తెలంగాణ గడ్డలో రాచరికపోడలు చెల్లవ్ ఉపఎన్నికలో ఓడించారనే రైతులపై వేదింపులు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు నల్లగొండ, ఖమ్మం పర్యటనలో ఘన స్వాగతం సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: తెలంగాణా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అసమర్థ పాలన కొనసాగుతోందని, ఇదే విషయాన్ని సర్వేలు కూడా వెల్లడించాయని హుజూరాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఆయన ఆదివారం పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ […]
సామాజిక సారథి, వైరా: ఖమ్మం జిల్లా వైరా మండలంలోని పాలడుగు, రెబ్బవరం, గొల్లపూడి గ్రామాల్లో వైరస్ సోకిన మిర్చి తోటలను శనివారం ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా మిర్చి తోటలకు తామరపురుగు తెగులు ఆశిస్తున్నట్లు గుర్తించారు. దీని నివారణకు తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారిణి అపర్ణ, మండల వ్యవసాయ శాఖ అధికారి పవన్ కుమార్, ఏఈవోలు వెంకట్ నర్సయ్య, వాసంతి కేవీకే శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
సామాజిక సారథి, వైరా: సచివాలయాలు, దేవాలయాలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న సీఎం కేసీఆర్ పేద విద్యార్థులకు బాకీ పడ్డ బోధనా రుసుము ఉపకార వేతనాల చెల్లింపుకు సంవత్సరాలుగా నిధులు ఎందుకు విడుదల చేయడం లేదని పీడీఎస్యూ అధ్యక్షుడు ఎం.అజాద్ ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా వైరాలో శుక్రవారం పీడీఎస్ యూ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆజాద్ మాట్లాడుతూ కొవిడ్ […]
సామాజిక సారథి, వైరా: ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు, సేవలందించడంలో ఉద్యానవన శాఖ విఫలమైందని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బొంతు రాంబాబు ఆరోపించారు. వైరా మండలంలోని పలు గ్రామాల్లో రైతు సంఘం బృందం వైరస్ సోకిన మిర్చి తోటలను గురువారం పరిశీలించింది. పలువురు రైతులు వైరస్ తో దెబ్బతిన్న మిర్చి తోటలను ఈ బృందానికి చూపించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ మిర్చి సాగులో 50శాతం మంది కౌలు రైతులు ఉన్నారని, […]
సామాజిక సారథి, ఖమ్మం: ఖమ్మం జిల్లా చింతకాని జడ్పీ హైస్కూల్లో కరోనా కలకలం సృష్టించింది. బుధవారం పాఠశాలలోని 100మంది విద్యార్థులకు కరోనా టెస్టులు చేయగా ఐదుగురికి పాజిటివ్ నిర్ధారణ అయింది. పదోతరగతిలో ఇద్దరికి, 6,8,9 తరగతులకు చెందిన ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్ నిర్ధారణయిందని వైద్య సిబ్బంది తెలిపారు.
సారథి, ఖమ్మం: కరోనా ఉధృతి నేపథ్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాలో కొనసాగుతున్న లాక్ డౌన్ అమలుతీరుపై ఆయా జిల్లాల ఎస్పీలతో వరంగల్, కరీంనగర్ రేంజ్ డీఐజీ ప్రమోద్ కుమార్ శుక్రవారం ఖమ్మం పోలీస్ కమిషనర్ ఆఫీసులో సమీక్షించారు. రాష్ట్ర సరిహద్దు అంతర్గత రహదారుల చెక్ పోస్టుల్లో అమలవుతున్న లాక్ డౌన్ తీరును అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్ తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ […]
సారథి న్యూస్, ములుగు: నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విధుల నిర్వహణలో భాగంగా ఎన్నికల అధికారులకు మంగళవారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో రెండవ విడత ట్రైనింగ్ ఇచ్చారు. రెవెన్యూ డివిజనల్ అధికారి, సహాయ ఎన్నికల అధికారి కె.రమాదేవి మాట్లాడుతూ.. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక జంబో బ్యాలెట్ బాక్స్, పెద్ద బ్యాలెట్ బాక్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ డ్యూటీని జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ములుగు తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, డీఏవో శ్రీనివాస్, […]
సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో గురువారం భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. అనంతరం ఆమె ప్రభుత్వ జూనియర్ కాలేజీ, హైస్కూల్, హాస్పిటల్, తహసీల్దార్, ఎంఈవో, ఎంపీడీవో కార్యాలయాలతో పాటు పోలీస్ స్టేషన్లను సందర్శించి ప్రచారం నిర్వహించారు. ఆమె వెంట వాజేడు మండల […]