సారథి న్యూస్, వాజేడు: ఖమ్మం జిల్లా వెంకటాపురం సబ్ ఆఫీస్ పరిధిలోని గుమ్మడి దొడ్డి బ్రాంచ్ ఆఫీస్ లో పనిచేస్తున్న పాయం ప్రసాద్ ఇటీవల మృతిచెందాడు. సోమవారం వెంకటాపురంలో అతడి భార్య పాయం శకుంతలకు పోస్టల్ సిబ్బంది లైఫ్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ డబ్బులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం డివిజనల్ సూపరింటెండెంట్, భద్రాచలం నార్త్ అసిస్టెంట్ సూపర్ డెంట్ తదితరులు పాల్గొన్నారు.
ఆమె ఓ అందమైన యువతి.. ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈజీ మనికి అలవాటు పడింది. డబ్బున్నవాళ్లను పరిచయం చేసుకోవడం.. వారిని ముగ్గులోకి దించడం ఆమె హాబీ. పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు లేదా సోషల్‌మీడియాలో ఆమె ధనవంతులను పరిచయం చేసుకుంటుంది. తర్వాత వారితో మత్తెక్కించేలా మాట్లాడుతుంది. అనంతరం వాళ్లను తన ఇంటికి తీసుకెళ్లి.. శారీరకంగా లొంగదీసుకుంటుంది. అనంతరం అక్కడ సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియోలు తీస్తుంది. ఆ తర్వాత ఆ వీడియోలు సోషల్‌మీడియాలో పెడతానంటూ బెదిరించి లక్షల్లో […]
సారథి న్యూస్, ఖమ్మం: తెలంగాణలో ఇటీవల మావోయిస్టుల కదలికలు కనిపిస్తుండటంతో పోలీస్‌శాఖ ఇప్పటికే అప్రమత్తమైంది. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ముగ్గురు యువతులు ఓకే రోజు అదృశ్యమయ్యారు. అయితే వీరికి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయా? వీరు అడవి బాటపట్టారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. అశ్వారావుపేట మండలం చెన్నాపురం కాలనీకి(గొత్తికోయ కాలనీ) చెందిన ముగ్గురు యువతులు ఈ నెల 16వ నుంచి కనిపించకుండా పోయారు. అందులో ఓ యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుమేరకు పోలీసులు […]
సారథిన్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పామాయిల్ సాగును ప్రోత్సహించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కోరారు. రాష్ట్రానికి కాళేశ్వరం జలాలు పుష్కలంగా వస్తున్నాయని.. ఖమ్మం జిల్లాకు వరప్రదాయిని అయిన సీతారామ ప్రాజెక్టు జలాలు కూడా త్వరలోనే వస్తాయని అందువల్ల ప్రభుత్వం పామాయిల్ సాగును ప్రోత్సహిస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని రైతులు లాభపడతారని పేర్కొన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. పామాయిల్ మొక్కల పెంపకానికి ప్రభుత్వం ప్రోత్సాహకం అందించాలని కోరారు. రాష్ట్రంలో కొత్తగా ఫ్యాక్టరీలు కూడా […]
సారథి న్యూస్, సత్తుపల్లి : కరోనా విపత్తువేళ.. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గొప్పమనసు చాటుకున్నారు. తన నియోజకవర్గంలో కరోనాతో బాధపడుతున్న రోగులకు తనవంతుగా రూ.500 ఆర్థికసాయం, కూరగాయలు, నిత్యవసరాలు అందజేశారు. ( 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కేజీ మంచినూనె, ఉల్లిపాయలు, ఉప్మారవ్వ, కారం, పసుపు, ఉప్పు, పంచదార, సబ్బులు, కూరగాయలు, 30 కోడిగుడ్లు) కరోనా వ్యాధిసోకిన నిరుపేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే సాయం చేసినట్టు చెప్పారు. కరోనా పట్ల ఎవరూ ఆందోళన […]
సారథిన్యూస్, ఖమ్మం: రాష్ట్రంలోని నిరుపేదలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రాములు నాయక్ పేర్కొన్నారు. సోమవారం ఆయన ఖమ్మం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో 25 మంది లబ్ధిదారులకు నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను ఎమ్మెల్యే రాములు నాయక్ లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మార్క్‌ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, టీఆర్ఎస్ జిల్లా ఇంచార్జి కృష్ణ టీఆర్ఎస్ నేతలు కోసూరి శ్రీనివాసరావు, పిచ్చయ్య, మధు, మాలోతు శకుంతల, సత్యనారాయణ, […]
సారథి న్యూస్, ఖమ్మం: ఆదివాసీలకు ఎల్లప్పుడూ అండగా ఉండి, వారి హక్కులను పరిరక్షిస్తామని భారత మానవహక్కుల మండలి తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మద్దిశెట్టి సామేలు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం చెరుకుపల్లి పంచాయతీ తురకలగూడెం గ్రామంలో గురువారం మానవహక్కుల బృందం పర్యటించింది. ఈ సందర్భంగా గిరిజనలకు మాస్కులు పంపిణీ చేశారు. అనంతరం వారి ఇండ్లను పరిశీలించారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల బాగోగులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో పలువురు గిరిజన సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
సారథిన్యూస్, ఖమ్మం: ఓ పోలీస్ అధికారి తీసుకున్న చొరువ నిండు ప్రాణాన్ని రక్షించింది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా రోగులను ఎవరూ దగ్గరికి రానీయడం లేదు. ఈ క్రమంలో పురుటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని పోలీస్అధికారి సకాలంలో దవాఖానలో చేర్పించి ఆమె ప్రాణాలను కాపాడారు. ఖమ్మం జిల్లా మధిర పట్టణం.. ఎస్సీ కాలనీకి చెందిన ఒక గర్భిణికి కరోన పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కాగా శుక్రవారం రాత్రి సదరు మహిళకు పురిటినొప్పులు వచ్చాయి. చుట్టుపక్కల ప్రజలు […]