తనను కొందరు బెదిరిస్తున్నారంటూ టాలీవుడ్ నటి పూర్ణ పోలీసులను ఆశ్రయించారు. లాక్ డౌన్‌తో ఆమె కొన్ని రోజులుగా సొంత రాష్ట్రమైన కేరళలోనే ఉంటున్నారు. అయితే ఓ నలుగురు వ్యక్తులు సోషల్‌మీడియా ద్వారా ఆమెను బెదిరించారు. ఏ విషయంలో బెదిరించారన్న విషయం ఆమె స్ఫష్టంగా చెప్పడం లేదు. నలుగురు వ్యక్తలు తనను డబ్బుల కోసం బెదిరిస్తున్నారని ఆమె కుటుంబసభ్యులతో కలిసి సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్న నలుగురు సభ్యుల […]
సారథిన్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ నవ వధువు కిడ్నాప్ అయ్యింది. బంధువులే ఆమెను కిడ్నాప్ చేశారని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నాగినేని రెడ్డిపాలెనికి చెందిన అశోక్‌రెడ్డి, పూజిత ప్రేమించుకున్నారు. పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఏపీలోని ఓ దేవాలయంలో వారు వివాహం చేసుకున్నారు. అనంతరం బూర్గంపాడు ఠాణాకి వెళ్లి తమ పెళ్లి విషయం చెప్పారు. పోలీసులు ఇరువురి తల్లిదండ్రులను పిలిపించి […]
నల్లగొండ, సారథి న్యూస్: పిల్ల నిచ్చిన మామను హత్యచేసిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండకు చెందిన చింతల గోపీ ఈ నెల 20న తన కుమారుడు రిత్విక్‌కు పుట్టు వెంట్రుకల వేడుక చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీలోని నందిగామ నుంచి అతడి మామ వంటిపులి వెంకటేశ్వర్లు వచ్చారు. తన కూతురును పుట్టింటికి తీసుకెళ్లేందుకు ఫంక్షన్నం అనంతరం నల్లగొండలోనే ఉండిపోయారు. మరునాడు మామా, అల్లుడు ఇంట్లోనే […]
సారథిన్యూస్, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో భారీగా నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. సుమారు రూ. 30 లక్షలు విలువైన 15 క్వింటాళ్ల పత్తి విత్తనాలను, వాటిని ప్యాకింగ్ చేసే మిషనరీని, సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ జిల్లా చండూరు మండలం కమ్మగూడెంలో నకిలీ విత్తనాలు ఉన్నట్టు పోలీసులకు సమాచారమందింది. కూపీ లాగగా.. ఏపీ, తెలంగాణకు చెందిన ఓ ముఠా ఈ నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు జోగుళాంబ గద్వాల, […]
ఢిల్లీ: కుటుంబ సమస్యలతో ఓ స్పెషల్ బ్రాంచ్ పోలీస్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాను మంచి భర్తగా, మంచి కుటుంబసభ్యుడిగా ఉండలేకపోతున్నానని చనిపోయేముందు ఓ సెల్ఫీ వీడియోను తీసుకున్నాడు. హర్యానాలోని జాజర్‌కు చెందిన సందీప్ కుమార్ వసంత విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కుటుంబ సమస్యలతో తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్నాడు. తోటి సిబ్బంది గమనించి ఆస్పత్రికి తరలించే లోపే తుదిశ్వాస విడిచాడు. సందీప్ ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ […]
సారథి న్యూస్, సూర్యాపేట: మద్యం సేవించి విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు, ఓ హోంగార్డుపై వేటుపడింది. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం అర్ధరాత్రి ఎస్పీ భాస్కరన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో అతిగా మద్యం సేవించారని తేలడంతో ముగ్గురు పోలీస్ సిబ్బందిని ఎస్పీ సస్పెండ్ చేశారు.
సారథి న్యూస్, ఖమ్మం: మానసికంగా, శారీరకంగా దృఢత్వం కలిగి ఉన్నప్పుడే లక్ష్యాన్ని సులభంగా చేధించవచ్చని పోలీస్ కమిషనర్ తప్సీర్ ఇక్బాల్ అన్నారు. సిటి ఆర్మ్డ్ పోలీస్ సిబ్బందికి ఏటా జరిగే వార్షిక రిఫ్రెష్ కోర్స్ శిక్షణలో భాగంగా సీనియర్, జూనియర్స్ మొత్తం 350 మంది సిబ్బందికి శుక్రవారం రఘునాథపాలెం మండలం మంచుకొండ పోలీస్ ఫైరింగ్ రేంజ్ లో వెపన్ ప్రాక్టీస్ చేయించారు. పోలీస్ కమిషనర్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. ప్రతిభచూపిన వారిని కమిషనర్ అభినందించారు. కార్యక్రమంలో […]
సారథిన్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలోని పోలీసులను కరోనా మహమ్మారి వెంటాడుతున్నది. ఇప్పటి వరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మొత్తం 22 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు సమాచారం. ఎస్ఆర్నగర్లో పీఎస్‌లో విధులు నిర్వర్తిస్తున్న మరో 9 మందికి కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఒక క్రైంఎస్ఐ, ఏఎస్‌ఐ, ఏడు మంది కానిస్టేబుళ్లు కరోనా బారిన పడ్డారు. అలాగే జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అధిక సంఖ్యలో పోలీసులు కరోనా […]