Breaking News

TELANGANA

విపక్షాల అభ్యర్థిగా కోదండరాం.. పోటీ రసవత్తరం

సారథిన్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, టీజేఏసీ చైర్మన్​ కోదండరాం త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయనున్నాడు. అందుకోసం ఆయన విపక్షాల మద్దతు కూడగట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితి పోటీచేసినప్పటికీ ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. దీంతో తెలంగాణ యువత, నిరుద్యోగుల్లో కోదండరాం పట్ల సానుభూతి ఉన్నది. సోషల్​మీడియాలో ఆయనకు మంచి ఫాలోయింగ్​ ఉన్నది. ఈ క్రమంలో గ్యాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగితే కోదండరాం తేలిగ్గా గెలుస్తారని […]

Read More

దోమపోటును తరిమేద్దామిలా..

సారథి న్యూస్, రామాయంపేట: ప్రస్తుతం వాతవరణ పరిస్థితుల్లో వరిపంటకు దోమపోటు, ఆకు ఎండుతెగులును గమనించామని మెదక్​ జిల్లా నిజాంపేట వ్యవసాయాధికారి సతీశ్​ పేర్కొన్నారు. వీటిని నివారిస్తే వరిలో అధికదిగుబడి సాధించవచ్చని చెప్పారు. బాక్టీరియా ఆకు ఎండు తెగులు నివారణకు ప్లాంటో మైసిన్ 100 గ్రామ్, లేదా కాపర్ ఆక్సీ క్లోరైడ్ , 600 గ్రాములు లీటరు నీటికి కలిపి ఒక ఎకరంలో పిచికారీ చేసుకోవాలని సూచించారు. ఇక అగ్గితెగులు నివారణకు ట్రైసాక్లోజల్ 120 గ్రామ్ లేదా ఐసోప్రాథయోలిన్ […]

Read More

చెత్తను డంపింగ్ ​యార్డుకు తీసుకెళ్లండి

సారథి న్యూస్, రామాయంపేట: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో కొందరు సిబ్బంది నీరుగారుస్తున్నారు. మెదక్​ జిల్లా నిజాంపేట మండలం నస్కల్​ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం డంపింగ్ యార్డును ఏర్పాటు చేసింది. అయితే పంచాయతీ సిబ్బంది మాత్రం చెత్తను డంపింగ్​యార్డుకు తరలించకుండా హైస్కూల్ పక్కన ఉన్న ఒక పాడుబడ్డ బావిలో పడేస్తున్నారు. ఈ చెత్తతో ప్రస్తుతం సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎన్నిసార్లు సర్పంచ్ కి మొరపెట్టుకున్నా ట్రాక్టర్ […]

Read More

నాలుగేండ్ల తర్వాత..

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మేడ గ్రామ శివారు లోని సోమాజిచెరువు నాలుగేండ్ల తర్వాత అలుగుపారడంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం చెరువు మత్తడి దుంకింది. దీంతో పిల్లలు, యువకులు అక్కడికి చేరుకొని సెల్ఫీలు దిగారు. గ్రామస్థులు, చుట్టుపక్కల గ్రామాలవారు అక్కడికి చేరుకొని చెరువు అందాలను తిలకించారు.

Read More
కరోనాకు ‘కళంకమే’ ప్రమాదం

కరోనాకు ‘కళంకమే’ ప్రమాదం

సారథి న్యూస్​, కర్నూలు: ఎక్కడో పుట్టిన మహమ్మారి యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. వయస్సుకు సంబంధం లేకుండా.. అందరిలోనూ భయం నింపింది. మనసారా ఊపిరి పీల్చుకోవడానికి కూడా భయపడేలా చేసింది. కానీ ఇదంతా ‘కళంకం’ వల్లే చోటుచేసుకుందని, దాన్ని జయిస్తే.. కరోనాను అంతం చేయడం సాధ్యమవుతుందని అపోలో హాస్పిటల్‌ సీనియర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్​ జావెద్‌ సయ్యద్‌ చెప్పారు. ఆంధ్రప్రదేశ్​లో ఒక కుటుంబంలో ఒకరు కరోనా పాజిటివ్‌తో మృతి చెందితే.. మిగిలిన వారు డిప్రెషన్‌కు గురై గోదావరి నదిలోకి దూకి […]

Read More

ప్రగతిభవన్​ ఎదుట ఆటోడ్రైవర్​ ఆత్మహత్యాయత్నం

సారథిన్యూస్​, హైదరాబాద్​: ‘సారూ నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన.. కేసీఆర్​ సార్​ పిలుపునిచ్చినప్పుడల్లా బంద్​లో పాల్లొన్న.. ఉద్యమాలు చేసిన.. లాఠీదెబ్బలు తిన్న.. పోలీస్​స్టేషన్​కు పోయివచ్చిన.. కేసులు గూడ అయినయి.. చివరకు తెలంగాణ వచ్చింది. మా దేవుడు కేసీఆర్​ సీఎం అయ్యిండి.. కానీ నన్ను ఎవరూ పట్టించుకోలే’ అంటూ ఓ వ్యక్తి శుక్రవారం ప్రగతిభవన్​ ఎదుట ఆందోళనకు దిగాడు. కిరోసిన్​ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. చివరకు పోలీసులు అక్కడికి చేరుకొని అతడిని రక్షించారు. అనంతరం అతడు మీడియాతో మాట్లాడుతూ.. […]

Read More

వానొచ్చాక మన రోడ్ల సిత్రాలు

సారథి న్యూస్, రామడుగు: మాములు సమయాల్లో ఎలాగో కష్టపడుతూ ఆ గుంతలు, మిట్టలో కాస్త ఇబ్బందికరంగానైనా మనం రోడ్డు ప్రయాణాలు చేస్తుంటాం.. కానీ వానొచ్చనప్పడు వాటి పరిస్థితి ఇంకా భయంకరంగా ఉంటుంది. రోడ్డు నిండా నిలిచిన నీళ్లు.. ఎక్కడ ఏ గొయ్యి ఉందో తెలియదు. కళ్లు మూసుకొని దేవుడిమీదే భారం వేసి వెళ్లాల్సి వస్తుంది. కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలో ఇటీవల కురిసిన భారీవర్షాలకు రోడ్లు గతుకులు పడ్డాయి.. శ్రీరాముల పల్లి రోడ్డును ఆనుకొని, మోడల్ […]

Read More

నిఘానీడలో నాగన్​పల్లి

సారథి న్యూస్, నారాయణఖేడ్: మెదక్​ జిల్లా కంగ్టి మండలంలోని నాగన్​పల్లిలో గ్రామస్తులంతా చందాలు వేసుకుని ఏడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. వీటికి రూ.1.2 లక్షలు ఖర్చయినట్టు తెలిపారు. గురువారం కంగ్టి ఎస్​ఐ అబ్ధుల్​ రఫిక్​ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్తులే సొంత ఖర్చుతో కెమెరాలు ఏర్పరుచుకోవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గంగమ్మ, బీజేపీ మండలాధ్యక్షుడు సిద్దారెడ్డి, ఎంపీటీసీ, ఇతర గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More