Breaking News

కిడ్నీలో రాళ్లకు చెక్​ చెప్పండిలా

ఇటీవల చాలామంది కిడ్నీసంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. కిడ్నీలో రాళ్లు ఏర్పడటం, మూత్రం సరిగ్గా రాకపోవడం, తీవ్రమైన నొప్పితో కొందరు ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వారు కొన్ని ఆరోగ్యచిట్కాలతో ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. సమస్య తీవ్రత అధికంగా ఉంటే మాత్రం తప్పనిసరిగా వైద్యులను సంప్రదించి అందుకనుగుణంగా చికిత్స తీసుకోవాలి. మన రోజువారి డైట్​లో కొన్ని ఆహారపదార్థాలను చేర్చుకోవడం ద్వారా కిడ్నీ సమస్యలకు తాత్కాలిక ఉపశమనం పొందవచ్చు. అవిఏమిటో ఇప్పుడు చూద్దాం..

కిడ్నీలో రాళ్లు ఎందుకొస్తాయి
మూత్రపిండాలు మన శరీరంలోని ఓ ప్రధాన అవయవాలు. ఇవి రక్తాన్ని శుద్ధిచేస్తాయి. రక్తంలోని మలినాలను వడకట్టి, బయటకు విసర్జించి.. మన శరీరంలో ప్లూయిడ్స్​ సమపాళ్లలో ఉండేలా చేస్తాయి.
అంతేకాకుండా శరీరంలో ఎక్కువైన నీటిని మూత్రం రూపంలో బయటకు పంపిస్తాయి. అయితే ఏ కారణం చేతనైనా కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే.. కిడ్నీల్లో క్రిస్టల్స్​ ఏర్పడుతాయి. కిడ్నీలోని చిన్నసైజ్​ రాళ్లను మందుల ద్వారా కరిగించవచ్చు.. కానీ పెద్దసైజ్​ వాటికి మాత్రం సర్జరీ అవసరం. కిడ్నీలో రాళ్ళు ఏర్పడటానికి ప్రధాన కారణం శరీరంలో తగినంత నీరు లేకపోవడం. దాంతో పాటు యూరిన్‌లో ఎక్కువ యాసిడ్ ఉండటం.

లక్షణాలు ఇవే..
నడుముకు కొంచెం పైభాగంలో తీవ్రమైన నొప్పి వస్తుంది. యూరిన్​ను ఆపులేకపోతారు. మూత్రంలో ఒక్కోసారి రక్తంకూడా పడవచ్చు. వాంతులు అవుతాయి. ఒక్కోసారి చెమటలు పడ్తాయి. కొంతమందిలో లక్షణావేవి కనిపించకపోవచ్చు.

రాజ్మా తింటే ఎంతో లాభం
రాజ్మా చూడడానికి కూడా కిడ్నీల లాగానే ఉంటాయి. ఇవి కిడ్నీలని క్లెన్స్ చేసి కిడ్నీ లో రాళ్ళని కరిగిస్తాయని అంటారు. రాజ్మా లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు గా ఉన్న మినరల్స్, బీ విటమిన్స్ కిడ్నీలని శుభ్రపరిచి యూరినరీ ట్రాక్ట్ బాగా పనిచేసేలా చేస్తాయి.

దానిమ్మ రసంతో రాళ్లు మాయం
దానిమ్మల్లో ఉన్న పొటాషియం వలన దానిమ్మ గింజలు తిన్నా, రసం తాగినా కిడ్నీ స్టోన్స్ నుండి విముక్తి లభిస్తుంది. కిడ్నీలలో ఏర్పడే క్రిస్టల్స్ ఏర్పడకుండా పొటాషియం కాపాడుతుంది. ఇందులో ఉన్న యాస్ట్రింజెంట్ గుణాల వల్ల కిడ్నీల్లో ఉన్న టాక్సిన్స్ బైటికి వెళ్ళిపోతాయి.

డాండలియన్ రూట్ దివ్య ఔషధం
డాండలియన్ టీ కిడ్నీలని శుభ్రపరచడానికి సహాయపడుతుంది. ఈ టీ కిడ్నీలకి టానిక్ లాగా కూడా పని చేస్తుంది. అరుగుదలకు తోడ్పడి అక్కర్లేని వాటిని బైటికి పంపడంలో ఉపకరిస్తుంది.

కిడ్నీలను శుభ్రపరిచే తులిసి
తులసిలోని డీటాక్సిఫైయింగ్ గుణాలు కిడ్నీలని శుభ్రపరచి, కిడ్నీలోని రాళ్ళని కరిగేలా చేస్తాయి. కిడ్నీలు స్ట్రాంగ్ గా తయారౌతాయి. ఇందులో ఉన్న ఎసిటిక్ యాసిడ్ కిడ్నీ లోని రాళ్ళు చిన్న చిన్న ముక్కలు గా విడిపోయి యూరిన్ ద్వారా బైటికి పోయేలా చేస్తుంది. బేసిల్ పెయిన్ కిల్లర్ గా కూడా పని చేస్తుంది.

​లెమన్, ఆలివ్ ఆయిల్..
లెమన్స్ లో ఉన్న సిట్రేట్ వలన కొత్త రాళ్ళు ఏర్పడకుండా ఉంటాయి, ఉన్న రాళ్ళు కరిగిపోతాయి. ఆలివ్ ఆయిల్ వలన కరిగిపోయిన రాళ్ళు స్మూత్ గా బైటికి వెళ్ళిపోతాయి.

​పుచ్చకాయతో ప్రయోజనాలెన్నో
పుచ్చకాయలో ఉన్న పొటాషియం యూరిన్ లోని ఎసిడిక్ లెవెల్స్ ని నియంత్రిస్తుంది. పుచ్చకాయ రసం లో చిటికెడు ధనియాల పొడి వేసుకుని తీసుకుంటే ఈ సమస్యకి ఈజీ గా చెక్ పెట్టచ్చు.

ఖర్జూరాలు
ఎండు ఖర్జూరాలని రాత్రంతా నీటిలో నానబెట్టి పొద్దున్న గింజలు తీసేసి తినడం వల్ల కూడా కిడ్నీ లో రాళ్ళు కరిగిపోతాయి. దీని వల్ల కొత్తగా రాళ్ళు ఏర్పడకుండా ఉంటాయి. ఇందులో ఉన్న మెగ్నీషియం వలన కిడ్నీలు శుభ్రపడతాయి. వీటితో పాటూ, కీరదోసకాయ రసం, చెర్రీలు, కొబ్బరి నీరు కూడా కిడ్నీ లో రాళ్ళు కరిగిపోయేలా చేస్తాయి. అయితే, ఈ పద్ధతులు పాటించే ముందు మీ డాక్టర్ ని కన్సల్ట్ చేసి మొదలు పెట్టాలి.