Breaking News

MAHABUBNAGAR

అలంపూర్​లో నిరసన తెలుపుతున్న ఓ కుటుంబం

జీతాల్లేక పస్తులుంటున్నాం

సారథి న్యూస్​, అలంపూర్: జూన్​ నుంచి తమకు జీతాలు ఇవ్వడం లేదని.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పీటీఐలు (పార్ట్​ టైం ఇన్​స్ట్రక్టర్​) ఆందోళన చేపట్టారు. ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో సుమారు 240 మంది పీటీఐలు పనిచేస్తున్నారు. వీరంతా సర్వ శిక్షా అభియాన్​ కింద పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తమను ఆదుకోవాలని.. తమకు జీతభత్యాలు ఇవ్వాలని వారు డిమాండ్​ చేశారు. ఇండ్ల వద్ద ఉండి కుటుంబసమేతంగా ఆందోళనకు దిగారు.

Read More
ఉద్యోగాన్ని సొంతపనిలా భావించాలె

ఉద్యోగాన్ని సొంతపనిలా భావించాలె

సారథి న్యూస్​, మహబూబ్ నగర్: నూతనంగా నియమితులైన డిప్యూటీ తహసీల్దార్లు నిజాయితీగా పనిచేసి పేదలకు అండగా నిలవాలని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ సూచించారు. ఉద్యోగాన్ని కూడా తమ సొంత పనిలా భావించి కష్టపడి పనిచేస్తే రాణిస్తారని హితబోధ చేశారు. శనివారం ఆయన మహబూబ్ నగర్ జడ్పీ మీటింగ్​హాల్​లో నూతన డిప్యూటీ తహసీల్దార్లకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెవెన్యూ శాఖకు గతం నుంచి మంచిపేరు ఉందన్నారు. సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బ్యాక్​లాగ్​ ద్వారా భర్తీచేసిన […]

Read More
మంత్రి కేటీఆర్ కు ఊహించ‌ని షాక్

మంత్రి కేటీఆర్ కు ఊహించ‌ని షాక్

సారథి న్యూస్, మ‌హ‌బూబ్ న‌గ‌ర్: జిల్లా పర్యటనలో మంత్రి కేటీఆర్ కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. సోమవారం ప‌లు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వ‌చ్చిన ఆయ‌న వీర‌న్నపేటలో 660 డ‌బుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించారు. అక్కడి నుంచి బ‌య‌లుదేరుతున్న స‌మ‌యంలో మంత్రి కాన్వాయ్ కు ఓ కుటుంబం అడ్డుకుంది. త‌మ భూమిని క‌బ్జా చేసి టీఆర్ఎస్ నేత‌లు డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు క‌ట్టార‌ని, తమను బెదిరిస్తున్నార‌ని న్యాయం చేయాల‌ని వారు డిమాండ్ చేశారు. అయితే […]

Read More
ప్రతిపక్షాల విమర్శలు అర్థరహితం

ప్రతిపక్షాల విమర్శలు అర్థరహితం

వైద్యసిబ్బందిలో ఆత్మవిశ్వాసం దెబ్బతీయొద్దు కరోనాకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం మహబూబ్​నగర్ ​మెడికల్ ​కాలేజీ ప్రారంభోత్సవంలో మంత్రి కె.తారకరామారావు సారథి న్యూస్, మహబూబ్​నగర్: కరోనాకు పేద, ధనిక అనే తేడాలు ఉండవని, ఎవరికైనా రావచ్చని మున్సిపల్​శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. కరోనాపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. నిర్మాణాత్మక సూచనలు చేస్తే స్వీకరిస్తామని హితవుపలికారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా కేంద్రంలో సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో రూ.450 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ ​కాలేజీని […]

Read More
12 మంది పోలీసులకు కరోనా

డ్యూటీలో అప్రమత్తంగా ఉండండి

సారథి న్యూస్, మహబూబ్​నగర్: జిల్లాలో కరోనా మహమ్మారి పెరుగుతోంది. జిల్లాలో 12 మంది పోలీసులకు కరోనా పాజిటివ్​గా తేలింది. విధుల్లో ఉండే పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ రెమారాజేశ్వరి సూచించారు. డ్యూటీలో ఉన్న సమయంలో సామాజిక దూరం పాటిస్తూనే తప్పనిసరిగా మాస్క్​లు కట్టుకోవాలని సూచించారు. జిల్లాలో తొలి కరోనా మరణం నమోదైంది. నవాబ్​పేట మండలం కొల్లూరు గ్రామంలో మీసేవ నిర్వాహకుడు కరోనాతో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు.

Read More

గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

సారథిన్యూస్​, మహబూబ్​నగర్ : మహబూబ్​నగర్​ జిల్లా బాదేపల్లి గ్రామంలోని రెండు దుకాణాల్లో రూ. లక్షా డెబ్బైవేలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను జడ్చర్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను బాదేపల్లికి చెందిన దొంతుల విజయ్, మహేశ్​గా గుర్తించారు. వారిని అదుపులోకి కేసు నమోదు చేశారు. ప్రభుత్వం నిషేధించిన గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తే కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు.

Read More

గురుకులాల ప్రవేశ ఫలితాలు రిలీజ్​

సారథి న్యూస్​, మహబూబ్​నగర్​: తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాల సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్మీడియట్​, ఒకేషనల్​ కళాశాలల్లో ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను సంస్థ వెబ్​సైట్​ www.tswreis.ac.inలో అందుబాటులో ఉంచినట్టు గురుకులాల మహబూబ్​ నగర్​ రీజినల్​ కోఆర్డినేటర్​ ఫ్లారెన్స్​రాణి తెలిపారు. వీటితోపాటు 6 నుంచి 9 తరగతుల్లో బ్యాక్​లాగ్ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్టు సోమవారం వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులకు ఆయా స్కూళ్ల ప్రిన్సిపాల్స్​ సమాచారం అందిస్తారని చెప్పారు. […]

Read More

సొంతూళ్లకు వలసకూలీలు

సారథి న్యూస్, మహబూబ్ నగర్: వలస కార్మికులను స్వస్థలాలకు పంపేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మహబూబ్ నగర్ సమీపంలోని ధర్మాపూర్, ఎర్రవల్లి తాండా, దొడ్డలోనిపల్లి గ్రామాల్లోని ఇటుక బట్టీల్లో దాదాపు 300 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిని సొంతూళ్లకు పంపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వీరంతా మహబూబ్ నగర్ నుంచి ఘట్​కేసర్ వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన బస్సుల్లో .. అక్కడి నుండి రైళ్ళలో స్వస్థలాలకు వెళ్లనున్నారు.శుక్రవారం మంత్రి శ్రీనివాస్​గౌడ్​ వీరికోసం ఏర్పాటుచేసిన బస్సులను పరిశీలించారు. […]

Read More