Breaking News

HOSPITAL

సోనియా గాంధీ డిశ్చార్జ్​

సోనియా గాంధీ డిశ్చార్జ్‌

న్యూఢిల్లీ: అనారోగ్యంతో ఇటీవల ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆదివారం డిశ్చార్జ్​ అయ్యారు. జూలై 30న న్యూఢిల్లీలోని సర్‌ గంగారామ్‌ ఆస్పత్రిలో ఆమె చేరారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో ఆస్పత్రి నుంచి ఆమెను డిశ్చార్జ్‌ చేసినట్టు ఆస్పత్రి చైర్మన్‌ డీఎస్‌ రాణా తెలిపారు. కాగా.. గత ఫిబ్రవరి నెలలో కడుపు నొప్పి కారణంగా ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే.

Read More

నిర్లక్ష్యాన్ని సహించేది లేదు

మానోపాడు: కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో పరిశుభ్రత ఎంతో ముఖ్యమని జోగుళాంబ గద్వాల డీఎంహెచ్​వో చందునాయక్​ పేర్కొన్నారు. గురువారం ఆయన మానోపాడు పీహెచ్​సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆస్పత్రిలోని అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పీహెచ్​సీ ఆవరణలో చెత్త పేరుకుపోయి ఉండటంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసవాల సంఖ్యను పెంచాలని సూచించారు. రోగులకు విధిగా శానిటైజర్ లను అందించడంతోపాటు కరోన మహమ్మారి పట్ల భయం తొలగించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సవిత, సూపరవైజర్లు చంద్రన్న, లలిత […]

Read More
కరోనా పేషెంట్​పై లైంగికదాడి

కరోనా పేషెంట్​పై లైంగికదాడికి యత్నం

ఢిల్లీ: కరోనాతో బాధపడుతూ దవాఖానలో చేరిన ఓ బాలిక(14)ను మరో కరోనా పేషెంట్​ లైంగికంగా వేధించాడు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని కోవిడ్ కేర్​సెంటర్​లో గురువారం వెలుగుచూసింది. ఢిల్లీకి చెందిన ఓ బాలికకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ కావడంతో కోవిడ్ సెంటర్​లో చికిత్సపొందుతున్నది. కాగా అక్కడే చికిత్సపొందుతున్న మరో కరోనా బాధితుడు బాలికపై టాయిలెట్​రూంలో లైంగికదాడికి యత్నించాడు. ఈ దృశ్యాన్ని మరో వ్యక్తి తన మొబైల్​ ఫోన్​లో చిత్రీకరించాడు. బాలిక కేకలు పెట్టడంతో ఇతర రోగులు అక్కడికి […]

Read More
నాగర్​కర్నూల్​లో విస్తరిస్తున్న కరోనా

నాగర్​కర్నూల్​ జిల్లాలో 13 కొత్తకేసులు

సారథిన్యూస్​, నాగర్​కర్నూల్​: నాగర్​కర్నూల్​ జిల్లాలో కరోనా అంతకంతకూ విస్తరిస్తున్నది. తాజాగా 13 కొత్తకేసులు నమోదైనట్టు డీఎంహెచ్​వో సుధాకర్​ లాల్​ తెలిపారు. నాగర్​కర్నూల్​ పట్టణంలో ఇటీవల కరోనాతో మృతిచెందిన విలేకరి సోదరికి, అతని కోడలుకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. నాగర్​కర్నూల్​ మండలం పెద్దాపూర్​కు చెందిన ఓ మహిళకు కరోనా సోకింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్​లోని ఓ దవాఖానలో డయాలసిస్​ చేయించుకుంటున్నది. తిమ్మాజిపేట మండలం నేరెళ్లపల్లిలో మరో ముగ్గురికి కరోనా సోకింది. అచ్చంపేట పట్టణంలో నలుగురికి, బల్మూర్ మండలం […]

Read More

మమ్మల్ని ఆదుకోండి

సారథిన్యూస్​, గోదావరిఖని: సింగరేణి ఏరియా ఆస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్​ కార్మికులందరికీ స్పెషల్​ ఇన్సెంటివ్​, ప్రత్యేక ప్యాకేజీ చెల్లించాలని యూనియన్​ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు సింగరేణి ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్​కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కడారి సునీల్, రీజియన్ కార్యదర్శి శనిగల శ్రీనివాస్, నగర అధ్యక్షుడు శనిగరపు చంద్రశేఖర్, ఏఐటీయూసీ సింగరేణి ఏరియా ఆసుపత్రి విభాగం ఏఐటీయూసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు దుర్గాప్రసాద్, […]

Read More
ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్య

ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్య

ముంబై: బిగ్​ అమితాబచ్చన్​ కుటుంబం కరోనాతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అమితాబచ్చన్​తోపాటు ఆయన కుమారుడు అభిషేక్​, కోడల్​ ఐశ్వర్యరాయ్​, మనుమరాలు ఆరాధ్యకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. కాగా అమితాబ్​, అభిషేక్​ దవాఖానాలో చికిత్స పొందుతుండగా.. లక్షణాలు ఏమీ కనిపించకపోవడంతే ఐశ్వర్యరాయ్​, ఆరాధ్య ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఐశ్వర్యకు కొన్ని లక్షణాలు బయటడపడటంతో ఆమె ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరారు. ఐశ్వర్యతోపాటు ఆమె కూతురు కూడా అదే ఆస్పత్రిలో చేరారు.

Read More
బీజేపీ డిమాండ్​

దవాఖాన ఎప్పడు కడతరు

సారథి న్యూస్, హుస్నాబాద్: హుస్నాబాద్​లో 50 పడకల దవాఖానకు ఎప్పడు కడతారని బీజేపీ కౌన్సిలర్​ దొడ్డి శ్రీనివాస్​ ప్రశ్నించారు. గురువారం ఆయన కరీంనగర్​ జిల్లా హుస్నాబాద్​లో మీడియాతో మాట్లాడారు. హుస్నాబాద్​లో 50 పడకల దవాఖాన కడతామని మూడేండ్ల క్రితమే చెప్పినప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదన్నారు. ప్రజలు ఏం ఇబ్బంది వచ్చినా దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు శంకర్, ప్రభాకర్ రెడ్డి, సంతోష్, విద్యాసాగర్, వేణుగోపాల్ రెడ్డి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Read More

సీనియర్​ నటి జయంతికి తీవ్ర అస్వస్థత

సీనియ‌ర్ న‌టి జ‌యంతి ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆమె బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఆమె శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఆస్పత్రిలో చేరినట్టు ఆమె కుమారుడు తెలిపారు. ప్రస్తుతం జయంతికి వెంటిలేటర్​పై చికిత్స నందిస్తున్నారు. ఆమెకు కరోనా టెస్టులు నిర్వ‌హించ‌గా, నెగిటివ్ గా తేలిన‌ట్టుగా తెలిపారు. ఆమె చాలాకాలంగా ఆస్తమాతో బాధ‌ప‌డుతున్న‌ట్టుగా స‌మాచారం. తెలుగు, క‌న్న‌డ‌, తమిళ, మరాఠి భాషల్లోని పలు చిత్రాల్లో జయంతి న‌టించారు. 1960‌లో ఆమె న‌టిగా కెరీర్ ఆరంభించారు. హీరోయిన్ […]

Read More