అబుదాబి: ఐపీఎల్13లో కీలకమైన మ్యాచ్‌లో సన్రైజర్స్హైదరాబాద్ ఘనవిజయం సాధించింది. రాయల్‌చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచి క్వాలిఫయర్-2లో అడుగుపెట్టింది. ఆర్సీబీ నిర్దేశించిన 132 పరుగుల లక్ష్యాన్ని కొద్దిగా కష్టంగానే ఛేదించింది. సన్రైజర్స్కీలక ఆటగాళ్లు కేన్ విలియమ్సన్(50 నాటౌట్; 44 బంతుల్లో 4×2, 6×2), హోల్డర్(24 నాటౌట్; 20 బంతుల్లో 4×3) జట్టుకు విజయాన్ని అందించడంలో చివరి దాకా నిలిచారు. వార్నర్(17; 17 బంతుల్లో 4×3)పై ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఎక్కువ సేపు […]
డివిజన్ల వారీగా రిజర్వేషన్ల జాబితా సిద్ధం ఎస్టీలకు-2, ఎస్సీలకు -10, బీసీలకు- 50 మహిళలకు 75 స్థానాల కేటాయింపు అన్ రిజర్వ్డ్ డివిజన్లు 44 అంతా రెడీచేసిన బల్దియా అధికారులు హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పాలకమండలి రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రెండు దఫాలు యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వం గత అసెంబ్లీ సమావేశాల్లో చట్టం చేయడంతో గతంలో చేసిన రిజర్వేషన్లు ఈ దఫా కూడా కొనసాగనున్నాయి. ఈ మేరకు మొత్తం 150 స్థానాలకు గానూ జీహెచ్ఎంసీ అధికారులు డివిజన్ల వారీగా […]
షార్జా: ఐపీఎల్13వ సీజన్లో భాగంగా షార్జా వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో జరిగిన 52వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. ఇది సన్‌రైజర్స్‌కు ఆరో విజయం. పాయింట్ల పట్టికలో ఫోర్త్ ప్లేస్‌కు చేరింది. ముందుగా ఆర్సీబీ నిర్దేశించిన 121 పరుగుల టార్గెట్‌ను 14.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ గెలవడంతో ప్లే ఆఫ్ ఆశలను ఇంకా సజీవంగా ఉన్నాయి. వృద్ధిమాన్ సాహా( 39; 32 బంతుల్లో 4×4, 6×1) […]
సారథి న్యూస్, హైదరాబాద్: జియాగూడలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అని పెద్దలు సామెత చెబుతుంటారు. ఈ రెండు పనులు చేయడమంటే కష్టంతో కూడుకున్న పని. కానీ ఇల్లు నేను కట్టిస్తా. పెండ్లి నేను చేస్తా అన్నది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాత్రమే’ అని సృష్టంచేశారు. డబుల్ […]
సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో సహాయ పునరావాస కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నగరంలో జరుగుతున్న సహాయ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ‘భారీ వర్షాలు, వరదల వల్ల ఇండ్లలోకి నీరొచ్చి ఆహార పదార్ధాలు, దుస్తులు, చెద్దర్లు అన్నీ తడిసిపోయాయి. కనీసం వండుకుని తినే పరిస్థితుల్లో కూడా చాలా కుటుంబాలు లేవు. అందుకే వారికి తక్షణ సాయంగా ప్రతి బాధిత కుటుంబానికి రూ.10వేల చొప్పున […]
రెండు విభాగాలుగా చేసి ఐఏఎస్ లకు బాధ్యతలు అప్పగించాలి మరిన్ని సంస్థాగత మార్పులు జరగాలి వ్యవసాయశాఖపై సమీక్షలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా మారుతోందని, అందుకు తగ్గట్టుగా వ్యవసాయశాఖ బలోపేతం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. వ్యవసాయశాఖలో మరో రెండు విభాగాలు ఏర్పాటు చేసి ఐఏఎస్ అధికారులను బాధ్యులుగా నియమించాలని ఆదేశించారు. వర్షాకాలం పంటలను కొనుగోలు చేయడానికి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సూచించారు. ప్రగతిభవన్ లో శుక్రవారం […]
సారథి న్యూస్, హైదరాబాద్: వానాకాలం పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానంపై చర్చించేందుకు శుక్రవారం మద్యాహ్నం 2.30 గంటలకు ప్రగతి భవన్ లో సీఎం కె.చంద్రశేఖర్ రావు సమీక్ష సమావేశం ఏర్పాటుచేశారు. వ్యవసాయ, పౌర సరఫరాలు, మార్కెటింగ్ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ సమావేశంలో పాల్గొంటారు. వానాకాలం పంటల కొనుగోలు కోసం రాష్ట్రవ్యాప్తంగా చేసిన ఏర్పాట్లపై సమీక్షిస్తారు. యాసంగిలో పంటల సాగుపై చర్చిస్తారు. ముఖ్యంగా మక్కల సాగుపై విధాన నిర్ణయం […]
సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ భాగ్యనగరంలో మరోసారి భారీవర్షం కురిసే అవకాశం ఉందని, అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి అప్రమత్తంగా అందుబాటులో ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని అత్యవసరమైతేనే బయటకు రావాలని కోరారు. మరోసారి అవకాశాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు వారిని జీహెచ్ఎంసీ వారు ఏర్పాటుచేసిన షెల్టర్లను తరలించాలని ఆదేశించారు.