సారథి న్యూస్, హైదరాబాద్: జీహెచ్ఎంసీతో పాటు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న చెరువులు, నాలాలపై ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు మంత్రి కె.తారక రామారావు వివరించారు. సాగునీటి శాఖ చీఫ్ ఇంజనీర్, జీహెచ్ఎంసీ ప్రత్యేక కమిషనర్ ఆధ్వర్యంలో నీటివనరుల సంరక్షణ, ఆక్రమణల తొలగింపు పనులు చేపట్టాలన్నారు. ఆదివారం ఇరిగేషన్, జలమండలి, హెచ్ఎండీఏ, రెవెన్యూ యంత్రాంగం, ఇతర శాఖల అధికారులతో కలిసి విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న చెరువులు, నాలాలపై పూర్తిస్థాయిలో స్టడీ చేయాలని సంబంధిత […]
డివిజన్ల వారీగా రిజర్వేషన్ల జాబితా సిద్ధం ఎస్టీలకు-2, ఎస్సీలకు -10, బీసీలకు- 50 మహిళలకు 75 స్థానాల కేటాయింపు అన్ రిజర్వ్డ్ డివిజన్లు 44 అంతా రెడీచేసిన బల్దియా అధికారులు హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పాలకమండలి రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రెండు దఫాలు యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వం గత అసెంబ్లీ సమావేశాల్లో చట్టం చేయడంతో గతంలో చేసిన రిజర్వేషన్లు ఈ దఫా కూడా కొనసాగనున్నాయి. ఈ మేరకు మొత్తం 150 స్థానాలకు గానూ జీహెచ్ఎంసీ అధికారులు డివిజన్ల వారీగా […]
సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో సహాయ పునరావాస కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నగరంలో జరుగుతున్న సహాయ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ‘భారీ వర్షాలు, వరదల వల్ల ఇండ్లలోకి నీరొచ్చి ఆహార పదార్ధాలు, దుస్తులు, చెద్దర్లు అన్నీ తడిసిపోయాయి. కనీసం వండుకుని తినే పరిస్థితుల్లో కూడా చాలా కుటుంబాలు లేవు. అందుకే వారికి తక్షణ సాయంగా ప్రతి బాధిత కుటుంబానికి రూ.10వేల చొప్పున […]
హైదరాబాద్‌లో వరద బాధితులకు ప్రభుత్వం చేయూత, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.50వేలు జిల్లాల కలెక్టర్లు, బృందాలు వెంటనే రంగంలోకి దిగాలి భరోసా కల్పించిన సీఎం కె.చంద్రశేఖర్‌రావు సారథి న్యూస్, హైదరాబాద్: భారీవర్షాలు, వరదల వల్ల హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఎన్నో కష్ట నష్టాలకు గురయ్యారని, వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు భరోసా కల్పించారు. హైదరాబాద్ నగరంలోని వరద ముంపునకు గురైన ప్రతి ఇంటికి రూ.10వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని సీఎం […]
హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో మరో మూడురోజుల పాటు హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు రిపోర్ట్‌లో వెల్లడించారు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లోతట్టు ప్రాంతాల వాసులను ఖాళీ చేయిస్తున్నారు. ఇప్పటివకే వారం రోజులుగా భారీవర్షాలు, వరదలు, బురదతో భాగ్యనగరం వాసుల బాధలు వర్ణణాతీతం. ఇదిలాఉండగా, మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం […]
సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో వరుసగా నాలుగో రోజు వరద ప్రభావిత ప్రాంతాలను తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పరిశీలించారు. రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో వరదల్లో చనిపోయిన పలువురికి రూ.ఐదులక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెక్కులను అందజేశారు. పారిశుద్ధ్యంపై ప్రధానంగా దృష్టిసారించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. అంటురోగాలు ప్రబలకుండా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు […]
సారథి న్యూస్, హైదరాబాద్: భారీవర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు కావల్సిన బియ్యం, పప్పుతో పాటు ఇతర నిత్యావసర సరుకులను, ఆహారాన్ని, ప్రతి ఇంటికి మూడు చొప్పున రగ్గులను ప్రభుత్వ పక్షాన వెంటనే అందించాలని చెప్పారు. హైదరాబాద్ నగర పరిధిలో సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు తక్షణం జీహెచ్ఎంసీకి రూ.ఐదుకోట్లు విడుదల చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. చనిపోయిన […]
సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతిభవన్ లో ఉన్నత స్థాయి అత్యవసర సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని చర్చిస్తారు. తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు. భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉన్నందున, ఈ సమావేశానికి వచ్చే అధికారులు అన్ని వివరాలు తీసుకుని రావాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. మున్సిపల్, వ్యవసాయ, ఆర్అండ్ […]