సారథిన్యూస్, హైదరాబాద్: విప్లవరచయిత, విరసం నేత వరవరరావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ముంబైలోని సెయింట్ జార్జ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉన్నదని వైద్యులు తెలిపారు. ప్రధాని మోడీ హత్యకు కుట్రపన్నారనే కేసులో వరవరరావును ముంబై పోలీసులు 2018లో అరెస్ట్ చేశారు. అనంతరం ఈ కేసును ఎన్ఐఏకు (నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ) అప్పగించారు. ముంబైలోని తలోజా జైలులో ఆయన విచారణ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో […]
మాస్కో: కరోనా టీకాపై గత కొంతకాలంగా ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. తామంటే, తాము వ్యాక్సిన్ తీసుకొస్తామని ప్రపంచంలోని పలుదేశాలు, వ్యాక్సిన్ తయారీ సంస్థలు ప్రకటనలు గుప్పించాయి. కాగా తాజాగా రష్యా ఓ అడుగు ముందుకేసి.. తాము క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తిచేశామని.. అతి త్వరలోనే వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది. రష్యాకు చెందిన సెచెనోవ్ మెడికల్ యూనివర్శిటీలో కరోనా వ్యాక్సిన్‌కు విజయవంతంగా ట్రయల్స్ పూర్తయ్యాయని ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ వాడిమ్ తారాసోవ్ తెలిపారు. రష్యాలోని గమాలే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ […]
ఇటీవల చాలామంది కిడ్నీసంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. కిడ్నీలో రాళ్లు ఏర్పడటం, మూత్రం సరిగ్గా రాకపోవడం, తీవ్రమైన నొప్పితో కొందరు ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వారు కొన్ని ఆరోగ్యచిట్కాలతో ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. సమస్య తీవ్రత అధికంగా ఉంటే మాత్రం తప్పనిసరిగా వైద్యులను సంప్రదించి అందుకనుగుణంగా చికిత్స తీసుకోవాలి. మన రోజువారి డైట్లో కొన్ని ఆహారపదార్థాలను చేర్చుకోవడం ద్వారా కిడ్నీ సమస్యలకు తాత్కాలిక ఉపశమనం పొందవచ్చు. అవిఏమిటో ఇప్పుడు చూద్దాం.. కిడ్నీలో రాళ్లు ఎందుకొస్తాయిమూత్రపిండాలు మన […]
అరటిపండులో ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయని పెద్దలు చెప్తుంటారు. అరటిలో ఎన్నో రకాలున్నాయి. చెక్కరకేళి, దేశవాళీ, బొంత, కర్పూర, పచ్చ అరటిపండ్లు, పసుపు పచ్చవి, కేరళ అరటిపండ్లు, కొండ అరటిపండ్లు, అమృతపాణి.. వీటిలో ఏవీ తిన్నా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అజీర్తి సమస్య పోవాలన్నా, రక్తహీనత తగ్గాలన్నా, మలబద్దకం సమస్య లేకుండా ఉండాలన్నా అరటిపండు తినాలని చెప్పుతూ చెప్తుంటారు పెద్దలు. అరటిపండులో పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల ప్రతి రోజు మూడు అరటిపండ్లను తింటే గుండె జబ్బులకు బై […]
సారథి న్యూస్, కర్నూలు: ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి లక్ష్యమని, అందులో భాగంగా రాష్ట్రంలో పెద్దసంఖ్యలో 108,104 వాహనాలను ప్రారంభించారని కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కాలేజీ మైదానంలో గురువారం మంత్రి గుమ్మనూరు జయరాం, కర్నూలు, నంద్యాల ఎంపీలు డాక్టర్ సంజీవ్‌కుమార్, పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎంఏ హఫీజ్‌ఖాన్, శ్రీదేవి, ఆర్థర్ తదితరులతో కలిసి అంబులెన్స్వెహికిల్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు […]
సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని కొంగాల గ్రామంలో మంగళవారం వైద్యశిబిరం నిర్వహించారు. కాలానుగుణంగా వచ్చే వ్యాధులు, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా గురించి అవగాహన కల్పిస్తూ డాక్టర్ యమున సూచనలు చేశారు. ప్రతిఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, మాస్క్ లు కట్టుకోవడంతో పాటు చేతులను ఎప్పటికప్పుడు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు.
సారథిన్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల గ్రామంలో రూ.1.19 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, 10 పడకలవార్డు, సిబ్బంది నివాస సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ మలోతు కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యే పొదెం వీరయ్య, […]
సారథి న్యూస్, హుస్నాబాద్/ రామడుగు/గోదావరిఖని: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్రంలోని పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. యోగాతో అనేక రుగ్మతలను దూరం చేసుకోవచ్చని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా యోగా దినోత్సవం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మున్సిపల్ వైస్ చైర్పర్సన్, యోగా టీచర్ అనితారెడ్డి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యోగాసనాలు వేస్తే ఎటువంటి వ్యాధులు దరిచేరవని […]