సారథి, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో లాక్ డౌన్ నిబంధనలు పాటించని పలు షాపుల యజమానులకు శనివారం ఎస్సై నరేందర్ జరిమానా విధించారు. ఉదయం 10 గంటల తర్వాత అన్ని దుకాణాలు తప్పనిసరిగా మూసివేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనలను తప్పనిసరిగా ప్రతిఒక్కరూ పాటించాలని, ప్రతిఒక్కరూ భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించాలని ఆయన కోరారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట పంచాయతీ ఈవో విఠల్, పోలీస్ […]
సారథి, మంగపేట: ములుగు జిల్లా మంగంపేట మండలంలోని నర్సింహాసాగర్ గ్రామంలో కరోనాతో బాధపడుతున్న 10 కుటుంబాలకు ఎమ్మెల్యే సీతక్క స్వయంగా వెళ్లి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనాతో మరణించిన ఈసం లేపాక్షి కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండి, భౌతికదూరం పాటిస్తూనే మాస్కులు ధరించాలని సూచించారు. అవసరమైతే తప్ప ఇంట్లో నుంచి ప్రజలు బయటకు రావొద్దని సీతక్క కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మైల జయరాంరెడ్డి, ఎస్టీ సెల్ […]
సారథి, సిద్దిపేట ప్రతినిధి: నియోజకవర్గ కేంద్రమైన హుస్నాబాద్ పట్టణంలోని నాలుగో వార్డు పరిధిలోని బాలాజీనగర్, కాకతీయ నగర్ లో ఇంటింటా ఫీవర్ సర్వే నిర్వహించారు. అలాగే కరోనా వ్యాధి పీడితుల యోగక్షేమాలను సిబ్బంది అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఐలేని అనితారెడ్డి, ఆర్ పీ శోభ, ఆశావర్కర్ కాంత పాల్గొన్నారు.
సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి రైతు వేదికలో నిర్వహిస్తున్న కరోనా టెస్టింగ్ కేంద్రాలకు జనం బారులుదీరుతున్నారు. రోజు 100 మంది నుంచి 150 మంది టెస్టుల కోసం వస్తుండగా, కిట్లు మాత్రం 50 ఉంటున్నాయి. దీనితో పరీక్షల కోసం రెండు మూడు రోజులు తిరగాల్సి వస్తోంది. రోజుకు 50 టెస్టులు చేయగా అందులో 20 నుంచి 25 వరకు పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. గత 25 రోజుల్లో చొప్పదండిలో 30 నుంచి 40 మంది […]
సారథి, సిద్దిపేట: కొవిడ్ బాధితుల నుంచి ప్రస్తుతం వసూలు చేస్తున్న సీటీ స్కానింగ్ రేటు రూ.5,500 బదులుగా రూ.రెండువేల మాత్రమే తీసుకునేందుకు స్కానింగ్ సెంటర్లు అంగీకారం తెలిపాయని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు. గురువారం ఆయన సిద్దిపేట జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కష్టకాలంలో కొవిడ్ చికిత్స పొందే పేద, మధ్యతరగతి బాధితులకు ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకే చికిత్స అందించాలని సూచించారు. జిల్లాలో కొవిడ్ ఆస్పత్రులుగా మారిన అన్ని […]
సారథి, రామడుగు: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో లాక్ డౌన్ వల్ల వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి పట్ల రామడుగు మండలం గోపాల్ రావుపేట సర్పంచ్ కర్ర సత్యప్రసన్న ఉదారత చాటుకున్నారు. లాక్ డౌన్ తో అంబులెన్స్ లు, ఇతర వాహనాలు దొరక్క హాస్పిటల్ కు వెళ్లలేని వారి కోసం స్వయంగా తన సొంత కారును గురువారం నుంచి అందుబాటులో ఉంచారు. పెట్రోల్, డ్రైవర్ ను సంబంధిత వ్యక్తులే చూసుకోవాలని సర్పంచ్ సత్యప్రసన్న సూచించారు. […]
సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలోని రుక్మాపూర్ గ్రామ పంచాయతీలో ఎంపీపీ చిలుక రవీందర్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలు, వరి కొనుగోలు కేంద్రంలో పనిచేస్తున్న హమాలీలకు ఐదొందల మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కరోనా సెకండ్ వేవ్ నడుస్తున్నదని, ప్రజలంతా మాస్కులు ధరించి తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. భౌతికదూరం పాటించాలి. గ్రామంలో ప్రతిఒక్కరూ కరోనా నిబంధనలు పాటిస్తూ ఎవరికివారు తమ […]
ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి జాట్ రాష్ట్ర అధ్యక్షుడు పగుడాకుల బాలస్వామి నేత సారథి, వికారాబాద్: విధి నిర్వహణలో భాగంగా కోవిడ్ బారినపడి ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులకు రూ.50 లక్షల బీమా తరహా ఎక్స్గ్రేషియా చెల్లించాలని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(జాట్) రాష్ట్ర అధ్యక్షుడు పగుడాకుల బాలస్వామి నేత డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇల్లు వదిలి బయటికి రానీ విపత్కర పరిస్థితుల్లో కూడా కుటుంబాన్ని పక్కనపెట్టి విధి నిర్వహిస్తున్న జర్నలిస్టులను కొవిడ్ మహమ్మారి కబళించడం దురదృష్టకరమని […]