సారథి న్యూస్,రామడుగు: చిన్న పిల్లలకు , గర్భిణులు, బాలింతలకు పౌష్టిక ఆహారం అందించే అంగన్వాడీ కేంద్రాలు వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. తాగునీటి వసతి లేక.. కరెంట్ కనెక్షన్ కూడా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. రామడుగు మండల కేంద్రంలో మొత్తం 3 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అన్ని సెంటర్లలో వసతులు లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకొని మౌలికవసతులు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
సారథిన్యూస్, అమరావతి: సరదాగా ఆడుకోవడానికి కారులోకి వెళ్లిన చిన్నారులు డోర్ లాక్కావడంతో ఊపిరాడక మృతిచెందారు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లెలో చోటు చేసుకుంది. అప్సానా ,యాసిన్ ,పర్వీన్ అనే ముగ్గురు చిన్నారులు ఆడుకోవడం కోసం తమ ఇంటి దగ్గర పార్క్ చేసిన కారులోకి ఎక్కారు. అయితే ప్రమాదవశాత్తూ ఆ కారు డోర్ లాక్ అయ్యింది. దీంతో ఆ చిన్నారులు బయటకు వచ్చేందుకు ఎంతగానో ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. దీంతో ముగ్గురు […]
సారథిన్యూస్, హైదరాబాద్: కరోనా సృష్టించిన సంక్షోభం ఇప్పుడు పసిపిల్లలపైనా పడింది. ఆన్‌లైన్ క్లాసుల పేరుతో చిన్నపిల్లలు తరుచూ ల్యాప్టాప్, ట్యాబ్, స్మార్ట్ ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల ముందు గంటల తరబడి ఉండాల్సి వస్తున్నది. దీంతో పిల్లల కళ్లపై తీవ్ర భారం పడతుందని.. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కంటి సంబంధిత వ్యాధులు వస్తాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.ఎనిమిది గంటలపాటు..ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభమైన తర్వాత విద్యార్థులు డిజిటల్ పరికరాలను వినియోగించడం పరిపాటిగా మారింది. మొదట్లో రెండు లేదా మూడు గంటలే […]
సారథిన్యూస్, ఖమ్మం: ఇద్దరు పిల్లలతో కలిసి ఓ విలేకరి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యానాంకు చెందిన ముమ్మిడి శ్రీనివాస్(36) ప్రజాశక్తి దినపత్రికలో విలేకరిగా పనిచేస్తున్నాడు. కాగా శనివారం అతడు తన ఇద్దరు పిల్లలతో కలిసి యానాంలోని గోదావరి నదిలోకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.