Breaking News

COVID

ఆఫీసు అయింది హాస్పిటల్

ఆఫీసు అయింది హాస్పిటల్​

గుజరాత్​ : గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఖాదర్‌ షేక్‌ కరోనా వైరస్‌ సోకి ప్రయివేట్‌ హాస్పిటల్‌లో చేరాడు. 20 రోజుల పాటు ప్రయివేట్‌ హాస్పిటల్లో చికిత్స చేయించుకున్న తర్వాత వారు వేసిన బిల్లు చూసి బిత్తర పోయాడు. ఇలా అయితే పేద ప్రజలు ఎలా వైద్యం చేయించుకుంటారా అనే ప్రశ్న అతన్ని తొలచింది. దీంతో తన ఆఫీసునే హాస్పిటల్‌గా మార్చేశాడు. 85 బెడ్లను ఏర్పాటు చేశాడు. స్థానిక అధికారుల నుండి అనుమతి తీసుకున్నాడు. వైద్య సిబ్బంది, యంత్రాలు, […]

Read More
హైదరాబాద్‌లో కంటైన్మెంట్‌ జోన్లు ఎన్నంటే

హైదరాబాద్‌లో కంటైన్మెంట్‌ జోన్లు ఎన్నంటే

సారథి న్యూస్​, హైదరాబాద్​: హైదరాబాద్‌లో కంటైన్మెంట్ జోన్ల వివరాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 92 యాక్టివ్ కంటైన్మెంట్ జోన్లు ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం తాజాగా తెలిపింది. హైదరాబాద్‌లో కంటైన్మెంట్ జోన్ల వివరాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 92 యాక్టివ్ కంటైన్మెంట్ జోన్లు ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం తాజాగా తెలిపింది. చార్మినార్ జోన్‌లో అత్యధికంగా 31 ఉండగా.. సికింద్రాబాద్‌లో 23, ఖైరతాబాద్‌లో 14, శేరిలింగంపల్లిలో 10, కూకట్‌పల్లిలో 9, ఎల్బీ నగర్‌లో 5 కంటైన్‌మెంట్ జోన్లు […]

Read More
కోవిడ్ వార్డుల తనిఖీ

కోవిడ్ వార్డుల తనిఖీ

సారథి న్యూస్​, అనంతపురం : జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిలోని కోవిడ్-19 ఐసీయూ,ఇతర వార్డులను సోమవారం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా వైద్యులు కల్పిస్తున్న సౌకర్యాలను గురించి కోవిడ్ బాధితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజలు ఏ విధమైన భయాందోళనలకు లోను కావద్దని ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందన్నారు.

Read More

కోవిడ్​ సెంటర్​లో లైంగికదాడి

ముంబై: కరోనాతో లక్షణాలతో కోవిడ్​ సెంటర్​లో చేరిన ఓ మహిళపై యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ హేయమైన ఘటన ముంబైలో చోటుచేసుకున్నది. కరోనా లక్షణాలతో ఓ మహిళ(40) నేవీ ముంబైలోని కోవిడ్​ సెంటర్​లో చేరింది. మహిళ రెండోఅంతస్థులో ఉండగా.. డాక్టర్​గా పరిచయం చేసుకున్న ఓ యువకుడు ఆమెపై లైంగికదాడి చేశాడు. సదరు యువకుడు కూడా అదే కోవిడ్​ సెంటర్​లో ఐదోఅంతస్థులో చికిత్సపొందుతున్నట్టు పోలీసులు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Read More

4 రోజుల్లో లక్షకేసులు

న్యూఢిల్లీ: కోవిడ్​​-19 కేసులసంఖ్య భారత్​లో అంతకంతకూ పెరుగుతున్నది. కేవలం గత నాలుగు రోజుల్లేనే లక్షకేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏ రేంజ్​లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా ఇప్పటివరకు మొత్తం కేసులసంఖ్య 8,49,553కు చేసింది. గత 24 గంటల్లో 28,637 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనా బారిన పడి 22,674 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా శనివారం 2,80,151 మందికి కరోనా పరీక్షలు చేసినట్టు ఐసీఎంఆర్​ తెలిపింది.

Read More
మెదక్ జిల్లాలో 10 కరోనా కేసులు

మెదక్ జిల్లాలో 10 కరోనా కేసులు

సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలో కరోనా రోజురోజుకు విస్తరిస్తోంది. ఇప్పటివరకు జిల్లాలో 67 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. శనివారం మరో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మెదక్ టౌన్ లోని ఫతేనగర్ లో మూడు, రాంనగర్ వీధిలో ఒకటి, కౌడిపల్లి మండలం కంచాన్ పల్లిలో ఒకటి, చేగుంట మండలం రాంపూర్ లో ఒకటి, కర్నాల్ పల్లిలో ఒకటి, చేగుంటలో ఒకటి, తూప్రాన్ మండలం ఘనపూర్ లో ఒకటి, పాపాన్నపేట మండలం ఎల్లాపూర్ […]

Read More
షార్ట్ న్యూస్

ఇంటికే కరోనా కిట్‌

సారథిన్యూస్​, హైదరాబాద్‌: హోం ఐసోలేషన్​లో ఉండి చికిత్సపొందుతున్న కరోనా బాధితులకు ‘ఐసోలేషన్​కిట్​’ ను ఇంటికే పంపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ కిట్​లో బాధితుడికి అవసరమైన ఔషధాలు, మాస్క్‌లు, శానిటైజర్లు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం వీటిని కరోనా బాధితుడికి ఉచితంగా అందిస్తుంది. శుక్రవారం కోఠిలోని ఆరోగ్యకార్యాలయంలో వైద్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల రాజేందర్​ సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బాధితులకు వీలైనంత త్వరలో ఈ కిట్లను అందజేయాలని అధికారులను ఆదేశించారు.ఐసొలేషన్‌ అవస్థలను తప్పించడానికే..రాష్ట్రంలో రోజురోజుకు […]

Read More

తెలంగాణలో కోవిడ్​ కాల్​సెంటర్​

సారథిన్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ రాష్ట్రం కోవిడ్​ బాధితుల కోసం ఓ కాల్​సెంటర్​ను ఏర్పాటు చేసింది. ఈ కాల్​సెంటర్​ ద్వారా కోవిడి పాజిటివ్​ బాధితులు హోం ఐసోలేషన్​లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్సపై అవగాహన కల్పించనున్నారు. 18005994455 టోల్​ఫ్రీ నంబర్​కు కాల్​చేసి సూచనలు పొందవచ్చు. వ్యాధి తీవ్రత సాధారణంగా ఉన్నవారికి 17 రోజులపాటు నిపుణులు ఫోన్​లో సూచనలు ఇస్తారు. లక్షణాలు అధికంగా ఉన్నవారికి టెలీ మెడిసిన్​ కన్సల్టేషన్ ద్వారా వైద్య సలహాలు అందిస్తారు. రెండువిడుతల్లో సుమారు 200 మంది ప్రతినిధులు […]

Read More