజ్ తనకు కరోనా లేదని ప్రకటించాడు. తనతో పాటు కుటుంబ సభ్యులెవరూ ఈ వైరస్ బారిన పడలేదని వెల్లడించాడు. ‘పీసీబీ చెప్పిన విషయాన్ని మరోసారి ధ్రువీకరించుకునేందుకు నేను వ్యక్తిగతంగా టెస్ట్ చేయించుకున్నా. కుటుంబసభ్యులకు కూడా. దేవుడి దయతో నాకు, నా కుటుంబానికి వైరస్ సోకలేదు. అన్ని పరీక్షల ఫలితాలు నెగెటివ్​గా వచ్చాయి. అల్లానే […]

Read More

ఆ టూర్​ నాకు ప్రత్యేకమైంది

చెన్నై: తన కెరీర్ మొత్తంలో 1999లో జరిగిన భారత పర్యటన చాలా ప్రత్యేకమైందని పాకిస్తాన్​ దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్ అన్నాడు. దాదాపు 10ఏళ్ల విరామం తర్వాత, భారత్– పాక్ టెస్ట్ సిరీస్​లో మ్యాచ్ గెలవడం చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నాడు. ‘ఆ పర్యటనకు నేను కెప్టెన్​ను. చెన్నైలో తొలి టెస్ట్. పరిస్థితులన్నీ భిన్నంగా ఉన్నా.. మేం బాగా ఆడాం. దీంతో మ్యాచ్ గెలిచాం. ఇండో–పాక్ చరిత్రలో ఇదే తొలి విజయం కావడంతో మా ఆనందం రెట్టింపు అయింది. […]

Read More

ఆఫ్రిదికి కరోనా

లాహోర్: పాక్​ మాజీ ఆల్​రౌండర్​ షాహిది ఆఫ్రిది.. కరోనా వైరస్​ బారినపడ్డాడు. ప్రస్తుతం అతను చికిత్స తీసుకుంటున్నాడు. ఓ పెద్దస్థాయి క్రికెటర్​కు వైరస్​ సోకడం ఇదే తొలిసారి. ‘గురువారం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నా. జ్వరం కూడా రావడంతో కరోనా పరీక్ష చేయించుకున్నా. పాజిటివ్​గా తేలింది. నేను కోలుకోవాలని మీరు ప్రార్థిస్తారని కోరుకుంటున్నా’ అని ఆఫ్రిది ట్వీట్​ చేశాడు. కరోనా కారణంగా ఆగిపోయిన పాక్​ సూపర్​ లీగ్​లో ఆడిన ఆఫ్రిది.. వైరస్​ వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పుడు తన ఫౌండేషన్​ […]

Read More