ఆల్మట్టి రిజర్వాయర్(ఫైల్) కృష్ణానదిపై రిజర్వాయర్లను ఖాళీచేయండి నదిలోకి భారీగా వరద నీరు వచ్చే అవకాశం జూరాల, రెండు రోజుల్లో శ్రీశైలానికి.. అదే స్థాయిలో ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి ముందే హెచ్చరించిన కేంద్ర జలసంఘం సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదిలోకి భారీ వరద నీరు వచ్చే అవకాశం ఉందని కేంద్ర జల సంఘం హెచ్చరించింది. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లో కొంత నీటిని దిగువకు వదిలేసి ఖాళీ ఉంచుకోవాలని […]
సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): నడిగడ్డలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో కుండపోత వర్షాలకు వాగులు, వంకలు ఏరులై పారుతున్నాయి. పంట చేలు చెరువులను తలపిస్తున్నాయి. నెలరోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు కురవడంతో వేసిన పంటలన్నీ నీట మునిగిపోతున్నాయి. వందల ఎకరాల్లో పత్తి, మిరప, ఉల్లిగడ్డ తదితర పంటలు చేతికందే పరిస్థితి లేకుండా పోయింది. ఉండవెల్లి మండలం పొంగూరు వాగు ఉధృతి కారణంగా సుమారు 500 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని సర్పంచ్ శ్రీలత భాస్కర్ […]
సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లా వ్యాప్తంగా బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీవర్షం కురుస్తోంది. కొల్చారంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 10 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఆయా మండలాల్లో చాలా చెరువులు పూర్తిగా నిండి అలుగు పారుతున్నాయి. పరిసర ప్రాంతాల్లో భారీవర్షం కురవడంతో కొల్చారం, మెదక్, హవేలీ ఘనపూర్ మండలాల పరిధిలోని మహబూబ్ నహర్ కాల్వ నిండుగా ప్రవహిస్తోంది. భారీవర్షాలు కురిసి చెరువులు, కుంటలకు జలకళ సంతరించుకోవడంతో రైతులు, కూలీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు రిజర్వాయర్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. తాజాగా, మరో మూడురోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని హైదరాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కొమురంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో […]
సారథి న్యూస్, వికారాబాద్: తాండూరులో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కొడంగల్– తాండూరు మధ్య ఉన్న కాగ్నా వంతెన తెగిపోయింది. వరద మధ్యలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సుకు తృటిలో పెనుప్రమాదం తప్పింది. బ్రిడ్జి తెగిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షం కురవడంతో తాండూరు నియోజకర్గంలోని పంట పొలాలు నీటమునిగాయి. పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు నిండాయి. కోట్ పల్లి ప్రాజెక్టు లోకి ఆరు అడుగుల వరద చేరింది. బుగ్గపూర్ కోట్ పల్లి, నర్సాపూర్ వాగులు ద్వారా […]