కర్నూలు జిల్లాలో భారీవర్షం నంద్యాల డివిజన్‌లో 93.88 మి.మీ. వర్షపాతం పొంగిన నదులు, వాగులు, వంకలు మునిగిన లోతట్టు ప్రాంతాలు, కాలనీలు ప్రజలను కాపాడిన అగ్నిమాపక సిబ్బంది సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లాలో శనివారం భారీవర్షం కురిసింది. కుండపోత వాన కురవడంతో లోతట్టు, నది పరీవాహక ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహించాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం అర్ధరాత్రి వరకు వాన కురుస్తూనే ఉంది. జిల్లాలోని కుందూ, హంద్రీ, శ్యాంనదులు […]
సారథి న్యూస్, కర్నూలు: వచ్చే మూడు రోజుల వరకు భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని నంద్యాల ఏరియాలోని లోతట్టు ప్రాంత కాలనీవాసులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ సూచించారు. నంద్యాల వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. నంద్యాల డివిజన్ లో మహానంది, నంద్యాల టౌన్, రూరల్, బండి ఆత్మకూరు, మంత్రాలయం తదితర మండలాల్లో ఎక్కువ వర్షం కురవడంతో కుందూనది, శ్యాం కాల్వ తదితర వాగులన్నీ ఉధృతంగా ప్రవహించాయని అన్నారు. వరద ప్రాంతాల్లో […]
సారథి న్యూస్, కర్నూలు: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనువాదులు దళితులు, మైనార్టీలు, ఇతర కులాల పేదలపై దాడులు పెరిగాయని కాంగ్రెస్ నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు క్ష్మినరసింహా యాదవ్ ఆరోపించారు. సోమవారం నంద్యాల చెక్ పోస్టు సమీపంలోని పార్టీ ఆఫీసులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 7న అంబేద్కర్ ఇంటిపై జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందన్నారు. ఈ దాడులను ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలన్నారు. దాడికి నిరసనగా మంగళవారం అన్ని నియోజకవర్గాల్లో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనలు […]
సారథి న్యూస్, కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 71వ జయంతి వేడుకలను నంద్యాల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనరసింహయాదవ్ ఆధ్వర్యంలో బుధవారం నంద్యాల చెక్ పోస్టు దామోదరం సంజీవయ్య సర్కిల్ సమీపంలోని ఆఫీసులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలుచేశారని కొనియాడారు. తాగు, సాగునీరు అందించిన ఘనత వైఎస్సార్‌కే దక్కిందన్నారు. ఆయన ఆశయసాధనకు కాంగ్రెస్‌పార్టీ కృషిచేస్తుందన్నారు. రాహుల్‌గాంధీని ప్రధానమంత్రి చేయాలని కలలుగన్నారని గుర్తుచేశారు. […]
సారథి న్యూస్, కర్నూలు: దేశంలో ఆర్థిక సంస్కరణలకు నాంది పలికిన మహానుభావుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని కాంగ్రెస్ నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు లక్ష్మీనరసింహయాదవ్ కొనియాడారు. పాణ్యం నియోజకవర్గ పరిధిలోని నంద్యాల చెక్ పోస్టు సమీపంలో కాంగ్రెస్ ఆఫీసులో పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి పీవీ చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు భరత్ కుమార్ ఆచారి, కాంగ్రెస్ జిల్లా […]
ఒకరి మృతి.. పలువురికి అస్వస్థత సంఘటనస్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ, జేసీ సారథి న్యూస్, కర్నూలు: విశాఖపట్నం ఆర్‌ఆర్ వెంకటాపురం గ్రామంలోని ఎల్‌జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీకేజీ దుర్ఘటనను మరవక ముందే కర్నూలు జిల్లా నంద్యాలలో అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. శనివారం నంద్యాలలోని ఏస్పీవై ఆగ్రో కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్లీక్అవడంతో ఒకరు మృత్యువాతపడ్డారు. పలువురు అస్వస్థతకు గురయ్యారు. నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో కెమికల్ ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ పైప్ లీకై బ్లాస్ట్ కావడంతో ఫ్యాక్టరీ మేనేజర్ […]
సారథి న్యూస్, నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాలలో నూతనంగా ఏర్పాటు చేయబోయే మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి అవసరమయ్యే స్థలాన్ని నంద్యాల నూనెపల్లి వద్ద ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్ప రవిచంద్రకిషోర్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బిజేంద్రరెడ్డి శుక్రవారం పరిశీలించారు. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యరంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వారు అన్నారు. ఆరోగ్యం అనేది పేదవాడికి, సామాన్యుడికి ఒక హక్కు మాదిరిగా ఉండాలనే […]
సారథిన్యూస్, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో భారీగా నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. సుమారు రూ. 30 లక్షలు విలువైన 15 క్వింటాళ్ల పత్తి విత్తనాలను, వాటిని ప్యాకింగ్ చేసే మిషనరీని, సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ జిల్లా చండూరు మండలం కమ్మగూడెంలో నకిలీ విత్తనాలు ఉన్నట్టు పోలీసులకు సమాచారమందింది. కూపీ లాగగా.. ఏపీ, తెలంగాణకు చెందిన ఓ ముఠా ఈ నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు జోగుళాంబ గద్వాల, […]