Breaking News

పీటీఐ

అలంపూర్​లో నిరసన తెలుపుతున్న ఓ కుటుంబం

జీతాల్లేక పస్తులుంటున్నాం

సారథి న్యూస్​, అలంపూర్: జూన్​ నుంచి తమకు జీతాలు ఇవ్వడం లేదని.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పీటీఐలు (పార్ట్​ టైం ఇన్​స్ట్రక్టర్​) ఆందోళన చేపట్టారు. ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో సుమారు 240 మంది పీటీఐలు పనిచేస్తున్నారు. వీరంతా సర్వ శిక్షా అభియాన్​ కింద పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తమను ఆదుకోవాలని.. తమకు జీతభత్యాలు ఇవ్వాలని వారు డిమాండ్​ చేశారు. ఇండ్ల వద్ద ఉండి కుటుంబసమేతంగా ఆందోళనకు దిగారు.

Read More