Breaking News

RAMAGUNDAM

సింగరేణిలో కరోనా కలకలం

సింగరేణిలో కరోనా కలకలం

సారథి న్యూస్, రామగుండం: సింగరేణి ఉద్యోగులు ఎక్కువగా నివసించే పెద్దపల్లి జిల్లా రామగుండంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కొంతమంది కరోనా పేషేంట్లు విచ్చలవిడిగా జనాల మధ్య తిరుగుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సింగరేణి యాజమాన్యం పాజిటివ్​ వచ్చినవారి వివరాలు వెల్లడించకపోవడంతో వారు యథేచ్ఛగా తిరుగుతున్నారని స్థానికులు వాపోతున్నారు. కరోనా పాజిటివ్​ వచ్చినవారు క్వారంటైన్​లో ఉండేలా సింగరేణి యాజమాన్యం, వైద్యులు చొరవ తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Read More

కలిసికట్టుగా పనిచేద్దాం

సారథి న్యూస్, రామగుండం: సింగరేణి ఉద్యోగులంతా కలిసి కట్టుగా పనిచేయాలని ఆ సంస్థ డైరెక్టర్​ (ఆపరేషన్స్​) ఎస్​ చంద్రశేఖర్​ సూచించారు. మంగళవారం ఆయన పెద్దపల్లి జిల్లా మేడిపల్లి ఓపెన్​కాస్ట్​ను సందర్శించి అక్కడ జరుగుతున్న ఓవర్​ బర్డెన్​ పనులను పరిశీలించారు. వానకాలంలో ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో అధికారులకు, కార్మికులకు పలు సూచనలు చేశారు. ఓవర్​ బర్డెన్​ తరలింపు పనులను వేగవంతంగా చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో అర్జీ-1 ఏరియా మేనేజర్ గోవిందారావు, సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి , […]

Read More

నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు

సారథిన్యూస్​, రామగుండం: రామగుండం కమిషనరేట్​ పరధిలో గణేశ్​ మండపాలకు అనుమతి లేదని.. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా మండపాలు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామని కమిషనర్​ సత్యనారాయణ హెచ్చరించారు. శుక్రవారం ఆయన పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీసులకు వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులకు పలు సూచనలు చేశారు. కరోనా నివారణ గురించి అధికారులు సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. తప్పకుండా మాస్కులు, గ్లౌజులు ధరించాలని సూచించారు.

Read More

పేదయువతి వివాహానికి ఆర్థికసాయం

సారథిన్యూస్​, రామగుండం: ఎన్టీపీసీకి చెందిన ఓ పేదయువతి వివాహానికి విజయమ్మ ఫౌండేషన్ ఆసరాగా నిలిచింది. పెదపల్లి జిల్లా రామగుండం పరిధిలోని న్యూమారేడుపాకలోని మల్లికార్జున స్వామి దేవాలయంలో మేఘన అనే యువతికి వివాహం జరిగింది. మేఘన తల్లిదండ్రులు పేదరికంలో ఉండటంతో విషయం తెలుసుకున్న రామగుండం శాసన సభ్యులు కోరుకంటి చందర్.. పేద యువతి వివాహానికి ఆర్థిక సహాయం అందించాలని విజయమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు కోరుకంటి మనిదీప్ ను అదేశించారు. దీంతో విజయమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు కోరుకంటి మణిదీప్ యువతికి […]

Read More

మతోన్మాద శక్తులను అడ్డుకుందాం

సారథి న్యూస్​, రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండంలో బుధవారం అఖిలభారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్​ఎఫ్​) ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీపీఐ నగర కార్యదర్శి కె.కనకరాజు జెండాను ఆవిష్కరించారు. ఏఐఎస్​ఎఫ్​ మతోన్మాద శక్తులకు వ్యతిరేంగా పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో ఏఐఎస్​ఎఫ్​ నగర అధ్యక్ష, కార్యదర్శులు రేణుగుంట ప్రీతం, ఈర్ల రామచందర్​ పాల్గొన్నారు.

Read More

కరోనాకు జర్నలిస్టు బలి

సారథిన్యూస్ రామగుండం: కరోనా మహమ్మారి ఓ యువ జర్నలిస్టును బలి తీసుకున్నది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన రాంచందర్​ ఆంధ్రప్రభ దినపత్రికలో విలేఖరిగా పనిచేస్తున్నాడు. కొంత కాలంగా శ్వాససంబంధిత ఇబ్బందితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. కరీంనగర్​ దవాఖానలో చికిత్సపొందుతూ మంగళవారం కన్నుమూశాడు. రాంచందర్​ మృతికి గోదావరిఖని ప్రెస్ క్లబ్ నాయకులతోపాటు సీనియర్ జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు.

Read More
కరోనా కట్టడికి ఏంచేద్దాం?

కరోనా కట్టడికి ఏంచేద్దాం?

సారథి న్యూస్, రామగుండం: కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో శానిటైజేషన్​ విధిగా చేయాలని.. కరోనా పేషెంట్లు క్వారంటైన్​లో ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్​లో ఆయన కలెక్టర్​, అధికారులతో సమావేశమయ్యారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, జడ్పీచైర్మన్ పుట్ట మధుకర్, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు, ఇంచార్జి కలెక్టర్ భారతి […]

Read More
రామగుండం ఎమ్మెల్యేకు కరోనా

రామగుండం ఎమ్మెల్యేకు కరోనా

సారథి న్యూస్, రామగుండం: ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరుగా కరోనా బారినపడుతున్నారు. తాజాగా, పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు పాజిటివ్​ వచ్చింది. దీంతో ఆయన హైదరాబాద్​లోని ఓ ఆస్పత్రి చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు ఆయన సోమవారం హైదరాబాద్ నుంచి ఒక ప్రత్యేక వీడియోను రామగుండం ప్రజల కోసం విడుదల చేశారు. కరోనా మహమ్మారి పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే కోరుకంటి కోరారు.

Read More