ఎమ్మెల్యేను ఏమన్నా ఊరుకోం ప్రజల కోసం సేవచేసే వారిపై విమర్శలు సరికాదు మీడియా సమావేశంలో టీఆర్ఎస్ నేతలు సామాజిక సారథి తిమ్మాజిపేట: అన్నివర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషిచేస్తూ నియోజకవర్గంలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తున్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై అనవసరమైన ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు హెచ్చరించారు. అభివృద్ధిపై బీఎస్పీ నాయకులు కలిసి వస్తే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బీఎస్పీ ఎదుగుదల కోసం దిగజారి మాట్లాడటం […]
రైతుల నోట్లల్లో మట్టి కొట్టొద్దు బీఎస్పీ ఆధ్వర్యంలో ఆందోళన నేతల అరెస్ట్… పోలీస్ స్టేషన్‌కు తరలింపు సామాజిక సారథి, బిజినేపల్లి: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులకు అక్రమంగా నల్లమట్టిని చెరువుల నుంచి తోడి ప్రాజెక్టుకు తరలింపు నిలిపివేయాలని నాగర్ కర్నూల్ బీఎస్పీ ఆధ్వర్యంలోమంగళవారం ఆందోళన నిర్వహించారు. నాగర్ కర్నూల్ అసెంబ్లీ ఇన్చార్జ్బండి పృథ్విరాజ్ కార్యకర్తలతో బిజినేపల్లి మండలం మహాదేవునిపేట శివారులో నల్లమట్టిని తరలిస్తున్న ప్రాంతానికి చేరుకుని వాహనాలను అడ్డుకుని భైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాగర్‌కర్నూల్ […]
సామాజిక సారథి, నాగర్‌కర్నూల్ ప్రతినిధి: ప్రముఖ నటుడు ఆర్.నారాయణమూర్తి తెరకెక్కించిన రైతన్న సినిమాను బుధవారం ఉదయం నాగర్‌కర్నూల్‌లోని రామకృష్ణ టాకీస్ లో ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి తిలకించారు. రైతన్నలు ఎదుర్కొంటున్న కష్టాలు, బాధలను మూర్తన్న చాలా బాగా ఆవిష్కరించారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రైతుల నేపథ్యంలో వచ్చిన ఇలాంటి చిత్రాలను మనమంతా ఆదరించాలి, ఆశీర్వదించాలి, అఖండ విజయం అందించాలి. అది మన బాధ్యత’ అని గుర్తుచేశారు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసి కూడా […]
ఇంటింటికీ బీఎస్పీ.. గడపగడపకు ఏనుగు ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం.. సమస్యలపై నిలదీస్తాం బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్ ‘సామాజిక సారథి’తో చిట్‌చాట్ సామాజిక సారథి, నాగర్‌కర్నూల్ ప్రతినిధి: ఇంటింటికీ బహుజన్సమాజ్పార్టీని తీసుకెళ్లడంతో పాటు గడపగడపకు ఏనుగు గుర్తును మోసుకెళ్తామని ఆ పార్టీ నాగర్‌కర్నూల్‌జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్చెబుతున్నారు. ప్రజల పక్షాల నిలబడతామని భరోసా కల్పిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కందనూలు గడ్డపై నీలిజెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘ఓటు హమారా.. సీటు తుమ్హరా.. నలే ఛలేగా’ […]
సామాజిక సారథి, నాగర్‌కర్నూల్ ప్రతినిధి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయ విమాన గోపురం స్వర్ణం తాపడానికి నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి రెండు కేజీల బంగారాన్ని శుక్రవారం ఆలయ ఈవో గీతారెడ్డికి అందజేశారు. తెలంగాణ కళావైభవం చాటేలా, ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. గతంలో ఆయన సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ముందుకొచ్చి.. తాజాగా రెండు కేజీల బంగారాన్ని అందజేశారు. నారసింహుడి ఆలయాన్ని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి కుటుంబసమేతంగా […]
సామాజిక సారథి, బిజినేపల్లి: వట్టెం నవోదయ విద్యాలయం ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలోని ప్రతిభావంతులైన విద్యార్థులను తీర్చిదిద్దాలని నాగర్ కర్నూల్ ఎంపీ పి.రాములు ఆకాంక్షించారు. శుక్రవారం నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ భాస్కర్ కుమార్, అధ్యాపకులు భాస్కరాచారి హైదరాబాద్ లో ఆయనను కలిసి బొకే ఇచ్చి, శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీ రాములు మాట్లాడుతూ.. వట్టెం నవోదయ విద్యాలయంలో విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు వివిధ రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో స్థిరపడి గుర్తింపు పొందడం అభినందనీయమన్నారు. […]
సామాజిక సారథి, వెల్దండ: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని బైరాపూర్ గ్రామ సర్పంచ్ దార్ల కుమార్ జన్మదిన వేడుకలను మంగళవారం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల మధ్య అట్టహాసంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు విలువైన ఆట వస్తువులు, ఇతర పరికరాలను పంపిణీ చేశారు. అనంతరం మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా చిన్నారులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి కచ్చితంగా ఎంపీటీసీల సంఘం తరఫున ఎమ్మెల్సీ పోటీలో ఉంటామని సంఘం నాయకులు సుహాసినిరెడ్డి, ఆంజనేయులు ప్రకటించారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలను ఓట్లకు మాత్రమే వాడుకుంటున్నారని ఆక్షేపించారు. మండలిలో గెలిచిన ఎమ్మెల్సీలు ఎంపీటీసీల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇక ప్రజాప్రతినిధులు బెదిరించినా […]