Breaking News

COLLECTOR

కలెక్టర్​ ఆకస్మిక పర్యటన.. షాకింగ్​ నిజాలు

సారథిన్యూస్​, నాగర్​కర్నూల్​: నాగర్​కర్నూల్​ కలెక్టర్​ ఆకస్మిక పర్యటనతో షాకింగ్​ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్డీవో, ఎంపీడీవో కార్యాలయాల్లో సిబ్బంది ఎవరూ సమయానికి ఆఫీస్​కు రారని.. ప్రజలను ఏమాత్రం పట్టించుకోవడంలేదని కలెక్టర్​ పర్యటనలో తేలింది. కొత్త కలెక్టర్​ శర్మన్​ విధుల్లో చేరినప్పటినుంచి బిజీబిజీగా గడుపుతున్నారు. ఎప్పటికప్పుడు ఆకస్మికపర్యటనలు చేస్తూ.. ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటున్నారు. తాజాగా గురువారం ఆయన నాగర్​కర్నూల్​లో కాలినడకన తిరిగి పలు కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీచేశారు. ఉదయం 10:15 గంటలకు  డీఆర్వో మధుసూదన్ నాయక్ తో కలిసి […]

Read More
కల్నల్​ కుటుంబానికి బంజారాహిల్స్​లో ఇంటిస్థలం

కల్నల్​ కుటుంబానికి బంజారాహిల్స్​లో స్థలం

సారథి న్యూస్, హైదరాబాద్: చైనా సరిహద్దులో పోరాడుతూ అమరుడైన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇటీవల చెక్కు రూపంలో నగదు అందజేసిన ప్రభుత్వం ఇప్పుడు ఇంటి స్థలం కూడా అందించబోతోంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో కేబీఆర్ పార్కుకు ఎదురుగా రూ.20 కోట్ల విలువైన 711 గజాల స్థలాన్ని కేటాయించింది. మంత్రి జగదీశ్ రెడ్డి చేతుల మీదుగా ఈ స్థలాన్ని సంతోష్ బాబు కుటుంబానికి అప్పగించనుంది. […]

Read More

ముంపు బాధితులను ఆదుకుంటాం

సారథిన్యూస్​, నాగర్​కర్నూల్​: ప్రాజెక్టుల కోసం భూములిచ్చిన ముంపు బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని నాగర్​కర్నూల్​ కలెక్టర్​ శర్మణ్​ పేర్కొన్నారు. మంగళవారం ఆయన బిజినేపల్లి మండలం వట్టెంలో పర్యటించారు. అక్కడ ఆర్​ అండ్​ ఆర్​ కింద నిర్మిస్తున్న ఇండ్లను పరిశీలించారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు ముంపునకు గురవుతున్న రెండు తండాల ప్రజల కోసం వట్టెంలో 466 ఇండ్లను నిర్మిస్తున్నారు. ఈ ఇండ్లను ఆయన పరిశీలించారు. లేఅవుట్ ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు […]

Read More
ఏడాది పాలన..ఎన్నో ప్రశంసలు

ఏడాది పాలన.. ఎన్నో ప్రశంసలు

సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్​రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమం పథకాలను పకడ్బందీగా వర్తింపచేయడంలో జేసీ–2 సయ్యద్‌ ఖాజా మొహిద్దీన్‌ సక్సెస్​ అయ్యారు. కలెక్టరేట్‌ అధికారులతో పాటు క్షేత్రస్థాయి సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్న ఆయన ‘రైతు భరోసా, మన పాలన మీ సూచన, జగనన్న చేదోడు’ వంటి పథకాలను ప్రణాళికబద్ధంగా అమలుచేయడంలో తనదైన ముద్ర వేసుకున్నారు. జగనన్న చేదోడు పథకంలో కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే మూడవ స్థానం, ముస్లిం మైనార్టీలో ప్రథమస్థానం దక్కించుకోవడంపై జేసీ […]

Read More
కొల్లాపూర్​ అభివృద్ధి చెందాలి

కొల్లాపూర్​ అభివృద్ధి చెందాలి

సారథి న్యూస్​, నాగర్​కర్నూల్​: కొల్లాపూర్​ మరింత అభివృద్ధి చెందాలని నాగర్​కర్నూల్​ జిల్లా కలెక్టర్​ ఎల్​.శర్మన్​ ఆకాంక్షించారు. ఆదివారం ఆయన మార్నింగ్​ వాక్​లో భాగంగా కొల్లాపూర్ లో పర్యటించారు. పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ఆ మేరకు ప్రణాళికలతో అధికారులు ముందుకు సాగాలని సూచించారు. మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పట్టణాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని సూచించారు. కరెంట్​ బిల్లులు నెలనెలా చెల్లించాలని, విద్యుత్​ను పొదుపుగా వాడాలని సూచించారు. పట్టణంలో డంపింగ్ ​యార్డ్​ పనులను కంప్లీట్​ చేయాలన్నారు. […]

Read More
రైతువేదికల నిర్మాణానికి 76 క్లస్టర్లు

రైతువేదికల నిర్మాణానికి 76 క్లస్టర్లు

సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రైతువేదికల నిర్మాణాలను త్వరగా ప్రారంభించాలని కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్​లో జిల్లాలోని ఆయా మండలాల ప్రత్యేకాధికారులతో సమావేశం నిర్వహించారు. రైతువేదికల నిర్మాణానికి జిల్లాలో 76 క్లస్టర్లుగా విభజించామన్నారు. పనుల పురోగతిని ఫొటోలు తీసి అప్​లోడ్​ చేయాలని సూచించారు. గ్రామాల్లో ఎలాంటి విద్యుత్​ సమస్యలు తలెత్తినా వెంటనే స్పందించేలా సిబ్బందిని అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్ ఈఈ వెంకటేశ్వర్లు, డీఆర్డీవో శ్రీనివాస్, జిల్లా […]

Read More
ఇక అభివృద్ధి పనులపై దృష్టిపెట్టండి

ఇక అభివృద్ధి పనులపై దృష్టిపెట్టండి

సారథి న్యూస్, కర్నూలు: జిల్లాలో కరోనా కట్టడికి అధికారులు, సిబ్బంది బాగా కృషిచేశారని, ఇకపై అభివృద్ధి పనులపై దృష్టిసారించాలని కర్నూలు కలెక్టర్​ వీరపాండియన్​ సూచించారు. శనివారం కలెక్టరేట్​ నుంచి ఆర్డీవోలు, మండలాధికారులతో పాటు మున్సిపల్‌ కమిషనర్లతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి పథకం లక్ష్యాలను పూర్తిచేయాలన్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లొచ్చిన వారికి కొత్తగా జాబ్​కార్డులు ఇవ్వాలన్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి హోం ఐసోలేషన్​లో ఉండేందుకు ప్రోత్సహించారు. అనంతరం జేసీ రవిపట్టాన్​ శెట్టి మాట్లాడుతూ.. […]

Read More

కందనూలు రూపురేఖలు మార్చుదాం

సారథిన్యూస్​, నాగర్​కర్నూల్​: నాగర్​కర్నూల్​ జిల్లా కేంద్రాన్ని అందరి భాగస్వామ్యంతో సర్వాంగ సుందరంగా మార్చుదామని కలెక్టర్​ ఎల్​ శర్మన్​ పిలుపునిచ్చారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన శర్మన్​ శనివారం ఉదయం 5:40కి పట్టణంలో మార్నింగ్​వాక్​చేసి సమస్యలను తెలుసుకున్నారు. మున్సిపల్​ కార్మికులతో మాట్లాడారు. వ్యాపారులు రోడ్లవెంబడి చెత్తవేస్తే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బస్టాండ్​లోని మూత్రశాలలో అపరిశుభ్ర వాతావరణం ఉండటంతో అక్కడి నిర్వాహకులపై కలెక్టర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కార్యాలయానికి రావాలని డిపో మేనేజర్​ను ఆదేశించారు. 10 రోజుల్లోనే నాగర్​కర్నూల్ […]

Read More