Breaking News

GUTKA

చేవెళ్లలో గుట్కా సీజ్​

భారీగా గుట్కా ప్యాకెట్లు సీజ్​

సారథిన్యూస్​, చేవెళ్ల: అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను టాస్క్​ఫోర్స్​ పోలీసులు సీజ్​ చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్​స్టేషన్​ పరిధిలోని బీబీగూడెం వద్ద టాస్క్​ఫోర్స్​ పోలీసులు తనిఖీలు చేపట్టగా సుమారు రూ. 2 లక్షల 45 వేల విలువైన గుట్కాప్యాకెట్లు పట్టుబడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఇద్దరు నిందితులు గుట్కా ప్యాకెట్లను హైదరాబాద్​ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీబీగూడెనికి తీసుకెళ్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకొని కారును సీజ్​ చేసినట్టు […]

Read More
భారీగా గుట్కా పట్టివేత

భారీగా గుట్కా పట్టివేత

సారథి న్యూస్​, వర్ధన్న పేట : వరంగల్ కమిషనరేట్ పరిధిలోని వర్ధన్నపేట, రాయపర్తితో పాటు చుట్టు పక్కల గ్రామీణా ప్రాంతాల్లో ప్రభుత్వ నిషేధిత గుట్కా బ్యాగుల సరఫరాకు పాల్పడుతున్న  వ్యక్తిని మంగళవారం వర్ధన్నపేట పోలీసులు అరెస్ట్​ చేశారు. అతడి నుంచి సుమారు రూ.8.10 లక్షల విలువగల గుట్కా బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్ కు సంబంధించి వర్ధన్నపేట ఏసీపీ రమేశ్​ వివరాలను వెల్లడిస్తూ.. గుమ్మడవెల్లి నాగరాజు అలియాస్ ఉప్పల్ నాగరాజు అలియాస్ తొర్రూరు నాగరాజు అలియాస్ […]

Read More

గుట్కా డంపు స్వాధీనం

సారథి న్యూస్​, మచిలీపట్నం : మచిలీపట్నం ఆర్​పేట పోలీస్​ స్టేషన్​కు కూతవేటు దూరంలో పోలీసులు భారీ గుట్కా ప్యాకెట్ల డంపును శనివారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచిలీపట్నంలో గుట్కా డంపు నిల్వ ఉన్నట్లు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించగా రూ.20లక్షల విలువైన ఖైనీ, గుట్కా ప్యాకేట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.  లెనిన్ అనే వ్యక్తి మున్సిపల్ పార్కు కాంప్లెక్స్ శ్రీ మహాలక్ష్మి జనరల్ స్టోర్స్ నిర్వహిస్తూ పక్కనే ఉన్న దుకాణం అద్దెకు తీసుకుని […]

Read More

గుట్కాప్యాకెట్లు పట్టివేత

సారథి, హుస్నాబాద్: కరీంనగర్ జిల్లా హుస్నాబాద్​లో రూ. 6600 విలువైన గుట్కాప్యాకెట్లను పోలీసులను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని ఓ ఇంట్లో గుట్కాప్యాకెట్లు నిలువ ఉంచినట్టు పోలీసులకు సమాచారమందింది. దీంతో తనిఖీలు చేసిన అధికారులు గోర్ల శ్రీనివాస్​ ఇంట్లో అంబర్​ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్ కు సహాకరించిన బొయిని వేణుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read More

గుట్టుగా గుట్కా విక్రయాలు

సారథి న్యూస్, హుస్నాబాద్: కరీంనగర్​ జిల్లా అక్కన్నపేట పోలీస్​స్టేషన్​ పరిధిలోని రామవరం గ్రామంలో 30 వేల విలువ గల గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో గుట్కాప్యాకెట్లు నిలువ ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో తనిఖీలు చేపట్టారు. గ్రామానికి చెందిన వెంకటేశం, రవితేజ ఇంట్లో గట్కా ప్యాకెట్లు దొరికాయి. సంపత్​ అనే వ్యాపారి వీరికి గుట్కా ప్యాకెట్లు విక్రయించినట్టు పోలీసుల విచారణలో తేలింది. ముగ్గురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Read More

భారీగా గుట్కా పట్టివేత

సారథిన్యూస్, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలోని వివిధ గ్రామాల్లో పోలీసులు భారీగా గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నాలుగు రోజులుగా వివిధ గ్రామాల్లో సోదాలు చేపట్టారు. అక్రమంగా విక్రయిస్తున్న నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. 22, 600 విలువ గల గుట్కాప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మోతే గ్రామానికి చెందిన తిరుపతి, పుదారి శ్రీనివాస్​, లక్ష్మీపూర్​కు చెందిన సురేశ్​, గుండికి చెందిన చిట్ల మునీందర్​లపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై అనూష వెల్లడించారు.

Read More