చెంచుల సమస్యలు తెలుసుకున్న నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్ పరిష్కరిస్తానని చెంచుబిడ్డలకు భరోసా సారథి న్యూస్, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ గా ఎల్.శర్మన్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన వెంటనే లింగాల, అమ్రాబాద్ మండలాల పరిధిలోని అప్పాపూర్ చెంచుపెంటలకు సందర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ సెంటర్, స్కూలును పరిశీలించారు. చెంచుల ఉపాధి, జీవన ప్రమాణాలను తెలుసుకున్నారు. చెంచులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. 30మంది రైతులకు బ్యాంకు అకౌంట్ నంబర్లు లేవని, ఆశావర్కర్ […]
సారథి న్యూస్, నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్‌గా ఎల్.శర్మన్ శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. ఓ గర్భిణికి అవసరమైన ‘ఓ’ నెగిటివ్ బ్లడ్‌ను స్వయంగా డొనేట్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ శర్మన్ మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధికి కృషిచేస్తానని చెప్పారు. కరోనా మహమ్మారి పట్ల ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సారథి న్యూస్, మెదక్: రైతులను మోసగిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని మెదక్ కలెక్టర్ ధర్మారెడ్డి హెచ్చరించారు. గురువారం జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలోని ఆటోనగర్ లో ఉన్న వీరభద్ర, కేదారీశ్వరి ట్రేడింగ్ కంపెనీ ఫర్టిలైజర్ దుకాణాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీచేశారు. రైతులకు విక్రయించే ఎరువులు, విత్తనాలు, పురుగు మందులను ఈ –పాస్ మిషన్ ద్వారా నమోదు చేయాల్సి ఉంటుందని అసలు దానిని వినియోగిస్తున్నారా ? లేదా ? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ–పాస్ […]
సారథి న్యూస్, మెదక్: జిల్లాలో బాల్యవివాహాలను పూర్తిగా అరికట్టాలని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. గురువారం మెదక్ కలెక్టరేట్ లో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్‌అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా ఇప్పటికీ కొన్ని గ్రామాలు, తండాల్లో బాల్యవివాహాలు జరుగుతున్నాయని అన్నారు. చిన్నతనంలోనే పెళ్లిచేస్తే వారి మానసికస్థితి ఎదగకపోవడంతో సమస్యలు వస్తాయని కలెక్టర్ వివరించారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తతెత్తకుండా మెదక్ జిల్లాలో సఖి సెంటర్‌ను నిర్వహించనున్నట్లు […]
సారథి న్యూస్, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్‌గా ఎల్.శర్మన్ ను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇంతకుముందు పనిచేసిన కలెక్టర్ ఈ.శ్రీధర్‌ను బదిలీచేసిన విషయం తెలిసిందే. వనపర్తి జిల్లా కలెక్టర్ యాష్మిన్బాషాకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. తాజాగా శ్రీధర్‌ను గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శిగా నియమించారు. అయితే నూతనంగా నియమితులైన కలెక్టర్ ఎల్.శర్మన్ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. అంతేకాదు శర్మన్ గతంలో నాగర్‌కర్నూల్ ఆర్డీవోగానూ పనిచేశారు.
సారథిన్యూస్, వంగూర్: విధుల్లో నిర్లక్ష్యం వహించిన పంచాయతీ కార్యదర్శి సస్పెండ్ అయ్యారు. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి రాజుగౌడ్ విధుల్లో నిర్లక్ష్యం వహించారు. విధులకు సరిగ్గా హాజరుకావడం లేదని.. ప్రజలను పట్టించుకోవడం లేదని అతడిపై ఫిర్యాదులు అందాయి. దీంతో విచారణ చేపట్టిన కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా.. కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. వీరితోపాటు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో అలసత్వం వహిస్తే […]
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గౌతమ్ గ్రీన్‌చాలెంజ్‌ను స్వీకరించి కలెక్టరేట్ వద్ద మూడు మొక్కలు నాటారు. జిల్లా అదనపు కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈవో సన్యాసయ్య, డీఆర్డీఏ పీడీ విద్యాచందన లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మొక్కలు నాటడం ఓ సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయ సిబ్బంది కవిత, మున్సిపల్ సిబ్బంది గురు లింగం, పర్యావరణ సూపర్వైజర్ దైదా వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రతి గ్రామంలోనూ 50 కల్లాలు నిర్మించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం హుస్నాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన డివిజన్ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పంచాయితీ సెక్రటరీలు నెలలో 3రోజులు అనుమతి లేకుండా విధులకు గైర్హాజతే సస్పెన్షన్ తప్పదని హెచ్చరించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ముజామిల్ ఖాన్, ఎమ్మెల్యే సతీశ్‌కుమార్, డీఆర్డీవో గోపాల్ రావు, డీపీవో సురేశ్, డీఎఫ్ వో శ్రీధర్, ఆర్డీవో […]