ముంబై: కరోనా మహమ్మారి రోజు రోజుకి విజృంభిస్తోంది. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కంపెనీలు, ప్రొడక్షన్ యూనిట్లు స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో వర్కర్లు కరోనా బారినపడి ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వెస్ట్రన్ మహారాష్ట్ర బజాజ్ యూనిట్లో 250 మంది ఎంప్లాయిస్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో యూనిట్‌ని క్లోజ్ చేయాలని బజాజ్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. లాక్డౌన్ కారణంగా అసలే ప్రొడక్షన్ లేదని, ఇప్పుడు స్టార్ట్ అయినా కూడా కంటిన్యూ చేసే పొజిషన్ కనిపించడం లేదని వర్కర్లు […]
సారథి న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: పెరిగిన విద్యుత్‌చార్జీలు ప్రజలకు గుదిబండలా మారాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ విమర్శించారు. సోమవారం కొత్తగూడెం పట్టణంలోని టీఎస్ఎన్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కోనేరు మాట్లాడుతూ.. లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక ఆదాయం తగ్గి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు విద్యుత్ బిల్లులు మరింత భారంగా మారాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిలుకూరి […]
సారథి న్యూస్, హుస్నాబాద్ : కరోనా రోగులకు వైద్యం అందించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడిపే మల్లేశ్ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను సడలించడంతో కరోనా విజృంభిస్తుందన్నారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, భయాందోళనకు గురవుతున్నారన్నారు. ఇప్పటికైనా టెస్టులసంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. లాక్ డౌన్ సడలింపుల్లో వ్యాప్తి మరింత ఎక్కువైంది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య మూడులక్షలకు చేరడంతో తాజాగా భారత్ బ్రిటన్ను కూడా బీట్ చేసి నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇదే ధోరణి కొనసాగితే మరికొద్ది రోజుల్లోనే దేశం మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ మరోసారి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కరోనా, లాక్డౌన్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. రెండు రోజులపాటు ప్రధాని సీఎంలతో వర్చువల్ సమావేశాల్లో […]
న్యూఢిల్లీ: జాతీయ క్రీడా పురస్కారాల తుది గడువును ఈనెల 22 వరకు కేంద్ర క్రీడాశాఖ పొడిగించింది. క్రీడా అధికారులు, సమాఖ్యలు, అసోసియేషన్ల ప్రతిపాదన లేకుండా.. అథ్లెట్లు ‘సెల్ఫ్ నామినేషన్’ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. దేశ వ్యాప్త లాక్ డౌన్ నేపథ్యంలో చాలా మంది అధికారులు, సమాఖ్యలు అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త ఆదేశాల ప్రకారం అవార్డుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థికి ఎవరి ప్రతిపాదన అవసరం లేదు. అథ్లెట్ తనకు సంబంధించిన విషయాలతో కూడిన సొంత […]
తమిళనాడు సర్కార్ నిర్ణయం చెన్నై: లాక్డౌన్ 5కు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం గైడ్‌లైన్స్ రిలీజ్ చేసింది. రాష్ట్రంలో జూన్ 30 వరకు లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నట్లు సీఎం పళనిస్వామి ఆదివారం ప్రకటించారు. జూన్ 8 తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, రెస్టారెంట్లను తెరిచేందుకు పర్మిషన్ ఇచ్చారు. చెన్నై, తిరువెళ్లూరు, చెంగళ్పట్టు, కాంచీపురం జిల్లాల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కు అనుమతి లేదని, రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో 50శాతం బస్సులు తిరుగుతాయని చెప్పారు.దేవాలయాలు, మెట్రో, ఇంటర్ స్టేట్ బస్ ట్రాన్స్పోర్ట్, సబ్ అర్బన్ ట్రైన్స్‌పై […]
తెరుచుకున్న మద్యం షాపులు వైన్స్ వద్ద విపరీతమైన రద్దీ కొద్దిసేపటికే స్టాక్ లేక మూత తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇదే తీరు సారథి న్యూస్, మెదక్: నెలన్నర రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వైన్స్ తెరచుకోడంతో మద్యం ప్రియులు షాపుల ఎదుట బారులుదీరారు. కొన్నిచోట్ల ఉదయం ఐదు గంటల నుంచే క్యూలైన్లలో నిల్చుకుని, మరికొన్ని ప్రాంతాల్లో చెప్పులను వరుసలో పెట్టడం గమనార్హం. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం మార్చి 22వ తేదీన జనతా కర్ఫ్యూ విధించగా, […]
సారథి న్యూస్, చేవెళ్ల: లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేదలకు బిర్యానీ ప్యాకెట్లు, ఒక్కొక్కరికి నాలుగు గుడ్ల చొప్పున దాదాపు వెయ్యి మందికి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి గురువారం పంపిణీ చేశారు. ప్రజాసమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పేదలను అన్ని విధాలుగా మేలుచేస్తుందన్నారు. ప్రజలెవరూ ఆకలి చావులతో ఉండకూడదని ధైర్యం ఇచ్చారు. పోలీసు సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.