Breaking News

NIRANJANREDDY

నా మాటలను వక్రీకరించారు.. విచారం వ్యక్తంచేస్తున్నా: మంత్రి

నా మాటలను వక్రీకరించారు.. విచారం వ్యక్తంచేస్తున్నా: మంత్రి

సారథి ప్రతినిధి, నాగర్​కర్నూల్: నాగర్ కర్నూల్ ​జిల్లా కేంద్రంలో ‘దిశ’ సమీక్ష సమావేశంలో తాను మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ కొన్ని మీడియా సంస్థలు సంచలనం కోసం ప్రసారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంచిందని, ఏ ప్రభుత్వమూ ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికీ ఉద్యోగం కల్పించలేదని, ఉద్యోగం అంటేనే […]

Read More
కరోనా నియంత్రణకు టాస్క్ ఫోర్స్

కరోనా నియంత్రణకు టాస్క్ ఫోర్స్

సారథి, వనపర్తి: కరోనా నియంత్రణకు టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులపై సమీక్షించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుందని తెలిపారు. గురువారం పెబ్బేరులో కలెక్టర్, జిల్లా వైద్యాధికారి, జిల్లా ఆస్పత్రి, డ్రగ్ ఇన్ స్పెక్టర్లతో సమావేశం నిర్వహించారు. డాక్టర్ల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. ఫ్రంట్ లైన్ వారియర్లు అందరికీ అభినందనలు తెలిపారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారిని ఐసొలేషన్ లో ఉంచితే ఇబ్బంది ఉండదని, ఇంటింటి సర్వేలో జ్వరపీడితులను గుర్తించి […]

Read More
జోగుళాంబ సన్నిధిలో మంత్రి నిరంజన్​రెడ్డి

జోగుళాంబ సన్నిధిలో మంత్రి నిరంజన్​రెడ్డి

సారథి న్యూస్, అలంపూర్: అలంపూర్ ​జోగుళాంబ అమ్మవారిని దసరా నవరాత్రుల సందర్భంగా వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారి పల్లకీ సేవలో పాల్గొన్నారు. జడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య పూలమొక్కలు ఇచ్చి స్వాగతం పలికారు. కార్యక్రమంలో అలంపూర్​ఎమ్మెల్యే వీఎం అబ్రహాం, నాయకులు కిషోర్​కుమార్, అలంపూర్ ఇస్మాయిల్ పాల్గొన్నారు.

Read More

తెగుళ్లను అరికడదాం

సారథి న్యూస్, రామాయంపేట: పంటలను ఆశించే తెగుళ్లను సకాలంలో అరికడితేనే అధిక దిగుబడి సాధించవచ్చని నిజాంపేట మండల వ్యవసాయాధికారి సతీశ్​ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మండలంలోని చల్మేడ గ్రామంలో జాతీయ విత్తనోత్పత్తి పథకంలో భాగంగా రైతులకు విత్తనోత్పత్తి చేసే రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విత్తనోత్పత్తి లో తీసుకోవాల్సిన మెలకువలు, పంటను ఆశించు తెగుళ్లు, పురుగులు అరికట్టేవిధానంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో గణేశ్​కుమార్, సర్పంచ్ నరసింహారెడ్డి, రైతులు శ్రీనివాస్ […]

Read More

మంత్రి నిరంజన్​రెడ్డికి ఘన సన్మానం

సారథిన్యూస్​, గద్వాల: జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఆదివారం జెడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య మంత్రులు సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి, శ్రీనివాస్​గౌడ్​ను సన్మానించారు. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. గద్వాల జిల్లా అభివృద్ధికి సహకరించాలని ఆమె మంత్రులను కోరారు. కార్యక్రమంలో పలువురు టీఆర్​ఎస్​ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Read More

దోమపోటును తరిమేద్దామిలా..

సారథి న్యూస్, రామాయంపేట: ప్రస్తుతం వాతవరణ పరిస్థితుల్లో వరిపంటకు దోమపోటు, ఆకు ఎండుతెగులును గమనించామని మెదక్​ జిల్లా నిజాంపేట వ్యవసాయాధికారి సతీశ్​ పేర్కొన్నారు. వీటిని నివారిస్తే వరిలో అధికదిగుబడి సాధించవచ్చని చెప్పారు. బాక్టీరియా ఆకు ఎండు తెగులు నివారణకు ప్లాంటో మైసిన్ 100 గ్రామ్, లేదా కాపర్ ఆక్సీ క్లోరైడ్ , 600 గ్రాములు లీటరు నీటికి కలిపి ఒక ఎకరంలో పిచికారీ చేసుకోవాలని సూచించారు. ఇక అగ్గితెగులు నివారణకు ట్రైసాక్లోజల్ 120 గ్రామ్ లేదా ఐసోప్రాథయోలిన్ […]

Read More

గద్వాల మార్కెట్ చైర్​పర్సన్​గా రామేశ్వరమ్మ

సారథిన్యూస్​, గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా మార్కెట్ కమిటీ చైర్​పర్సన్​గా రామేశ్వరమ్మ ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం రామేశ్వరమ్మకు రాష్ట్ర ప్రభుత్వం నియామక ఉత్తర్వులు అందజేసింది. ఈ సందర్భంగా ఆమెను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​రెడ్డి అభినందించారు. రామేశ్వరమ్మ నేతృత్వంలో మార్కెట్​కమిటీ మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన ఆకాంక్షించారు. కాగా తనపై నమ్మకం ఉంచి పదవి కట్టబెట్టినందుకు రాష్ట్ర మంత్రులు కేటీఆర్​, సింగిరెడ్డి నిరంజన్​రెడ్డికి రామేశ్వరమ్మ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Read More
రైతులు ఏకం కావాలి

రైతులు ఏకం కావాలి

సారథి న్యూస్​, మానవపాడు: జనాభాలో 60 శాతం ఉన్న రైతులు, రైతు అనుబంధ రంగాలను ఒక్క తాటిపైకి తీసుకురావడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయశాఖ మంత్రి ఎస్​.నిరంజన్​రెడ్డి పేర్కొన్నారు. అందుకోసమే ప్రభుత్వం రైతు వేదికలను నిర్మిస్తున్నదని చెప్పారు. శనివారం ఆయన జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్​ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఆయా సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచంలో కొన్ని దేశాలు మాత్రమే వ్యవసాయ ఆధారిత దేశాలని.. అందులో మనదేశం ఒకటని […]

Read More