సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైద్యానికి అయ్యే ఖర్చులను నిర్ధారిస్తూ ఉత్తుర్వులు జారీచేసింది. ఈ మేరకు అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో వసూలు చేసే ఫీజులపై వైద్యఆరోగ్య శాఖ స్పెషల్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వం నిర్ధారించిన ఫీజుల వివరాలు ఇలా ఉన్నాయి. క్రిటికల్ గా లేని పేషెంట్ల వైద్యానికి రోజుకు రూ.3,250 గా నిర్ధారించారు. ఎన్ఐవీతో […]
ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు అభివృద్ధికి అడ్డుగా మారిన వైరస్ తాజాగా ఇళ్ల పట్టాల పంపిణీకి చెక్ సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు పెరగడంలో పలు జిల్లాలు పోటీపడుతున్నాయి. భౌతిక దూరం పాటించకపోవడం, మాస్కులు కట్టుకోకపోవడంతో కేసులు పెరుగుతున్నాయి. మార్చి 25 నుంచి మే 30వ తేదీ వరకు లాక్ డౌన్ విధించినప్పుడు నియంత్రణలో ఉన్న కరోనా వైరస్ లాక్ ఓపెన్ చేసిన తర్వాత పంజా విసిరింది. […]
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూటు మార్చారా.. ఆయనకు సొంత పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సెగ తగిలిందా..? పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధుల్లో అసంతృప్తి ఉన్న విషయం జగన్ తెలుసుకున్నారా..?. ఇటీవల పరిణామాలు చూస్తే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇటీవల కాలంలో సీఎం జగన్ ఎవరికీ అపాయింట్‌మెంట్లు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో సొంత పార్టీకి చెందిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు తీవ్ర విమర్శలు చేశారు. ఒకరిద్దరు ఎంపీలకు తప్ప ఎవరికీ సీఎం అపాయింట్‌మెంట్ […]
ఏ పార్టీలో ఉన్నా ఆమె ఫైర్‌బ్రాండే.. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ రచ్చరచ్చే. అది మీటింగ్ కానీ, అసెంబ్లీ కానీ. ఒకప్పుడు ఆమెను ఐరన్‌లెగ్‌గా అభివర్ణించినా.. దానికి చెక్ పెడుతూ ఇక ఆమెకు అంతా విజయమే అనుకున్నారు చాలామంది. కానీ, విజయం అంచులదాకా వచ్చి దూరమవుతోంది.. అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇదంతా ఎవరి గురించో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఆమే ఏపీ రాష్ట్రంలోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా. ఆమె సినీజీవితంలో ఎంతో ఎత్తుకు […]
సారథి న్యూస్, హైదరాబాద్: జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అంటారు పెద్దలు. ఆ తెలివితోనే ఎదుగుతున్నారు కొందరు. ప్రభుత్వాలు కొన్ని నిబంధనలు విధిస్తే వాటినుంచి తప్పించుకొని ఎలా సంపాదించాలోననే ఆలోచనల కోసం వారి మెదడుకు పని పెడుతున్నారు. సర్కారు కంటే మెరుగ్గా ఆలోచన చేసి భారీగా సంపాదిస్తున్నారు. ఏపీలో దశలవారీగా మద్యనిషేధం విధించే క్రమంలో అక్కడి సీఎం మద్యం ధరలను భారీగా పెంచారు. దుకాణాల సంఖ్యను కూడా సగానికి సగం తగ్గించారు. దీంతో మద్యం కొనుగోలు చేయలేక […]
పార్టీ శ్రేణులకు ఏపీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పిలుపు సారథి న్యూస్, శ్రీకాకుళం: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించి, ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మే 23వ తేదీకి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా పార్టీ శ్రేణులకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ శుభాకాంక్షలు తెలిపారు. 23న అన్ని నియోజకవర్గ కేంద్రాలతో పాటు, మండల కేంద్రాల్లో పార్టీ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. శ్రేణులు పేదలకు పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఈ […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ ఆదేశాలు సారథి న్యూస్, అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర విద్యార్థులకు శుభవార్త అందించింది. ప్రాణాంతక కరోనా వైరస్ కారణంగా మూతపడ్డ స్కూళ్లను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఆగస్టు 3న రాష్ట్రంలోని అన్ని స్కూళ్లను పునఃప్రారంభించాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ‘నాడు..నేడు’ కార్యక్రమంపై సమీక్షంలో భాగంగా స్కూళ్ల అభివృద్ధిపై సీఎం ఆరాతీశారు. జులై నెలారులోగా మొదటి విడతలో చేపట్టిన 15,715 […]
– ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథి న్యూస్, అనంతపురం: కరోనా పట్ల ప్రజల్లో ఉన్న ఆందోళన, భయం పూర్తిగా తొలగిపోయేందుకు తీసుకునే చర్యలపై దృష్టిపెట్టాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కరోనా ప్రబలిన వారిపై వివక్ష చూపడం సరికాదని, వైఖరిలో మార్పు తీసుకురావాలన్నారు. కోవిడ్-19 నియంత్రణ చర్యలపై సీఎం జగన్ శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు, సీఎస్ నీలంసాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, […]