Breaking News

అరటి.. అద్భుత ఔషధం

అరటిపండులో ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయని పెద్దలు చెప్తుంటారు. అరటిలో ఎన్నో రకాలున్నాయి. చెక్కరకేళి, దేశవాళీ, బొంత, కర్పూర, పచ్చ అరటిపండ్లు, పసుపు పచ్చవి, కేరళ అరటిపండ్లు, కొండ అరటిపండ్లు, అమృతపాణి.. వీటిలో ఏవీ తిన్నా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అజీర్తి సమస్య పోవాలన్నా, రక్తహీనత తగ్గాలన్నా, మలబద్దకం సమస్య లేకుండా ఉండాలన్నా అరటిపండు తినాలని చెప్పుతూ చెప్తుంటారు పెద్దలు. అరటిపండులో పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల ప్రతి రోజు మూడు అరటిపండ్లను తింటే గుండె జబ్బులకు బై బై చెప్పేయవచ్చు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఒకటి, మధ్యాహ్నం భోజనంలో ఒక అరటి పండు, క్రమం తప్పకుండా తింటూ ఉంటె చాలా మేలు చేస్తాయి. అరటిపండ్లతో రక్తపోటు నియంత్రణలో ఉండి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. పొట్టలో ఆమ్లాలు ఎక్కువైతే ఓ అరటిపండు తినండని సూచిస్తున్నారు నిపుణులు. ఇవి ప్రకృతిసిద్ధ యాంటాసిడ్‌గా పనిచేస్తాయి. వీటిలో ఉండే యాంటాసిడ్‌ల ప్రభావం పొట్టలో పుండ్లను తగ్గిస్తుంది. జీర్ణసంబంధమైన సమస్యలకూ అరటిపండు మంచి ఔషధంలా పనిచేస్తుంది.జబ్బుపడినవాళ్లు దీన్ని తింటే తొందరగా కోలుకుంటారు. అరటిపండులోని పొటాషియం శరీర కండరాల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. డైటింగ్ చేస్తున్నవాళ్లు ఒకపూట భోజనం లేదా టిఫిన్ మానేసి అరటిపండు, వెన్న తీసిన పాలు తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందుతాయి.