Breaking News

LOCKDOWN

భోపాల్​లో సంపూర్ణ లాక్​డౌన్​

భోపాల్​: కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్​ రాజధాని భోపాల్​లో 10 రోజుల పాటు సంపూర్ణ లాక్​డౌన్​ విధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయించింది. పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాలు, కూరగాయలు, రేషన్​ దుకాణాలకు మినహాయింపు ఇచ్చినట్టు హోంమంత్రి నరోత్తం మిశ్రా ప్రకటించారు. ఈ నెల 24 (శుక్రవారం) నుంచి 10 రోజులపాటు లాక్​డౌన్​ అమల్లో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.

Read More
కరోనాతో ఏడుగురు మృతి

రామడుగులో కరోనా కల్లోలం

సారథిన్యూస్, రామడుగు: కరోనా మహమ్మారి మారుమూల పట్టణాలకు పాకింది. తాజాగా కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలో రెండు కరోనా పాజిటివ్​ కేసులు నమోదైనట్టు వైద్య అధికారులు వెల్లడించారు. దీంతో ప్రజల్లో భయాందోళన నెలకొన్నది. బుధవారం నుంచి 4రోజుల పాటు పట్టణంలో సంపూర్ణ లాక్​డౌన్​ పాటించాలని గ్రామపంచాయతీ పిలుపునిచ్చింది. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే కిరాణా దుకాణాలు తెరుస్తామని ఆ సమయంలోనే సరుకులు కొనుగోలు చేయాలని పంచాయతీ పేర్కొన్నది. నిబంధనలు అతిక్రమించినవారికి […]

Read More
నితిన్​ పెళ్లి డేట్​ ఫిక్స్​

నితిన్​ పెళ్లి డేట్ ఫిక్స్​

కరోనాతో వాయిదా పడ్డ టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ – షాలిని వివాహానికి ముహూర్తం కుదిరింది. ఏప్రిల్ 16ననే వీరి పెళ్లి జరగాల్సిఉండగా లాక్​డౌన్​తో వాయిదా పడింది. దీంతో జూలై 26న రాత్రి 8.30 నిమిషాలకు వీరి పెళ్లికి ఇరుకుటుంబాల పెద్దలు ముహూర్తం పెట్టించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిరాడంబరంగా వివాహ వేడక జరుగనున్నది. ఇరుకుటుంబాల వారు మాత్రమే ఈ వేడుకకు హాజరుకానున్నారు. హైదరాబాద్​లోని ఫలక్ నుమా ప్యాలస్​లో పెళ్లి జరుగనున్నట్టు సమాచారం. భీష్మ సినిమాతో సూపర్హిట్‌ను […]

Read More

ఉత్తరాఖండ్​లోనూ వీకెండ్​ లాక్​డౌన్​

డెహ్రాడూన్​: కరోనాను కట్టడి చేసేందుకు ఉత్తరాఖండ్​ ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకున్నది. నాలుగు జిల్లాల్లో శని, ఆదివారాల్లో లాక్​డౌన్​ విధిస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న డెహ్రాడూన్, హరిద్వార్​, ఉధమ్​సింగ్​ నగర్​, నైనిటాల్​లో లాక్​డౌన్​ కొనసాగనున్నది. పరిశ్రమల్లో పనిచేసే సిబ్బందికి, వ్యవసాయపనులకు, నిర్మాణరంగ పనులకు మినహాయింపు ఇచ్చారు. మద్యం దుకాణాలు, హోటల్లు తెరుచుకోవచ్చు. అయితే మిగతా ప్రైవేట్​ కార్యాలయాలు, మార్కెట్లు, షాపింగ్​ మాల్స్​ మూసేయాల్సిందే. కరోనాను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు […]

Read More

నిత్యావసర వస్తువులు పంపిణీ

సారథి న్యూస్​, రామడుగు: కరోనా లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ఓ స్వచ్చందసంస్థ ఆదుకుంది. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలోని జెబెల్​ అలీ ప్రాంతంలోని లేబర్​ క్యాంపు​లో తలదాచుకుంటున్న పేదలకు ఎల్లాల శ్రీనన్న సేవాసమితి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సేవాసమితి ఉపాధ్యక్షుడు బాలు బొమ్మిడి, మీడియా కోఆర్డినేటర్​ చిలుముల రమేశ్​, ముఖ్య సలహాదారులు మోహన్ రెడ్డి, అశోక్ జంగం, సోషల్ మీడియా కోర్డినేటర్ శ్రీనివాస్ గౌడ్, మాల్యాల, జెబెల్ […]

Read More

మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం

షిల్లాంగ్​: కరోనాను కట్టడి చేసేందుకు మేఘాలయ ప్రభుత్వం కఠినచర్యలు తీసుకుంటున్నది. జూలై 24 నుంచి 31 వరకు ఆ రాష్ట్ర సరిహద్దులను పూర్తిగా మూసివేయనున్నది. కరోనా కట్టడిలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్​రాడ్​ సంగ్మా బుధవారం మీడియాకు తెలిపారు. అత్యవసర సేవలను మాత్రమే రాష్ట్రంలోకి అనుమతించనున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు మేఘాలయ రాష్ట్రంలో 270 కరోనా కేసులు నమోదయ్యాయి. చిన్నరాష్ట్రమైనప్పటికి అత్యధిక సంఖ్యలో టెస్టులు చేస్తూ.. ఎప్పటికప్పడు కరోనాను కట్టడి చేస్తున్న మేఘాలయను […]

Read More
షార్ట్ న్యూస్

బీహార్​లో లాక్​డౌన్​!

పాట్నా: బీహార్​లో మరోసారి లాక్​డౌన్​ విధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉన్నతాధికారులతో సమావేశం కానున్నది. దీనిపై ఆ రాష్ట్ర సీఎస్​ దీపక్ ‌కుమార్ మాట్లాడుతూ.. ‘సీఎం నితీష్ కుమార్‌ అధ్యక్షతన ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల క‌ట్టడి గురించి సమీక్షించ‌నున్నారు. పెరుగతున్న కేసుల దృష్ట్యా రాష్ట్రంలో మరోసారి పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించే ఆలోచన ఉంది’ అని ఆయన తెలిపారు. అయితే […]

Read More
మద్యం ఆదాయమే మస్త్​

మద్యం ఆదాయమే మస్త్​

సారథి న్యూస్​, హైదరాబాద్​: కరోనా దెబ్బకు ప్రపంచమే తలకిందులైంది. ఆర్థికంగా ఎంతో ఎత్తుకు ఎదిగామని భావిస్తున్న దేశాలు కూడా వైరస్‌ కాటుకు కకావికలమయ్యాయి. అందులో తెలంగాణ ప్రభుత్వం కూడా ఒకటి. లాక్‌డౌన్‌ కాలంలో పరిశ్రమలు, దుకాణాలతో పాటు అన్నిరంగాలు మూసివేశారు. దీంతో వ్యాపారం జరగలేదు. రాష్ట్రానికి రావాల్సిన పన్నులు కూడా రావడం లేదు. ఉన్న డబ్బంతా ఊడ్చుకుపోయింది. దీంతో ప్రభుత్వం ఉద్యోగుల జీతాల్లో కూడా కోత విధించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, ఇప్పుడు లాక్‌డౌన్‌ సడలింపు తర్వాత […]

Read More