Breaking News

KOLLAPUR

విద్యావలంటీర్లకు అండగా ఉంటాం

విద్యావలంటీర్లకు అండగా ఉంటాం

బీజేపీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు సారథి, కొల్లాపూర్: రాష్ట్ర ప్రభుత్వం చేతిలో దగాపడ్డ విద్యా వలంటీర్లకు అండగా ఉంటామని బీజేపీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎల్లేని సుధాకర్ రావు భరోసా ఇచ్చారు. నాగ్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో గురువారం జరిగిన ‘దగాపడ్డ విద్యావలంటీర్లకు చేయూత’ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా కష్టకాలంలో వారి బతుకులు చితికిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. వారి న్యాయమైన డిమాండ్ల […]

Read More
పల్లెప్రగతి పనులు పూర్తిచేయాలి

పల్లెప్రగతి పనులు పూర్తిచేయాలి

సారథి, పెద్దకొత్తపల్లి(కొల్లాపూర్): గ్రామాల్లో కొనసాగుతున్న పల్లె ప్రగతి అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేయాలని ఎంపీడీవో కృష్ణయ్య సూచించారు. బుధవారం స్థానిక ఎంపీడీవో ఆఫీసులో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతుల కల్లాలు, వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం, పలు రకాల పనుల పురోగతిపై మాట్లాడారు. వానాకాలంలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

Read More
ద్యుత్ సమస్యను అధిగమించాం

విద్యుత్ సమస్యను అధిగమించాం

వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కల్వకోల్, కుడికిళ్లలో సబ్ స్టేషన్ల ప్రారంభం సారథి, కొల్లాపూర్: రాష్ట్రంలో వ్యవసాయానికి లోవోల్టేజీ సమస్య అధిగమించేందుకు అవసరమైన విద్యుత్ సబ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్, కొల్లాపూర్ మండలం కుడికిళ్లలో విద్యుత్ సబ్ స్టేషన్ ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతాంగానికి ఉచిత విద్యుత్ అందిస్తున్న […]

Read More
‘జ్ఞానయుద్ధ భేరి’ పోస్టర్ల ఆవిష్కరణ

‘జ్ఞానయుద్ధ భేరి’ పోస్టర్ల ఆవిష్కరణ

సారథి న్యూస్​, కొల్లాపూర్: ఈనెల 28న కొల్లాపూర్​లో జరిగే స్వేరోస్ జ్ఞానయుద్ధ భేరి సభను జయప్రదం చేయాలని స్వేరోస్ సీనియర్ రిసోర్స్ పర్సన్ డాక్టర్ సోలపోగుల స్వాములు కోరారు. సోమవారం ఆయన కొల్లాపూర్ మండలంలోని ఎన్మన్ బెట్ల, జవాయిపల్లి, సింగోటం కొండ్రావుపల్లి, కల్వకోల్, కుడికిళ్ల గ్రామాల్లో పర్యటించి యువకులు, విద్యార్థులకు జ్ఞాన యుద్ధభేరి సభ ఆవశ్యకత, ప్రాముఖ్యత, ఉద్దేశ్యాన్ని వివరించారు. అనంతరం వారిచేత పోస్టర్లు, కరపత్రాలు, స్టిక్కర్లను విడుదల చేయించారు. అంతకుముందు కొల్లాపూర్​ సీఐ వెంకట్ రెడ్డి, […]

Read More
28న స్వేరోస్ జ్ఞానయుద్ధ భేరి సభ

28న స్వేరోస్ జ్ఞానయుద్ధ భేరి సభ

సారథి న్యూస్, కొల్లాపూర్: ఈనెల 28న కొల్లాపూర్ లో జరిగే స్వేరోస్ జ్ఞానయుద్ధ భేరి సభను సక్సెస్ ​చేయాలని స్వేరోస్ ఇంటర్​నేషనల్ నెట్​వర్క్ ​సీనియర్ రిసోర్స్ పర్సన్ డాక్టర్ సోలపోగుల స్వాములు కోరారు. శుక్రవారం కొల్లాపూర్ నియోజకవర్గంలో గ్రామ కమిటీల నిర్మాణంలో భాగంగా ఎల్లూర్ గ్రామంలో గడపగడపకు తిరిగి జ్ఞానయుద్ధభేరి సభ ఆవశ్యకతను తెలిపారు. బోరబండతండా, అంజనగిరి తండాల్లో గురుకులాలు, చదువు అవసరాన్ని వివరించారు. నల్లమల అటవీ ప్రాంతంలోని కృష్ణానది ఒడ్డున ఉన్న ఎర్రగట్టు బొల్లారం మొలచింతలపల్లి, […]

Read More
ముగిసిన మాజీ ఎమ్మెల్యే కటికనేని అంతిమయాత్ర

మాజీ ఎమ్మెల్యే కటికనేనికి కన్నీటి వీడ్కోలు

సారథి న్యూస్, కొల్లాపూర్: కొల్లాపూర్​ మాజీ ఎమ్మెల్యే కటికనేని మధుసూదన్ రావుకు అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. బుధవారం అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమయాత్ర కొల్లాపూర్ పట్టణంలో కొనసాగించారు. పట్టణంలోని మినీ స్టేడియంలో ఆయన పార్థివదేహాన్ని ఉంచారు. ప్రజలు వివిధ మండలాలకు చెందిన వివిధ పార్టీల నేతలు, టీడీపీ వర్గీయులు, ఆయన బంధుమిత్రులు, అభిమానులు సందర్శించి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలో అంతిమయాత్ర కొనసాగింది. కొల్లాపూర్ నుంచి తన స్వగ్రామం నార్లపూర్ కు తీసుకువెళ్లి దహన సంస్కారాలు […]

Read More
ఎల్లూరు వెళ్తున్న కాంగ్రెస్​నేతల అరెస్ట్​

ఎల్లూరు వెళ్తున్న కాంగ్రెస్ ​నేతల అరెస్ట్​

సారథి న్యూస్, నాగర్​కర్నూల్: కొల్లాపూర్ వద్ద ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగమైన ఎల్లూర్ లిఫ్ట్ ప్రాజెక్టు పంపులు మునిగిపోవడంతో పరిశీలించేందుకు వెళ్తున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ ఎ.రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ డాక్టర్​మల్లురవి, ఏఐసీసీ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ సంపత్ కుమార్ ను నాగర్​కర్నూల్​జిల్లా తెల్కపల్లి పోలీసులు అడ్డుకుని అరెస్ట్​ చేశారు. ఈ సమయంలో ఎంపీ రేవంత్​రెడ్డి కాలికి గాయమైంది.

Read More
కొల్లాపూర్​ అభివృద్ధి చెందాలి

కొల్లాపూర్​ అభివృద్ధి చెందాలి

సారథి న్యూస్​, నాగర్​కర్నూల్​: కొల్లాపూర్​ మరింత అభివృద్ధి చెందాలని నాగర్​కర్నూల్​ జిల్లా కలెక్టర్​ ఎల్​.శర్మన్​ ఆకాంక్షించారు. ఆదివారం ఆయన మార్నింగ్​ వాక్​లో భాగంగా కొల్లాపూర్ లో పర్యటించారు. పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ఆ మేరకు ప్రణాళికలతో అధికారులు ముందుకు సాగాలని సూచించారు. మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పట్టణాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని సూచించారు. కరెంట్​ బిల్లులు నెలనెలా చెల్లించాలని, విద్యుత్​ను పొదుపుగా వాడాలని సూచించారు. పట్టణంలో డంపింగ్ ​యార్డ్​ పనులను కంప్లీట్​ చేయాలన్నారు. […]

Read More