సారథి న్యూస్, నిజాంపేట: ప్రజలకు కొంతకాలం నీళ్ల కష్టాలు తప్పవని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సింగూర్ జలాశయానికి నీళ్లు వస్తే ప్రజలకు నీళ్లకష్టాలు పోతాయని చెప్పారు. మంగళవారం ఆమె మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఆడబిడ్డలకు నీటికష్టాలు ఉండరాదని సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ ప్రాజెక్టును ప్రారంభించారని చెప్పారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ సిద్దరాములు, జెడ్పీటీసీ పంజా విజయ్‌కుమార్, తహసీల్దార్ […]
సారథిన్యూస్, రామాయంపేట: పంటలకు చీడపీడలు ఆశించకుండా రైతన్నలు క్రిమిసంహారక మందులు పిచికారి చేయడం సహజమే. అయితే ఈ సమయంలో అన్నదాతలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయశాఖ నిపుణులు సూచిస్తున్నారు. పురుగుమందులు మనిషి శరీరాన్ని తాకినా పొరపాటున శరీరంలోకి వెళ్లినా ఎంతో ప్రమాదం. వ్యవసాయ అధికారుల సూచన మేరకు వారు చెప్పిన మోతాదులోనే క్రిమిసంహారక మందులు పిచికారి చేయాలి. పంట మొక్కల స్థాయిని బట్టి స్ప్రే డబ్బాలను ఉపయోగించాలి. పత్తి పంటలో హ్యాండ్ పంపుకు బదులు తైవాన్, పవర్ […]
మెదక్ జిల్లాలో అన్ని మండలాలకు వ్యాప్తి ప్రజల్లో తీవ్ర భయాందోళన 272 మందికి పాజిటివ్ ఇప్పటికే 12 మంది మృతి సారథి న్యూస్, మెదక్: మెతుకు సీమను కరోనా వణికిస్తోంది.. మెదక్ జిల్లాలో వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది. గత జూన్ లో జిల్లాలోని కొన్ని పట్టణాల్లో మాత్రమే కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, జూలై నెలలో క్రమంగా జిల్లాలోని అన్ని మండలాలకు వ్యాపించాయి. పాజిటివ్ కేసుల సంఖ్య వందకు చేరడం, మరణాల సంఖ్య పది దాటడంతో […]
సారథిన్యూస్, నిజాంపేట: వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నియంత్రిత సాగు విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయాధికారులు రైతులు ఏయే పంటలు సాగుచేశారో పరిశీలిస్తున్నారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటవివరాలు నమోదు చేసుకుంటున్నారు. మెదక్ జిల్లాలోనూ ఈ కార్యక్రమం చురుగ్గా సాగుతున్నది. జిల్లాలో ఇప్పటికే 95 శాతం పంటనమోదు ప్రక్రియ పూర్తయినట్టు అధికారులు పేర్కొన్నారు. రైతులు తమ పంటలను మార్కెట్ చేసుకొనేందుకు ఇబ్బందులు పడకుండా ముందుగానే పంటవివరాలు […]
సారథి న్యూస్, మెదక్: వరలక్ష్మి వ్రతం సందర్భంగా శుక్రవారం మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల ఆలయంలో పూజారులు వనదుర్గామాత విగ్రహానికి అభిషేకం నిర్వహించారు. పుష్పాలంకరణ చేశారు. ప్రత్యేక కుంకుమార్చన నిర్వహించారు. భక్తులు దర్శించుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
సారథి న్యూస్, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలో ఐదు కరోనా కేసులు నమోదు కావడంతో కలకలం చెలరేగింది. స్థానిక పీహెచ్‌సీ లో రాపిడ్ టెస్ట్ లు ప్రారంభించడంతో స్థానికంగా ఉన్న వారితో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందినవారు సైతం టెస్ట్ లు చేయుంచుకుంటున్నారు. దీంతో కేసులు కొత్తగా వెలుగు చూస్తున్నాయి. మూడు రోజుల నుంచి మొత్తం ఐదుకేసులు నమోదు కావడంతో స్థానిక ప్రజాప్రతినిధులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. మేజర్ గ్రామ పంచాయతీ కావడం తో […]
సారథి న్యూస్, మెదక్: ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమానికి ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని మెదక్‌జిల్లా కలెక్టర్ఎం. ధర్మారెడ్డి శనివారం సూచించారు. పంద్రాగస్టు రోజున తయారుచేసిన ఆవిష్కరణల ప్రదర్శన ఉంటుందన్నారు. గ్రామీణ, విద్యార్థి, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు సంబంధించిన ఆవిష్కరణలను ఆన్లైన్లో ప్రదర్శించవచ్చని సూచించారు. వివరాలను 9100678543 నంబర్ కు వాట్సాప్ ద్వారా ఈనెల 31వ తేదీ వరకు పంపించాలని కోరారు. మరిన్ని వివరాలకు 83285 99157లో సంప్రదించాలని సూచించారు.
సారథి న్యూస్, మెదక్: జిల్లాలో మాతా శిశు మరణాలు తగ్గేలా చూడాలని వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందికి కలెక్టర్ఎం.ధర్మారెడ్డి సూచించారు. శనివారం కలెక్టరేట్లో జిల్లాలోని ఆయా ఆస్పత్రుల డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లతో సమావేశం నిర్వహించారు. గర్భిణులు, బాలింతలకు ఎప్పడికప్పుడు అవసరమైన సలహాలు, సూచనలు అందించాలన్నారు. కాన్పు సమయంలో ఇబ్బందులు ఎదురుకాకుండా రక్తం ఉండేలా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటేశ్వర్రావు, ఈవోఎంహెచ్ఎన్ సుమిత్రారాణి, అదనపు జిల్లా వైద్యాధికారి రాజు, జిల్లా సర్వేలైన్స్ ఆఫీసర్ డాక్టర్ మల్కాజి […]