సారథిన్యూస్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాక్షసపాలన కొనసాగుతున్నదని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేశ్ ఆరోపించారు. ప్రశ్నించిన వారందని ఈ రాక్షస ప్రభుత్వం జైలుకు పంపిస్తున్నదని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? ఇంతకంటే ఈ రాష్ట్రంలో దారుణమైన విషయం ఏముంటది అనిపేర్కొన్నారు. తెలుగుదేశం కార్యకర్తల జోలికి వస్తే ఊరుకొనేది లేదని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు లేవనెత్తి ప్రభుత్వాన్ని నిలదీసిన గిరిజన అధికారిపై జులుం ప్రదర్శించడం ఘోరమన్నారు. మాస్క్ అడిగినందుకు దళిత డాక్టర్ సుధాకర్‌పై పిచ్చివాడనే ముద్ర వేశారని […]
సారథిన్యూస్, విశాఖపట్టణం: సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అండతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. దళితులపై వరుస దాడులు జరుగుతుంటే సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఆదివారం విశాఖపట్టణం జిల్లా తెలుగుదేశంపార్టీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖలో దళితుడి భూఆక్రమణను ఖండించారు. రాష్ట్రంలో ప్రతిరోజు దళితులపై దాడులు జరుగుతున్నాయన్నారు. జగన్ ఉదాసీన వైఖరితోనే దాడులు పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి […]
సారథిన్యూస్, రామగుండం: బషీర్‌బాగ్‌లో అప్పటి సీఎం చంద్రబాబు సృష్టించిన మారణకాండ తెలుగుజాతి ఎప్పటికీ మరిచిపోదని వామపక్షాల నేతలు పేర్కొన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వామపక్షాల నేతలు బషీర్‌బాగ్ అమరులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చంద్రబాబు లాంటి దుర్మార్గుడిని తెలుగుజాతి ఎప్పటికి క్షమించబోదని పేర్కొన్నారు. పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలంటూ ధర్నాచేసిన అమాయకరైతులను, వామపక్ష ఉద్యమకారులను చంద్రబాబు ప్రభుత్వం అమానుషంగా పొట్టనపెట్టుకున్నదని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నేతలు గౌతం గోవర్ధన్, […]
సారథి న్యూస్, కర్నూలు: దళితుల అభ్యున్నతికి అడుగడుగునా అడ్డుపడే మాజీ సీఎం చంద్రబాబు.. ఉన్నట్టుండి దళితులపై ప్రేమ ఎందుకు ఒలకబోస్తున్నారని లీడర్స్ యూత్ సొసైటీ అధ్యక్షు మాదారపు కేదార్నాథ్ప్రశ్నించారు. తన హయాంలో దళితులపై దాడులు చేయించడంతోపాటు అవమానపరిచేలా మాట్లాడిన వ్యక్తి.. ప్రతిపక్షంలో ఉన్నందుకు వారిపై కపటప్రేమ చూపుతున్నారని విమర్శించారు. శుక్రవారం ఆయన వైఎస్సార్సీపీ ఆఫీసులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇళ్లస్థలాలు ఇస్తుంటే.. ఓర్వలేకే చంద్రబాబు అడ్డుపడ్డారని గుర్తుచేశారు. ఇలాగే చేస్తే ఆయనకు […]
అమరావతి: వరుస ఎదురుదెబ్బలతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చంద్రబాబు, యువనేత లోకేశ్ మీద నమ్మకం లేక పలువురు కీలకనేతలు ఆ పార్టీని వీడుతున్నారు. మరికొందరు పార్టీలోనే ఉన్నా అధికారిక కార్యక్రమాలకు హాజరుకావడం లేదు. ఈ క్రమంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రమేష్‌బాబుకు స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ […]
సారథిన్యూస్, అమరావతి: ఏపీ మాజీసీఎం చంద్రబాబు నాయుడు రాజకీయనాయకుడా.. లేక రియల్ఎస్టేట్ బ్రోకరా అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి పేరిట జరుగుతున్నది ఉద్యమం కాదని.. రియల్బ్రోకర్లు ఆడిస్తున్న నాటకమని మండిపడ్డారు. 250 రోజుల ఉద్యమని పచ్చమీడియాలో షో చేస్తున్నారని.. అక్కడ కనీసం 10 మంది కూడా లేరని ఎద్దేవా చేశారు. తన బినామీలను రక్షించుకొనేందుకే బాబు నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. ‘విశాఖపట్టణం మీద చంద్రబాబు ఎందుకు విషం […]
సారథిన్యూస్, అమరావతి: అమరావతిపై పోల్ పేరిట మాజీసీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొత్తనాటకానికి తెరలేపారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ( ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. చంద్రబాబు పేరు చెబితేనే ప్రజలు మండిపడుతున్నారన్నారు. అమరావతి పేరుమీద చంద్రబాబు దొంగపోల్స్ పెడుతున్నారన్నారు. పచ్చ మీడియా నిర్వహించే పోల్స్‌లో ఫలితాలు ఎలా ఉంటాయో ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు చంద్రబాబు ఎలా వ్యవహరించారో ప్రజలింకా మరిచిపోలేదన్నారు. తన ఎత్తుగడలతో ఎల్లోమీడియా అండదండలతో చంద్రబాబు దుష్టపన్నాగాలు […]
విజయవాడ: పది మందికి చావుకు కారకుడైన రమేశ్ ఆస్పత్రి యజమాని, పోతినేని రమేశ్‌బాబు ఏ బొక్కలో దాక్కున్నా ఏపీ పోలీసులు వదిలిపెట్టరని.. ఆయనను అరెస్ట్ చేసి తీరుతారని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో దాక్కొని కుట్రలు పన్నుతున్నారని.. దమ్ముంటే ఆంధ్రప్రదేశ్‌కు రావాలని సవాల్ విసిరారు. చంద్రబాబు, పచ్చమీడియా కుట్రలను తిప్పికొడతామన్నారు. పరిహారం విషయంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి .. అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. మంగళవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. […]