ఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు చోట్ల భారీ పేలుళ్లు జరిపి అల్లకల్లోలం సృష్టిద్దామనుకున్న ఉగ్రవాదుల కుట్రను ఎన్ఐఏ ( నేషనల్ ఇన్విస్టిగేషన్ ఎజెన్సీ) భగ్నం చేసింది. కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్ఐఏ అధికారులు మెరుపుదాడి నిర్వహించి 9 మంది ఆల్‌ఖైదా టెర్రరిస్టులను అరెస్ట్ చేశారు. టెర్రరిస్టులు దేశరాజధాని ఢిల్లీలో భారీ పేలుళ్లకు స్కెచ్ వేశారని అధికారుల దర్యాప్తులో తేలింది. కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులం, వెస్ట్ బెంగాల్ లో ముషీరాబాద్ లో ఉగ్రవాదులను పట్టుకున్నారు. ఓ వైపు దేశం […]
14 రోజులు.. 12 లక్షల కేసులు.. 15వేల చావులు భారత్‌లో కరోనా ఉగ్రరూపం.. మరణాలు 79 వేలు 48 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు న్యూఢిల్లీ : రోజులు గడుస్తున్న కొద్దీ భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న దేశాల్లో ప్రపంచ దేశాలను దాటుకుని రెండోస్థానానికి ఎగబాకిన భారత్.. రోజూవారీ కేసులు, మరణాలలోనూ ముందే ఉండడం ఆందోళనకరమైన అంశం. గత 50రోజులుగా వైరస్ వ్యాప్తి పట్టపగ్గాల్లేకుండా పోతోంది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన […]
కొంతకాలంగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వైరస్ పుట్టిన దేశమైన చైనా సేఫ్జోన్లో ఉండగా.. మిగిలిన దేశాలన్నీ ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరయ్యాయి. చైనాలోని వూహాన్ ల్యాబ్‌లోనే ఈ వైరస్‌ను పట్టించారని తొలినుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే చైనాకు చెందిన ఓ వైరాలజిస్ట్ చేస్తున్న ఆరోపణలు ప్రస్తుతం ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. కరోనా వైరస్ జంతువుల మాంసం నుంచి రాలేదు. ఇది మనుషులే తయారు చేశారు. దీనిపై నావద్ద ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు […]
24 గంటల్లో 96,551 మందికి పాజిటివ్ 45 లక్షలు దాటిన కరోనా కేసులు న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వ్యాప్తి నానాటికీ ఆందోళనకరంగా మారుతోంది. ఈ నెలలో మొదటి పదిరోజుల్లోనే (నిన్నటిదాకా) 8 లక్షల కేసులు వచ్చాయంటే దేశంలో మహమ్మారి ఎంతలా విజృంభిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇక శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లోనూ కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 96,551గా నమోదైంది. తాజా కేసులతో దేశంలో ఈ […]
రెండురోజుల్లోనే సుమారు రెండు లక్షల కరోనా కేసులు మహారాష్ట్రలో 9 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ వారంలో మొదటి రెండ్రోజుల్లో 80వేల లోపు నమోదైన కోవిడ్-19 పాజిటివ్ కేసులు.. బుధవారం నుంచి మళ్లీ 95వేలు దాటాయి. బుధవారం దేశవ్యాప్తంగా 97,399 కేసులు రాగా.. గురువారం ఆ సంఖ్య 95,735 కు చేరింది. దీంతో రెండు రోజుల్లోనే భారత్‌లో సుమారు రెండు లక్షల (1,93,134) మంది మహమ్మారి బారిన పడ్డారు. […]
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం సృష్టిస్తున్నది. గత 24 గంటల్లోనే దాదాపు 90,632 కొత్తకేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. మరోవైపు 1065 మంది కరోనాకు బలయ్యారు. మొత్తం కేసులసంఖ్య 41,13,811 కు పెరిగింది. ప్రస్తుతం 8,62,320 యాక్టివ్ కేసులు ఉండగా.. 70,626 మంది మృత్యువాత పడ్డారు. కాగా కొంత ఊరటనిచ్చే అంశం ఏమిటంటే.. ఇప్పటివరకు 31,80,865 మంది కోలుకున్నారు. టెస్టులు ఎక్కువగా చేస్తున్నందునే.. ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ […]
న్యూఢిల్లీ : భారత్ లో కోవిడ్-19 ఉధృతి నానాటికీ విజృంభిస్తున్నది. దేశంలో శుక్రవారం రికార్డుస్థాయిలో 86,432 కరోనా కేసులు నమోదు కావడంతో.. మొత్తం కేసుల సంఖ్య 40 లక్షలు (40,23,179) దాటింది. దీంతో ప్రపంచంలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న దేశాల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ మూడో స్థానానికి చేరింది. బ్రెజిల్ కు మన దేశానికి మధ్య వ్యత్యాసం 70 వేల కేసులు మాత్రమే. ఇక శుక్రవారం దేశవ్యాప్తంగా 1,089 మంది కరోనా బారినపడి మరణించగా.. […]
మాస్కో: సరిహద్దుల్లో చైనా అనుసరిస్తున్న దుందుడుకు వైఖరి వల్లే ఇరు దేశాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని భారత్ ఆరోపించింది. ఈ మేరకు రెండు దేశాల రక్షణ శాఖ మంత్రులు పాల్గొన్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) రక్షణ మంత్రుల సమావేశంలో.. చైనా తీరును భారత్ ఎండగట్టినట్టు తెలుస్తోంది. సరిహద్దుల వద్ద చైనా ప్రదర్శిస్తున్న వైఖరిపై భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు అధికారిక వర్గాల సమాచారం. రెండు గంటల […]