ఏకమైన వాగులు, వంకలు.. నిండుకుండలా చెరువులు, కుంటలు లోతట్టు ప్రాంతాలు జలమయం పలుచోట్ల వాగుల్లో కొట్టుకుపోయినవారిని కాపాడిన పోలీసులు సారథి ప్రతినిధి, జగిత్యాల/జగిత్యాల రూరల్/వేములవాడ/పెద్దశంకరంపేట/నాగర్కర్నూల్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణమ్మ, గోదావరి నదుల్లోకి నీటి ఉధృతి పెరిగింది. రెండు రోజులుగా ఎడాతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. కుండపోత వర్షాలకు పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జగిత్యాల రూరల్ మండలం అనంతరం- గుల్లపేటవాగు పైనుంచి వెళ్తుండగా వరద ఉధృతికి కారు […]
సారథి, రామడుగు: రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్జిల్లా రామడుగు ఎస్సై తాండ్ర వివేక్ గురువారం సూచించారు. వర్షానికి తడిసిన విద్యుత్ స్తంభాలు, గోడలను తాకవద్దని, ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందన్నారు. గృహిణులు జే వైర్లపై బట్టలను ఆరవేయకూడదని హెచ్చరించారు. శిథిలావస్థలో ఉన్న మట్టి ఇళ్లు, గోడల మధ్య ఉండకూడదని కోరారు. ఇంటి ఆవరణలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. ఉరుములు, మెరుపులు, గాలిదుమారం సమయంలో ప్రజలు, […]
సారథి న్యూస్, రామాయంపేట: కరోనా నేపథ్యంలో.. ఉన్న ఊరులోనే తన శక్తి మేర పెట్టుబడి పెట్టి ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఆశపడ్డ ఓ యువకుడి ఆశలు అడియాసలయ్యాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు కోళ్ల షెడ్ లోకి చేరడంతో సుమారు వెయ్యి కోళ్లు మృత్యువాతపడ్డాయి. ఈ ఘటన మండలంలోని మెదక్ జిల్లా రామాయంపేట చల్మెడ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ సందర్భంగా షెడ్ నిర్వాహకుడు కరుణాకర్ మాట్లాడుతూ.. కరోనా కారణంగా ఎక్కడికి వెళ్లి ఉద్యోగం […]
వర్షాలకు ఇంట్లో నీటి ఊట ఇబ్బందుల్లో ఓ పేద కుటుంబం సారథి న్యూస్, మానవపాడు: ఇటీవల కురుస్తున్న భారీవర్షాలకు జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలోని మద్దూరు గ్రామంలో గఫూర్ ఇంటిలో నీటి ఊట ఊరుతోంది. ఇంట్లో మొత్తం అడుగు మేర నీళ్లు నిలిచాయి. ఇద్దరు పిల్లలతో కంటికి కునుకులేకుండా గడుపుతున్నామని భార్యాభర్తలు వాపోయాయి. ‘ప్రతిరోజు చస్తూ బతుకుతున్నాం. చిన్నవర్షం కురిసినా ఇంట్లో నీళ్లు ఊరుతున్నాయి. ఎవరూ మమ్మల్ని పట్టించుకునేవారు లేరు. ఇద్దరు పిల్లలతో నరకం […]
సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులుగా పలు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, రంగారెడ్డి, వికారాబాద్జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో మరో మూడురోజల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భారీవర్షానికి హైదరాబాద్మహానగరం తడిసిముద్దయింది. ఖైరతాబాద్, పంజాగుట్ట, కూకట్‌పల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, నాంపల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, బేగంపేట, ఎంజే మార్కెట్, నాంపల్లి, ఆబిడ్స్, […]
సారథి న్యూస్, వనపర్తి: ఇటీవల భారీవర్షాలకు జిల్లావ్యాప్తంగా వాగులు, చెరువులు, నదులు ప్రమాదకరంగా ఉప్పొంగుతూ ప్రవహిస్తున్న నేపథ్యంలో ముంపు కాలనీల్లో నివాసం ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వనపర్తి ఎస్పీ అపూర్వరావు సూచించారు. జిల్లా కేంద్రంలోని తాళ్లచెరువు వాగు అలుగు ఉప్పొంగి వరద నీరు శ్రీరామ టాకీస్, శ్వేతానగర్, శంకర్ గంజ్, ప్రభుత్వ ఆస్పత్రి, చింతల హనుమాన్ ఆలయం, సుభాష్ వాడ ప్రాంతాల్లో రోడ్లపై వరదనీరు వచ్చి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జిల్లాలోని ప్రతి పోలీస్స్టేషన్ […]
పట్టణంలో భారీవర్షం.. లోతట్టు కాలనీలు జలమయం వరద నీటికి ఉప్పొంగిన తాళ్లచెరువు అక్రమ వెంచర్లు.. నిర్మాణాలే కారణం 20ఏళ్ల క్రితం ఇదే పరిస్థితి.. సారథి న్యూస్, వనపర్తి: అక్రమ నిర్మాణాలు, అధికారుల నిర్లక్ష్యం వెరసి.. భారీ వర్షాలకు వనపర్తి నీటమునిగింది. మంగళవారం రాత్రి కురిసిన వానలకు పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తాళ్లచెరువు వరద నీటితో పోటెత్తడంతో రామాటాకీస్, శ్వేతానగర్, శంకర్ గంజ్, ప్రభుత్వ ఆస్పత్రి, చింతల హనుమాన్ ఆలయం, సుభాష్ వాడలోని ఇళ్లలోకి నీళ్లు […]
19న మరో అల్పపీడనం అలర్ట్ అయిన ఇరురాష్ట్రాల అధికారులు హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్న వర్షాలు మరో మూడురోజుల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చని వాతావరణశాఖ అంచనావేసింది. ఈశాన్య మధ్యప్రదేశ్, ఉత్తర చత్తీస్ గఢ్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 5.8 మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వచ్చే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఇది ప్రయాణించి బలహీనపడే అవకాశం […]