సారథి న్యూస్, ఖమ్మం: బావిలో పడి ఇద్దరు మహిళలు మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో చోటుచేసుకుంది. ఆదివారం కొణిజర్లకు చెందిన ఐదుగురు వ్యవసాయ కూలీలు ఓ పొలంలో పనిచేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు వారు జారి బావిలో పడ్డారు. స్థానికులు గమనించి ముగ్గురిని కాపాడగా, మరో ఇద్దరు మహిళలు మృతిచెందారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సారథిన్యూస్, రంగారెడ్డి: ఓ వివాహిత హత్యకు గురైంది. కాగా ఆమెను చంపింది తొమ్మిదో భర్త కావడం విశేషం. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా పహాడిషరీఫ్ పరిధిలోని శ్రీరామ కాలనీలో చోటుచేసుకున్నది. వరలక్ష్మి (35)ని కొంతకాలం క్రితం శ్రీరామ కాలనీకి చెందిన నాగరాజు (36) వివాహం చేసుకున్నాడు. కాగా వరలక్ష్మి అప్పటికే ఎనిమిది పెళ్లిళ్లు చేసుకొని.. వేర్వేరు కారణాలతో భర్తలకు విడాకులు ఇచ్చింది. నాగరాజు ఆమెకు తొమ్మిదోభర్త. కాగా ఇటీవల భార్య, భర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. మంగళవారం […]
నల్లగొండ, సారథి న్యూస్: పిల్ల నిచ్చిన మామను హత్యచేసిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండకు చెందిన చింతల గోపీ ఈ నెల 20న తన కుమారుడు రిత్విక్‌కు పుట్టు వెంట్రుకల వేడుక చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీలోని నందిగామ నుంచి అతడి మామ వంటిపులి వెంకటేశ్వర్లు వచ్చారు. తన కూతురును పుట్టింటికి తీసుకెళ్లేందుకు ఫంక్షన్నం అనంతరం నల్లగొండలోనే ఉండిపోయారు. మరునాడు మామా, అల్లుడు ఇంట్లోనే […]
సారథి న్యూస్, మెదక్: రైలు కింద పడి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన మంగళవారం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట సమీపంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఓ వ్యక్తి, మరో మహిళ బైక్‌పై వచ్చి మాసాయిపేట బంగారమ్మ గుడి వద్ద చెట్టు కింద ఆగారు. కొద్దిసేపటి తర్వాత నిజామాబాద్ వైపు నుంచి గూడ్స్ రైలు రావడం గమనించి ఆ ఇద్దరు రైలు పట్టల మీద తలపెట్టి పడుకున్నారు. దీంతో వారి తలల మీద […]