Breaking News

MINISTER

మంత్రి ఈటల పేషీలో కరోనా!

సారథిన్యూస్​, హైదరాబాద్​: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్​ కార్యాలయంలో కరోనా కేసులు రావడం ఆందోళన కలిగిస్తున్నది. ఈటలకు చెందిన 7 గురు వ్యక్తిగత సిబ్బందికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో మంత్రి ఈటల కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నట్టు సమాచారం. మంత్రికి చెందిన ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు పీఏలు, ముగ్గురు గన్‌మెన్లకు ప్రస్తుతం కరోనా సోకింది. వారంతా హోమ్​ ఐసోలేషన్​లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. దీంతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు […]

Read More

దోమపోటును తరిమేద్దామిలా..

సారథి న్యూస్, రామాయంపేట: ప్రస్తుతం వాతవరణ పరిస్థితుల్లో వరిపంటకు దోమపోటు, ఆకు ఎండుతెగులును గమనించామని మెదక్​ జిల్లా నిజాంపేట వ్యవసాయాధికారి సతీశ్​ పేర్కొన్నారు. వీటిని నివారిస్తే వరిలో అధికదిగుబడి సాధించవచ్చని చెప్పారు. బాక్టీరియా ఆకు ఎండు తెగులు నివారణకు ప్లాంటో మైసిన్ 100 గ్రామ్, లేదా కాపర్ ఆక్సీ క్లోరైడ్ , 600 గ్రాములు లీటరు నీటికి కలిపి ఒక ఎకరంలో పిచికారీ చేసుకోవాలని సూచించారు. ఇక అగ్గితెగులు నివారణకు ట్రైసాక్లోజల్ 120 గ్రామ్ లేదా ఐసోప్రాథయోలిన్ […]

Read More

వానొచ్చాక మన రోడ్ల సిత్రాలు

సారథి న్యూస్, రామడుగు: మాములు సమయాల్లో ఎలాగో కష్టపడుతూ ఆ గుంతలు, మిట్టలో కాస్త ఇబ్బందికరంగానైనా మనం రోడ్డు ప్రయాణాలు చేస్తుంటాం.. కానీ వానొచ్చనప్పడు వాటి పరిస్థితి ఇంకా భయంకరంగా ఉంటుంది. రోడ్డు నిండా నిలిచిన నీళ్లు.. ఎక్కడ ఏ గొయ్యి ఉందో తెలియదు. కళ్లు మూసుకొని దేవుడిమీదే భారం వేసి వెళ్లాల్సి వస్తుంది. కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలో ఇటీవల కురిసిన భారీవర్షాలకు రోడ్లు గతుకులు పడ్డాయి.. శ్రీరాముల పల్లి రోడ్డును ఆనుకొని, మోడల్ […]

Read More
పర్యాటక కేంద్రంగా కోయిల్​సాగర్​

పర్యాటక కేంద్రంగా కోయిల్​సాగర్​

సారథి న్యూస్, దేవరకద్ర: ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని కోయిల్​సాగర్​ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. అందుకోసం సీఎం కేసీఆర్ సుముఖత వ్యక్తంచేశారని వెల్లడించారు. కోయిల్ సాగర్ ప్రాజెక్టులో మత్స్య శాఖ ఆధ్వర్యంలో దేవరకద్ర, నారాయణపేట ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డి, ఎస్.రాజేందర్ రెడ్డితో కలసి శనివారం 7.7లక్షల చేపపిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కోయిల్ సాగర్ తో పాటు కోయిలకొండ, రామగిరిగుట్ట, రాంకొండ ప్రాంతాలు పర్యాటక కేంద్రాల […]

Read More

కిషన్​రెడ్డి వెబ్​సైట్​ హ్యాక్

న్యూఢిల్లీ: కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్​రెడ్డి వ్యక్తిగత వెబ్​సైట్​ హ్యాక్​కు గురైంది. తన వెబ్​సైట్​లో పాకిస్థాన్​కు అనుకూలంగా పోస్టులు ఉండటంతో ఆయన ఈ విషయాన్ని గుర్తించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున కిషన్​రెడ్డి వెబ్​సైట్​ను హ్యాక్​చేసిన దుండగులు ‘అందులో కశ్మీర్​ ఆజాదీ’ అంటూ పోస్టులు పెట్టారు. దీంతో పాటు మనదేశానికి సంబంధించిన వ్యతిరేక పోస్టులు పెట్టారు. కాగా ఈ విషయంపై కిషన్​రెడ్డి సైబర్​క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం సాంకేతిక బృందం వెబ్‌సైట్‌ను పునరుద్ధరిస్తోంది. కిషన్​రెడ్డి వెబ్​సైట్​ను ఉగ్రవాదులు హ్యాక్​ […]

Read More

బాలు త్వరగా కోలుకోవాలి

సారథిన్యూస్​, హైదరాబాద్​: గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని, ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్​రావు ఆకాంక్షించారు. ఈమేరకు ఆయన గురువారం ట్వీట్​ చేశారు. ఎస్పీ బాలు కరోనాతో చెన్నైలోని ఎంజీఎం దవాఖానలో చికిత్సపొందుతున్నారు. ఆయన ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని యావత్ దేశం ప్రార్థిస్తోంది. అభిమానులతో పాటు సినీ, రాజకీయ, పారిశ్రామిక, క్రీడా ప్రముఖులు కూడా బాలు ఆరోగ్యం మెరుగుపడాలని […]

Read More

ఆందోళన వద్దు.. అండగా ఉంటాం

సారథిన్యూస్​, వరంగల్​: వరదబాధితులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటామని మంత్రులు కేటీఆర్​, ఈటల, ఎర్రబెల్లి దయాకర్​, సత్యవతి రాథోడ్​ హామీ ఇచ్చారు. మంగళవారం వారు వరంగల్​ నగరంలో పర్యటించారు. మంత్రులు కేటీఆర్​, ఈటల రాజేందర్​ హైదరాబాద్​ నుంచి వరంగల్​కు హెలీక్యాప్టర్​లో వెళ్లారు. అనంతరం ఎర్రబెల్లి సత్యవతి రాథోడ్​తో కలిసి వరంగల్ నగరంలోని నయీం నగర్, సమ్మయ్య నగర్, గోపాలపూర్, పెద్దమ్మగడ్డ – యూనివర్సిటీ రోడ్, పోతన నగర్, బొందివాగు రోడ్, రామన్నపేట, హంటర్ రోడ్, సంతోషిమాత గుడి ప్రాంతం, […]

Read More
వరద బాధితులను ఆదుకుంటాం

వరద బాధితులను ఆదుకుంటాం

సారథి న్యూస్​, ఖమ్మం: నిర్వాసితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ హామీ ఇచ్చారు. మున్నేరు కాల్వ ఉధృతంగా ప్రవహించడంతో నిర్వాసితులైన ప్రజలకు ఖమ్మం నయాబజార్​ పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో క్యాంపు ఏర్పాటుచేశారు. ఆదివారం మంత్రి పువ్వాడ అజయ్​ నిర్వాసితులను కలిసుకొని వారితో మాట్లాడారు. నిర్వాసితులతో ధైర్యం చెప్పారు. అనంతరం మంత్రి మున్నేరు ఉధృతిని పరిశీలించారు. మున్నేరు ప్రవహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసేలా నోట్ తయారు చేయాలని మున్సిపల్ కమిషన్ అనురాగ్ […]

Read More