Breaking News

BJP

రాముడి పుట్టిన ముహూర్తంలోనే..

రాముడు పుట్టిన ముహూర్తంలోనే..

అయోధ్య: దేశంలోని హిందువులంతా ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిరం నిర్మాణం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. దీంతో అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సిటీలోని ఆలయాను, సరయూ నదీతీరాన్ని అందంగా తీర్చిదిద్దారు. ప్రధాని మోడీ అయోధ్యలో దాదాపు 3 గంటల పాటు గడపనున్నారు. బుధవారం ఉదయం స్పెషల్‌ ఫ్లైట్‌లో ఢిల్లీ నుంచి లక్నో చేరుకుంటారు. అక్కడ నుంచి స్పెషల్‌ చాపర్‌‌లో అయోధ్యకు వెళ్తారు. ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని సరయూ నది తీరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన […]

Read More
కర్ణాటక మాజీ సీఎంకు కరోనా

కర్ణాటక మాజీ సీఎంకు కరోనా

బెంగళూరు: కరోనా మహమ్మారి దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే కర్ణాటక, మధ్యప్రదేశ్​ సీఎంలకు కరోనాకు అంటుకోగా, తాజాగా కాంగ్రెస్​ సీనియర్​ నేత, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్యకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. ఈ విషయన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్​లో వెల్లడించారు. తనకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని అయినప్పటికీ వైద్యుల సలహా మేరకు ముందు జాగ్రత్తగా ఆస్పత్రిలో చేరానని ప్రకటించారు. అలాగే తనతో సన్నిహితంగా మెలిగినవారు అప్రమత్తం కావాలని, స్వీయ నిర్బంధం పాటించాలని ట్వీట్‌ చేశారు. […]

Read More
మూడు భాషల విధానం మాకొద్దు

మూడుభాషల విధానం మాకొద్దు

చెన్నై: కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన విద్యావిధానాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయబోమని తమిళనాడు సీఎం కే పళనిస్వామి తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టాలనుకుంటున్న జాతీయ విద్యావిధానంలో విద్యార్థులకు తమ రాష్ట్ర ప్రాంతీయభాషతో పాటు హిందీ, ఇంగ్లీష్​ లాంగ్వేజ్​లను పెట్టాలన్న నిబంధన ఉందని, అది తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన తెలిపారు. తమిళనాడులో విద్యార్థులకు తమిళం, ఇంగ్లీష్​ మాత్రమే బోధిస్తున్నామని ఇదే విధానాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కేంద్రప్రభుత్వం చెప్పినట్టుగా హిందీని మూడో లాంగ్వేజ్​గా […]

Read More
కేంద్రమంత్రితో సుజనా భేటీ అందుకేనా!

కేంద్రమంత్రితో సుజనా భేటీ అందుకేనా?

సారథి న్యూస్​, హైదరాబాద్​: ఏపీ బీజేపీ నేత సుజనా చౌదరి.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డిని కలిసినట్టు సమాచారం. ఈ మేరకు వారు ఏ విషయాలపై మాట్లాడుకుని ఉంటారన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లుకు ఇటీవల గవర్నర్​ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీ నేతలంతా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కేంద్రప్రభుత్వం రాజధానుల విషయంలో జోక్యం చేసుకుంటుందని, గవర్నర్​ ఈ బిల్లును ఆమోదించబోరని వారు గట్టి నమ్మకంతో ఉన్నారు. కానీ […]

Read More
నాణ్యమైన మద్యం అమ్మాలి

నాణ్యమైన మద్యం అమ్మాలి

సారథి న్యూస్​, కర్నూలు: గతంలో ఎక్కడా కనిపించని బ్రాండ్లను తీసుకొచ్చి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని, దీనివల్ల తాగుడుకు అలవాటుపడిన పేదలు గంజాయి, నాటుసారా తాగుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్​ పార్థసారధి ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విడత వారీగా మద్య నిషేధానికి తాము మద్దతిస్తామని, కానీ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సరైన, నాణ్యమైన మద్యం విక్రయించకపోతే ఎలా? అని ప్రశ్నించారు. ఇప్పుడు శానిటైజర్లు […]

Read More
బీజేపీ స్టేట్​కమిటీ నియామకం

బీజేపీ స్టేట్ ​కమిటీ నియామకం

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ మరింతగా బలపడేందుకు ప్లాన్ ​చేస్తోంది. అందుకు అనుగుణంగా కమిటీలను నియమిస్తోంది. సమర్థవంతమైన నేతలకు బాధ్యతలు అప్పగిస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ​కుమార్​ ఆదివారం పూర్తి కమిటీని ప్రకటించారు. జి.విజయరామారావు, చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బండారు శోభారాణి, సంకినేని వెంకటేశ్వరరావు, ఎండల లక్ష్మీనారాయణ, యెన్నం శ్రీనివాస్​రెడ్డి, జి.మనోహర్​రెడ్డి, బండారు శోభారాణిని ఉపాధ్యక్షులుగా నియమించారు. అలాగే ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శృతి […]

Read More
ఏపీ మాజీమంత్రి మాణిక్యాలరావు కన్నుమూత

ఏపీ మాజీమంత్రి మాణిక్యాలరావు కన్నుమూత

అమరావతి: ఆంధ్రప్రదేశ్​ మాజీ మంత్రి, బీజేపీ సీనియర్​నేత పైడికొండల మాణిక్యాలరావు కరోనాతో శనివారం కన్నుమూశారు. ఇటీవల ఆయన తాడేపల్లిగూడెం మాజీ మున్సిపల్ చైర్మన్ భీమ శంకరరావు(తాతాజీ)తో కలిసి ఒకే కారులో ప్రయాణించారు. శంకరరావుకు కరోనా ప్రబలినట్లు నిర్ధారణ కావడంతో మాణిక్యాలరావు కూడా కరోనా టెస్టు చేయించుకున్నారు. 20 రోజుల పాటు ఏలూరు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తీసుకొచ్చారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. తాడేపల్లిగూడెం నుంచి బీజేపీలో సామాన్య కార్యకర్త నుంచి […]

Read More
ప్రైవేట్‌ స్కూలు టీచర్లను ఆదుకోవాలి

ప్రైవేట్‌ స్కూలు టీచర్లను ఆదుకోవాలి

సారథి న్యూస్​, కర్నూలు: రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ ఎందరో చిరుద్యోగులు ఉపాధి కోల్పోయి వీధినపడ్డారని, వారందరినీ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్​ పార్థసారధి డిమాండ్​ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐదులక్షల మందికి పైగా ప్రైవేట్‌ స్కూలు, కాలేజీ టీచర్లు, సిబ్బంది ఉన్నారని, వారంతా ఐదునెలలుగా ఉపాధి లేక వీధుల్లో కూరగాయలు అమ్ముకోవడం, వ్యవసాయ కూలీగా మారుతున్నారని, అలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సంక్షేమ పథకాలను […]

Read More