Breaking News

CARONA

ఒకేరోజు 70వేలకు పైగా కేసులు

ఒకేరోజు 70వేలకు పైగా కేసులు

న్యూఢిల్లీ: భారత్ లో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వైరస్‌ ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. శనివారం (గత 24 గంటల్లో) కొత్తగా 77,266 పాజిటివ్‌ నమోదవడం వ్యాధి తీవ్రతకు అద్దంపడుతోంది. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 33,87,501కు చేరింది. ఒక్కరోజే 70వేలకు పైగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. తాజాగా 1,057 మంది కోవిడ్‌ వ్యాధిబాధితులు మృతిచెందడంతో రోగుల సంఖ్య 61,529 కు చేరింది. ఇప్పటివరకు 25,83,948 మంది కరోనా పేషెంట్లు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో […]

Read More
2,932 కరోనా కేసులు, 11 మంది మృతి

2,932 కరోనా కేసులు.. 11 మంది మృతి

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్‌ కేసుల ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం(24 గంటల్లో) 2,932 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 1,17,415కు చేరింది. తాజాగా మహమ్మారి బారినపడి 11మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో చనిపోయినవారు 799 మంది ఉన్నారు. వ్యాధి బారినపడి ఆస్పత్రి నుంచి కోలుకుని 1,580 మంది డిశ్చార్జ్​అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 87,675కు చేరింది. ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 28,941కు […]

Read More

కరోనాతో సర్పంచ్ మృతి

సారథి న్యూస్, రామడుగు: కరోనా మహమ్మారి ఓ సర్పంచ్​ను బలితీసుకుంది. తమతో కలిసి తిరిగిన వ్యక్తి.. తమ బాగోగులు పట్టించుకున్న నేత ఇక లేడన్న వార్త ఆ ఊర్లో విషాదం నింపింది. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం పందికుంటపల్లి సర్పంచ్​, మండల సర్పంచ్​ల ఫోరం అధ్యక్షుడు కటకం రవీందర్​ గురువారం కన్నుమూశారు. ఆయనకు ఇటీవల కరోనా సోకింది. దీంతో హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​ హాస్పిటల్​లో చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయారు. రవీందర్​ ఏకగ్రీవంగా సర్పంచ్​గా ఎన్నికయ్యారు. గ్రామంలో ఎన్నో […]

Read More

పెద్దశంకరంపేటలో కరోనా కలకలం

సారథి న్యూస్, పెద్ద శంకరంపేట: కరోన తీవ్రత కొనసాగుతోంది. మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట పీహెచ్​సీలో గురువారం 28 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని.. అత్యవసరమైతేనే బయటకు రావాలని వైద్య​అధికారులు సూచిస్తున్నారు. కొంతమంది అజాగ్రత్త వల్ల మిగతావారు ఇబ్బందుల పాలవుతున్నారని చెప్పారు.

Read More
‘పవర్ గ్రిడ్’ జీఎంకు ఘన సన్మానం

‘పవర్ గ్రిడ్’ జీఎంకు ఘన సన్మానం

సారథి న్యూస్, కర్నూలు: కరోనా లాక్​డౌన్​సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన కర్నూలు నగర పోలీసులకు ఆహారం ప్యాకెట్లను పంపిణీ చేసిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కర్నూలు డిప్యూటీ జనరల్ మేనేజర్​ప్రకాశ్​ను గురువారం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఘనంగా సన్మానించి ప్రశంసాపత్రం అందజేశారు. కార్యక్రమంలో హోంగార్డు కమాండెంట్ రామ్మోహన్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ రాధాక్రిష్ణ, ఎఆర్ డీఎస్పీ ఇలియాజ్ బాషా, ఆర్ఐ లు సురేంద్రరెడ్డి, వెంకటేశ్వర్ రావు, వెంకటరమణ పాల్గొన్నారు.

Read More
ఇవి నానబెట్టి తింటేనే ఆరోగ్యం

ఇవి నానబెట్టి తింటే ఆరోగ్యం

కరోనా విజృంభిస్తున్న వేళ ప్రతిఒక్కరూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీటిని తీసుకుంటే మరింత శక్తి పెరుగుతుందని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. కొన్ని పదార్థాలను మామూలుగా తినేకంటే.. నానబెట్టి క్రమం తప్పకుండా ఎన్నో ఆరోగ్య లాభాలు ఉంటాయి. బరువు తగ్గడంతో పాటు మరెన్నో ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో తెలుసుకుని ట్రై చేసి చూడండి.మెంతులురెండు చెంచాల మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినాలి. ఆ నీటిని తాగాలి. రోజూ ఇలా చేయడం వల్ల కీళ్లనొప్పులు తగ్గుతాయి. వీటిలో పీచు అధికంగా […]

Read More

తమన్నా పేరెంట్స్​కు కరోనా

ప్రముఖ హీరోయిన్​ తమన్నా తల్లిదండ్రులకు కరోనా సోకింది. ఈ విష‌యాన్ని స్వయంగా ఆమె తన ట్వట్టర్​లో వెల్లడించింది. ‘మా అమ్మా, నాన్న కొద్దిరోజులుగా కోవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఇంట్లో ఉన్న వారంతా టెస్టులు చేయించుకున్నాం. దురదృష్టవశాత్తు మా తల్లిదండ్రులకు పాజిటివ్‌ వచ్చింది కానీ, నాతో పాటు మిగిలిన కుటుంబ సభ్యులందరికీ నెగిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం వారు హోం ఐసోలేషన్​లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు’. అని త‌మ‌న్నా ట్విట్ట‌ర్ లో పేర్కొంది. కాగా, ముందుజాగ్రత్తగా […]

Read More
60వేలు దాటిన మరణాలు

60వేలు దాటిన మరణాలు

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తున్నది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 75,760 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 1,023 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 60,472కు చేరుకున్నది. భారత్‌లో ప్రస్తుతం 7,25,991 యాక్టివ్‌ కేసులు ఉండగా.. మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 33,10,235కు చేరుకుంది. వీరిలో 25,23,772 మంది కరోనాను జయించి డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటన విడుదల చేసింది. కరోనా వైరస్‌ […]

Read More