Breaking News

LOCKDOWN

ప‌దిరోజుల్లోనే 8 ల‌క్షల కేసులు

ప‌దిరోజుల్లోనే 8ల‌క్షల కేసులు

24 గంట‌ల్లో 96,551 మందికి పాజిటివ్ 45 ల‌క్షలు దాటిన క‌రోనా కేసులు న్యూఢిల్లీ: భార‌త్‌లో క‌రోనా వ్యాప్తి నానాటికీ ఆందోళ‌న‌క‌రంగా మారుతోంది. ఈ నెల‌లో మొద‌టి ప‌దిరోజుల్లోనే (నిన్నటిదాకా) 8 ల‌క్షల కేసులు వచ్చాయంటే దేశంలో మ‌హ‌మ్మారి ఎంత‌లా విజృంభిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇక శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుద‌ల చేసిన గ‌ణాంకాల ప్రకారం గ‌త 24 గంట‌ల్లోనూ కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 96,551గా నమోదైంది. తాజా కేసుల‌తో దేశంలో ఈ […]

Read More
లాక్​ డౌన్​.. అసంఘటిత రంగంపై దాడి

లాక్​ డౌన్​.. అసంఘటిత రంగంపై దాడి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్​డౌన్​.. అసంఘటిత రంగం మీద మోడీ సర్కారు చేసిన మూడో దాడి అని కాంగ్రెస్ మాజీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. కొద్దిరోజులుగా ఆయన దేశ ఆర్థిక వ్యవస్థ, బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగడుతున్నారు. ఈ వీడియో సిరీస్ లో భాగంగా బుధవారం రాహుల్ స్పందిస్తూ.. ప్రధాని మోదీ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కోవిడ్ పై పోరులో భాగంగా 21 రోజులు యుద్ధం […]

Read More
లాక్ డౌన్ కు సహకరించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు

లాక్ డౌన్ కు సహకరించిన వారికి కృతజ్ఞతలు

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: కరోనా నేపథ్యంలో గతంలో లాక్ డౌన్ కు సహకరించిన ప్రజలు, వ్యాపారులకు మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్, ఎస్సై సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్​లో సమావేశంలో వారు మాట్లాడుతూ.. కొన్నిరోజులుగా కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని, 9 రోజులుగా లాక్ డౌన్ విధించడం వల్ల కరోనా వ్యాప్తి చెందకుండా నివారించగలిగామని అన్నారు. సెప్టెంబర్ 1 నుంచి అన్ని వ్యాపార సంస్థలు యథావిధిగా నడుపుకోవాలని సూచించారు. […]

Read More
సెప్టెంబర్‌ 30 వరకు స్కూల్స్ బంద్​

సెప్టెంబర్‌ 30 వరకు స్కూల్స్ బంద్​

100 మందికి మించకుండా సభలు, సమావేశాలు సెప్టెంబర్‌ 7 నుంచి దేశవ్యాప్తంగా మెట్రో సేవలు చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు ఇళ్లకే పరిమితం కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాలు జారీ న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వైరస్‌ కారణంగా విధించిన లాన్‌డౌన్‌ నిబంధనలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు శనివారం అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాలు విడుదల చేసింది. సెప్టెంబర్‌ 30 వరకు స్కూళ్లు, మాల్స్‌ తెరవకూడదని కేంద్రప్రభుత్వం పేర్కొంది. అలాగే పలు […]

Read More
‘పవర్ గ్రిడ్’ జీఎంకు ఘన సన్మానం

‘పవర్ గ్రిడ్’ జీఎంకు ఘన సన్మానం

సారథి న్యూస్, కర్నూలు: కరోనా లాక్​డౌన్​సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన కర్నూలు నగర పోలీసులకు ఆహారం ప్యాకెట్లను పంపిణీ చేసిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కర్నూలు డిప్యూటీ జనరల్ మేనేజర్​ప్రకాశ్​ను గురువారం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఘనంగా సన్మానించి ప్రశంసాపత్రం అందజేశారు. కార్యక్రమంలో హోంగార్డు కమాండెంట్ రామ్మోహన్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ రాధాక్రిష్ణ, ఎఆర్ డీఎస్పీ ఇలియాజ్ బాషా, ఆర్ఐ లు సురేంద్రరెడ్డి, వెంకటేశ్వర్ రావు, వెంకటరమణ పాల్గొన్నారు.

Read More

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి

సారథి న్యూస్​, రామగుండం: కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సీపీఐ నేతలు కనకరాజ్, యాకయ్య, నరేశ్​ డిమాండ్​ చేశారు. గురువారం కరీంనగర్​ జిల్లా రామగుండం ప్రభుత్వాస్పత్రిని సీపీఐ నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరోనాను అరికట్టడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కనీసవసతులు లేవని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నేతలు వైవీ రావు, మద్దెల దినేశ్​, తోకల రమేశ్​ తదితరులు పాల్గొన్నారు.

Read More
31వరకు లాక్​డౌన్​

పెద్దశంకరంపేటలో 31 వరకు లాక్​డౌన్​

సారథి మీడియా, పెద్దశంకరంపేట: మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో ఈనెల 31 వరకు లాక్​డౌన్​ కొనసాగించనున్నారు. ఈ మేరకు గురువారం వ్యాపారస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. గురువారం పెద్ధశంకరంపేటలోని పద్మయ్య పంక్షన్​హాల్​లో మండల ప్రజాప్రతినిధులు, వ్యాపారులు సమావేశమయ్యారు. మండలంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వ్యాపారులు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్​, తహసీల్దార్​, ఎస్సై, టీఆర్​ఎస్​ మండలాధ్యక్షుడు మురళి పంతులు, సర్పంచ్​ల ఫోరం మండలాధ్యక్షడు కుంట్ల రాములు, మండల పరిషత్​ ఉపాధ్యక్షడు […]

Read More

నిజాంపేటలో 31 వరకు లాక్​డౌన్​

సారథి న్యూస్​, రామాయంపేట: కరోనా వైరస్​ తీవ్రరూపం దాల్చుతున్న ప్రస్తుత తరుణంలోనిజాంపేట మండల కేంద్రంలో ఈ నెల 31 వరకు లాక్​డౌన్​ పొడగించాలని గ్రామపంచాయతీ తీర్మానించింది. ఈ సందర్భంగా సర్పంచ్ అనూష మాట్లాడుతూ.. కరోనా వైరస్ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లఘించిన వారికి రూ. 5000 జరిమానా విధిస్తున్నట్లు ఆమె తెలిపారు. బుధవారం లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ముగ్గురు షాప్ యజమానులకు జరిమానా విధించినట్టు ఆమె […]

Read More