Breaking News

CPM

రైతులను నాశనం చేసేలా వ్యవసాయ చట్టాలు

రైతులను నాశనం చేసేలా వ్యవసాయ చట్టాలు

సారథి న్యూస్, మహబూబాబాద్: ప్రధాని మోడీ పాలనలో భారత రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్ర అన్నారు. బీజేపీ ప్రభుత్వం మనువాద వ్యవస్థను పెంచి పోషిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులను నాశనం చేసేలా ఉన్నాయని ఆక్షేపించారు. రైతుల బతుకులు దుర్భరంగా మారబోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మహబూబాబాద్​లోని ఆర్​టీ గార్డెన్ లో ‘భారతదేశం కమ్యూనిస్టు ఉద్యమం.. వందేళ్ల ప్రస్థానం’ అనే అంశంపై నిర్వహించిన జిల్లాస్థాయిలో సదస్సులో […]

Read More
దెబ్బతిన్న పంటల పరిశీలన

దెబ్బతిన్న పంటల పరిశీలన

సారథి న్యూస్, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం సింగన్నవలస పంచాయతీ మల్లంగూడలో దెబ్బతిన్న పత్తి పంటలను పరిశీలిస్తున్న సీపీఎం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీఎం పాలకొండ కమిటీ కార్యదర్శి దావాల రమణారావు మాట్లాడుతూ.. సుమారు 20 ఎకరాల పత్తి పంటకు నష్టం కలిగిందని, అధికార యంత్రాంగం పంటనష్టం అంచనా వేయాలని డిమాండ్​చేశారు. సీపీఎం బృందంలో దూసి దుర్గారావు, కాద రాము, ఎస్.భానుసుందర్, కరువయ్య, సాంబయ్య పాల్గొన్నారు.

Read More
కమ్యూనిస్టు నేత గుండా మల్లేష్​ఇకలేరు

కమ్యూనిస్టు నేత గుండా మల్లేష్ ​ఇకలేరు

​అనారోగ్యంతో కన్నుమూసిన సీపీఐ నేత నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం సీఎం కేసీఆర్​ సంతాపం సారథి న్యూస్, రామగుండం: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే, సీపీఐ సీనియర్ నేత గుండా మల్లేష్‌ మంగళవారం కన్నుమూశారు. కొంతకాలంగా గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్​లోని నిమ్స్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కార్మిక కుటుంబం నుంచి వచ్చిన గుండా మల్లేష్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. ఆదిలాబాద్ జిల్లా తాండూరు మండలం రేచిని గ్రామానికి […]

Read More
14న రాష్ట్రవ్యాప్తంగా నిరహార దీక్షలు

14న రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్షలు

ఏఐకేఎస్‌సీసీ పిలుపు సారథి న్యూస్​, హైదరాబాద్​: అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ (ఏఐకేఎస్‌సీసీ) కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్రంలో అన్ని జిల్లా, మండల కేంద్రాలు, గ్రామాల్లో అక్టోబర్‌ 14న కనీస మద్దతు ధరల హక్కుదినాన్ని జరపాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. రాష్ట్రంలోని భాగస్వామ్య సంఘాలతో పాటు రైతు మద్దతుదారులంతా భాగస్వాములు కావాలని టి.సాగర్‌, పశ్య పద్మ, రాయల చంద్రశేఖర్‌, పల్లపు ఉపేందర్‌రెడ్డి, అచ్యుత రామారావు, కన్నెగంటి రవి పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ […]

Read More
కార్మికవర్గాన్ని ఆదుకోవాలి

కార్మికవర్గాన్ని ఆదుకోవాలి

సారథి న్యూస్, శ్రీకాకుళం: దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కార్మికవర్గంపై జరుపుతున్న తీవ్రమైన దాడికి నిరసనగా 11 అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపు మేరకు సీఐటీయూ ఆధ్వర్యంలో పాలకొండలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి దావాల రమణారావు మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం కరోనాను అవకాశంగా తీసుకుని కార్మికవర్గంపై ముప్పేట దాడి కొనసాగిస్తోందన్నారు. కేంద్రప్రభుత్వ విధానాల కారణంగా కార్మికులు నేడు పస్తులు ఉండాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. కార్మికులకు నెలకు రూ.7,500తో పాటు 10 […]

Read More
ప్రజలను ఆదుకోండి: సీపీఎం

ప్రజలను ఆదుకోండి: సీపీఎం

సారథి న్యూస్, కర్నూలు: కరోనా ప్రబలుతున్న సమయంలో ప్రజలను ఆదుకోవాలని సీపీఎం నాయకులు డిమాండ్​ చేశారు. దేశవ్యాప్త నిరసనల్లో భాగంగా ఆదివారం కర్నూలు నగరంలోని ముజఫర్ నగర్, ఇందిరాగాంధీ నగర్, వీకర్ సెక్షన్ కాలనీ, బాలగంగాధర్ తిలక్ నగర్, కల్లూరు, కృష్ణానగర్, షరీన్ నగర్, సీ క్యాంప్ సెంటర్, సోమిశెట్టి నగర్, బీటీఆర్ నగర్, మమతానగర్, అశోక్ నగర్, బళ్లారి చౌరస్తా, కొత్త బస్టాండ్ కూడళ్లలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి కుటుంబానికి రూ.7,500 ఆరునెలలపాటు ఇవ్వాలని, […]

Read More

వరదబాధితులను ఆదుకోండి

సారథిన్యూస్​, ఖమ్మం/ఏన్కూర్: వర్షాలతో సర్వస్వం కోల్పోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్​ చేశారు. బుధవారం ఆయన ఖమ్మం జిల్లా ఏన్కూర్​ మండలం భగవాన్​ నాయక్​ తండాలో పర్యటించారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు, కార్యదర్శివర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు, ఎస్​ఎఫ్​ఐ […]

Read More
ఆ ఇద్దరి నేతల మృతి తీరనిలోటు

ఆ ఇద్దరి నేతల మృతి తీరనిలోటు

సారథి న్యూస్​, కర్నూలు: కర్నూలు జిల్లా సీపీఎం నాయకుడు టి.షడ్రక్, గిరిజన ఉద్యమ నాయకుడు, సీపీఎం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని సీఐటీయూ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గౌస్ దేశాయ్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక మార్కెట్ యార్డులో అన్ని యూనియన్ల ఆధ్వర్యంలో సంతాపసభ నిర్వహించారు. షడ్రక్​ కార్మికుల పక్షాన ఎన్నో పోరాటాలు చేశారని గుర్తుచేశారు. ప్రజాప్రతినిధిగా స్థానికుల సమస్యల పరిష్కారం కోసం విశేషంగా కృషిచేశారని అన్నారు. సీపీఎంలో సర్పంచ్ నుంచి […]

Read More