Breaking News

INDIA

హాంకాంగ్‌ నుంచి టిక్‌టాక్‌ నిష్క్రమణ

హాంకాంగ్‌: ఇండియాలో ఇప్పటికే నిషేధానికి గురైన టిక్‌టాక్‌ దాదాపు 6బిలియన్‌ డాలర్ల నష్టాన్ని మూతగట్టుకుంది. అమెరికా కూడా దాన్ని నిషేధించాలనే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో హాంకాంగ్‌ నుంచి కూడా టిక్‌టాక్‌ నిష్క్రమించింది. మంగళవారం ఈ విషయాన్ని ప్రకటించింది. దీంతో దాదాపు 1.50లక్షల మంది యూజర్లను టిక్‌టాక్‌ కోల్పోనుంది. హాంకాంగ్‌ స్వయం ప్రతిపత్తిని కాలరాస్తూ చైనా పార్లమెంట్‌ ఈ మధ్య కాలంలో జాతీయ భద్రతా చట్టానికి ఆమోదం తెలిపింది. అక్కడ నిరసనలు మొదలయ్యాయి. సోషల్‌ మీడియా […]

Read More
మోడీ పర్యటన ధైర్యం నింపింది

మోడీ పర్యటన ధైర్యం నింపింది

న్యూఢిల్లీ: ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సైనికుల్లో చాలా ధైర్యం నింపిందని ఐటీబీపీ చీఫ్‌ ఎస్‌ ఎస్‌.దేశ్వాల్‌ అన్నారు. ‘ప్రధాని పర్యటన సైనికుల్లో చాలా ధైర్యాన్ని నింపింది. ఆయన ప్రసంగం చాలా బలాన్ని ఇచ్చింది. దేశంలోని పొలిటికల్‌ లీడర్‌‌ షిప్‌, ఆర్మీ జవాన్లు దేశం కోసం పనిచేస్తున్నారు. వాళ్లంతా సరిహద్దు భద్రతకు అంకితమయ్యారు. భారత సైన్యం, వైమానిక దళం, ఐటీబీపీలోని సైన్యానికి మనోధైర్యం చాలా ఎక్కువ’ అని ఢిల్లీలో అతిపెద్ద కొవిడ్‌ […]

Read More
ఇండియా.. రష్యాకు చేరువలో

ఇండియా.. రష్యాకు చేరువలో

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. రోజుకు దాదాపు 20వేలకు పైగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఒక్కరోజులోనే 22,771 కేసులు నమోదైనట్లు కేంద్ర హెల్త్‌ మినిస్ట్రీ శనివారం హెల్త్‌ బులిటెన్‌ రిలీజ్‌ చేసింది. దీంతో కేసుల సంఖ్య 6,48,315కు చేరింది. ఒక్క రోజులో 442 మంది చనిపోయారు. ఇప్పటి వరకు 3,94,227 మంది కోలుకోగా.. 2,35,433 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. శుక్రవారం ఒక్కరోజే 14వేల మంది కోలుకున్నారని అధికారులు చెప్పారు. మన దేశంలో రికవరీ […]

Read More
ప్రధాని పర్యటన ధైర్యం నింపింది

ప్రధాని పర్యటన ధైర్యం నింపింది

న్యూఢిల్లీ: ఇండియా – చైనా బోర్డర్‌‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పర్యటన సైనికుల్లో మరింత ధైర్యాన్ని నింపిందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మోడీకి థ్యాంక్స్‌ చెప్పారు. ‘లద్దాఖ్‌ వెళ్లడం, సోల్జర్స్‌ను కలుసుకుని వాళ్లను ఎంకరేజ్‌ చేయడం సైనికుల్లో కచ్చితంగా ధైర్యాన్ని పెంచింది. ఆర్మీ చేతుల్లో బోర్డర్స్‌ ఎప్పుడూ సేఫ్‌గా ఉంటాయి’అని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ట్వీట్‌ చేశారు. గాల్వాన్‌ ఘటన జరిగిన తర్వాత మోడీ మొదటిసారి […]

Read More
ఎగుమతులు ఢమాల్​

ఎగుమతులు ఢమాల్​

సారథి న్యూస్​, హైదరాబాద్: కరోనాతో ఇండియాకు ఎగుమతి కష్టాలు మొదలయ్యాయా.. ఈ ఆర్థిక సంవత్సరం పరిస్థితి మరింత దిగజారనుందా.. నానాటికీ ఎగుమతులు క్షీణిస్తున్నాయా.. అవుననే సమాధానం వస్తుంది ఆర్థికరంగ నిపుణుల నుంచి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో భారత ఎగుమతులు 10 శాతం తగ్గే అయ్యే అవకాశాలున్నాయని ఇండియన్‌ ఎక్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్స్‌ (ఎఫ్‌ఐఈఓ) అంచనా వేసింది. కరోనా వైరస్‌ వల్ల గడిచిన ఏప్రిల్‌లో 60 శాతం, మే మాసంలో 36 శాతం ఎగుమతులు క్షీణించాయనీ.. దీంతో పోల్చితే ప్రస్తుత […]

Read More

ప్రేక్షకులు లేకపోతే ఎలా

మెల్​బోర్న్​: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే బాక్సింగ్ డే టెస్టుకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు ఉంటే బాగుంటుందని మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ అన్నాడు. లేకపోతే మ్యాచ్​లో ఉండే మజా పోతుందన్నాడు. ‘ఓ పెద్ద మ్యాచ్ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తారు. వాళ్ల అభిమానాన్ని నిలబెట్టే స్థాయిలో మ్యాచ్ ఉండాలి. కానీ ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో నిర్వహిస్తే ఏం బాగుంటుంది. భారత్, ఆసీస్ అంటే పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికితోడు బాక్సింగ్ డే […]

Read More
వణుకుతున్న ప్రపంచం

వణుకుతున్న ప్రపంచం

సారథి న్యూస్, హైదరాబాద్: ప్రపంచం మొత్తం కరోనా ధాటికి విలవిల్లాడుతోంది.. మహమ్మారి నానాటికీ విజృంభిస్తోంది. వాళ్లు.. వీళ్లు అనే తేడా లేకుండా జనం పిట్టల్లా రాలిపోతున్నారు. బాధితుల సంఖ్య రెట్టింపవుతోంది. అడ్డుకోవడం ఏ దేశం తరం కావడం లేదు. కొన్ని దేశాల్లో ప్రభుత్వాలే చేతులెత్తేసినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు కోటికి పైగా నమోదయ్యాయన్న వార్త ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ వైరస్‌ వ్యాప్తి చాలా వేగంగా ఉండడంతో రెట్టింపు స్థాయిలో కేసులు […]

Read More
5లక్షలు దాటిన కరోనా కేసులు

5లక్షలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. 24 గంటల్లో దాదాపు 18,552 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్రం హెల్త్‌ బులెటెన్‌ రిలీజ్‌ చేసింది. ఒక రోజులో ఇన్ని కేసులు నమోదవడం ఇదే మొదటిసారి అని అధికారులు చెప్పారు. దీంతో ఇప్పుడు మొత్తం కేసుల సంఖ్య 5,08,953కి చేరింది. 24 గంటల్లో 384 మంది చనిపోయారు. చనిపోయిన వారి సంఖ్య 15,985కు చేరింది. మన దేశంలో జనవరిలో మొదటి కేసు నమోదుకాగా, 149 రోజుల్లో ఐదులక్షల కేసులు […]

Read More