న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. గత 24 గంటల్లో 47,703 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 14,83,156 కు చేరింది. వరుసగా ఆరోరోజు 45 వేల కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయని వైద్యశాఖ అధికారులు తెలిపారు. మరోవైపు కరోనా మరణాల సంఖ్య భయంకరంగా పెరుగుతూనే ఉన్నది. ఇప్పటికి 33,425 మంది కరోనాతో మృతిచెందారు. 9,52,743 మంది డిశ్చార్జి కాగా.. 4,96,988 యాక్టివ్ కేసులున్నాయి.
సారథి న్యూస్, ఢిల్లీ : కేంద్రంలో ఓఎస్డీగా పనిచేస్తున్న సీనియర్ ఐఎఎస్ అధికారి రాజేష్ భూషణ్‌ను కేంద్ర ఆరోగ్య,కుటుంబసంక్షేమ శాఖ కొత్త కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్థుతం ఆరోగ్య శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న ప్రీతి సుడాన్ జులై 31వతేదీన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో 1987 బ్యాచ్ బీహార్ క్యాడర్ అధికారి అయిన రాజేష్ భూషణ్ ను కొత్త కార్యదర్శిగా కేంద్రం నియమించింది. ప్రీతి సుడాన్ పదవీకాలం ఏప్రిల్ తో ముగిసినా కరోనా వల్ల ఆమె పదవీకాలాన్ని […]
సపోటా పండు రుచిలోనే కాదు.. పోషకవిలువలు పెంచడంలోనూ రారాజే అని చెబుతున్నారు పరిశోధకులు. సపోటా గుజ్జులో ఉండే ఫైబర్లు మలబద్దక సమస్యను పొగొడతాయి. జీర్ణాశయ క్యాన్సర్ కారకాలను సపోటా నివారిస్తుంది. అంతేకాక సపోటా ఎంతో త్వరగా శరీరానికి శక్తినిస్తుంది. నిద్రలేమితో బాధపడే వారు రోజు ఒక సపోటా తీసుకోవడం ఉత్తమం. దగ్గు, జలుబు వంటి సమస్యలను కూడా సపోటా దగ్గరికి రానీయ్యదు. కిడ్నీలో రాళ్లకు, స్థూలకాయ సమస్యలకు సపోటా విరుగుడుగా పనిచేస్తుంది. సపోటాలో ఉండే విటమిన్-ఏ వల్ల […]
ఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోలుకుంటున్న వారి సంఖ్య అధికంగానే ఉంటున్నదని వైద్యశాఖ గణాంకాలు తెలుపుతున్నాయి. ఇప్పటివరకు భారత్‌లో 8 లక్షల మంది కోరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కాగా గత 24 గంటల్లో 49,310 మంది కొత్తగా కరోనా బారినపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 12,87,945 లకు ఎగబాకింది. ఇప్పటివరకు 30,601 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం 4,40,135 […]
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విలయతాండవం సృష్టిస్తున్నది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 45,720 కొత్తకేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. మొత్తం కేసుల సంఖ్య 12,38,635కు చేరింది. కాగా ఒకే రోజులో 29,557మంది కోలుకున్నారు. కాగా ఇప్పటివరకు 7,82,606 మంది కోలుకున్నారు. ఇప్పటివకరు 29,861 మంది ఈ వ్యాధితో మరణించారు. దేశంలో కేసులు విపరీతంగా పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో కేసుల […]
బెంగళూరు: కరోనాభయంతో మనుషుల్లో మానవత్వం మంటగలుస్తుంది. సాటి మనిషిపై కనీసం కనికరం లేకుండా పోతున్నది. తాజాగా బెంగళూరులో ఓ దారుణ ఘటన చోటుచేసుకున్నది. కరోనా భయంతో ఓ గర్భిణిని చేర్చుకోవడానికి మూడు ఆస్పత్రులు నిరాకరించాయి. దీంతో ఆ మహిళ ఆటోలోనే ప్రసవించింది. గర్భిణి ప్రాణాలతో భయపడగా.. బిడ్డ మాత్రం మృతిచెందింది. ఆసుపత్రులు కనికరం చూపించి ఉంటే ఆ పసికందు బతికేది. ‘కర్ణాటకలో కరోనా చావులు తక్కువగానే ఉన్నాయి. కానీ కరోనా భయంతో ఆస్పత్రులు వైద్యం నిరాకరించడం వల్ల […]
ఢిల్లీ: ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్రజైన్ కరోనా నుంచి కోలుకున్నారు. ‘ఆరోగ్యమంత్రి సత్యేంద్ర ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్నారు. సోమవారం నుంచే అయన విధుల్లో చేరతారు. మళ్లీ ఆయన దవాఖానలు సందర్శిస్తారు. కరోనాపై వైద్యశాఖ అధికారులతో సమావేశమవుతారు’ అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్‌చేశారు. కాగా ప్లాస్మాథెరపీ తీసుకోవడం వల్లే ఆయన కోలుకున్నారని వైద్యులు చెప్పారు.
ఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 38,902 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో.. మొత్తం కేసుల సంఖ్య 10,77,618 కి చేరింది. ఒక్కరోజులో 38 వేలకు పైగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. కొత్తగా 543 మంది వైరస్ బాధితులు మృతి చెందడటంతో మొత్తం మరణాల సంఖ్య 26,816 కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం బులెటిన్‌లో పేర్కొంది. ఇప్పటి వరకు భారత్‌లోని మొత్తం కరోనా రోగుల్లో 6.77 లక్షల మంది కోలుకున్నారు. […]