Breaking News

రామడుగు

దళితుల పై దాడులు ఆపాలి

దళితుల పై దాడులు ఆపాలి

సారథి న్యూస్, రామడుగు: దేశంలో రోజు రోజుకు దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని టీపీసీసీ ఎస్సీ సెల్ కన్వీనర్ వెన్న రాజమల్లయ్య అన్నారు. ఈ మేరకు బుధవారం స్థానిక తహసీల్దార్ ద్వారా జిల్లా కలెక్టర్​ కు పంపిన వినతిపత్రంలో డిమాండ్ చేశారు. దళితులకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన రుణాలను మంజూరు చేయాలని కోరారు.

Read More

సులభ్​ కాంప్లెక్స్​ కోసం వినతి

సారథిన్యూస్, రామడుగు: రామడుగు మండల కేంద్రంలో సులభ్​ కాంప్లెక్స్​ నిర్మించాలని గ్రామ యువకులు.. కార్యదర్శి జ్యోతికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సులభ్​ కాంప్లెక్స్​ లేకపోవడంతో వివిధ గ్రామాల నుంచి రామడుగు మండల కేంద్రానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో అనుపురం పరుశరాం, పురేళ్ల శ్రీకాంత్, మామిడి అంజి, ఉత్తేమ్, మహేశ్​ తదితరులు ఉన్నారు.

Read More
సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం

సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం

సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ ​జిల్లా రామడుగు మండలంలోని గోపాల్​రావుపేట గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కె.చంద్రశేఖర్​రావును ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ​కోరారు. దీంతో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యే తదితరుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఎడవెల్లి నరేందర్ రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు రజబ్ అలీ, గ్రామశాఖ అధ్యక్షుడు దాసరి బాబు, పూడూరి మల్లేశం, ఎడవెల్లి పాపిరెడ్డి, అంజయ్య, రాజిరెడ్డి, మల్లేశం, కమలాకర్, శ్యాంసుందర్ రెడ్డి, రమేష్, […]

Read More

అలసత్వం అస్సలు సహించం

సారథిన్యూస్, రామడుగు: పనుల్లో అలసత్వాన్ని సహించే ప్రసక్తే లేదని డీఆర్డీవో వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శనివారం ఆయన కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం దేశురాజ్​పల్లి గ్రామంలో పర్యటించారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు నీరు పట్టేందుకు వెంటనే నీటి తొట్టెల ను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామంలో రోడ్డుకిరువైపులా నాటిన మొక్కలను పరిశీలించారు. కార్యక్రమంలో ఏపీడీవో మంజుల దేవి, ఎంపీడీవో మల్హోత్ర, ఎస్సారెస్పీ డీఈ, సర్పంచ్ కోల రమేశ్​ తదితరులు పాల్గొన్నారు.

Read More
బహిరంగ చర్చకు సిద్ధమేనా?

బహిరంగ చర్చకు సిద్ధమేనా?

సారథి న్యూస్, రామడుగు: నియోజకవర్గ అభివృద్ధి, సాగు, తాగునీటి విషయంలో బహిరంగ చర్చకు రావాలని టీఆర్ఎస్ నేతలకు కరీంనగర్​ జిల్లా కాంగ్రెస్ బీసీసెల్​అధ్యక్షుడు పులి ఆంజనేయులు సవాల్ విసిరారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధిలో చొప్పదండి వెనకబడి ఉందన్నారు. తూముల నిర్మాణం విషయంలో మేడిపల్లి సత్యంపై అసత్య ఆరోపణలు తగవన్నారు. మాల్యాల నుంచి కోదురుపాక వరకు వరద కాల్వకు ఎన్ని తూములు ఉన్నాయి, వాటికి ఎంత కేటాయించారో చెప్పాలని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఐదు కి.మీ. […]

Read More
మేమున్నాం.. ఆదుకుంటాం

మేమున్నాం.. ఆదుకుంటాం

‘సారథి’’ కథనానికి విశేష స్పందన సాయం చేసేందుకు ముందుకొచ్చిన దాతలు సారథి న్యూస్, రామడుగు: మూడు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి జీవచ్ఛంలా మారి.. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న కరీంనగర్​ జిల్లా రామడుగు గ్రామానికి చెందిన చెందిన అంజలి భర్త రాజేశేఖర్​కు సాయం చేసేందుకు పలువురు ముందుకొచ్చారు. ‘‘ఆపదలో ఉన్నం ఆదుకోండి’’ శీర్షికన గత సోమవారం ‘‘సారథిమీడియా’’లో వచ్చిన వార్తా కథనానికి పలువురు ముందుకొచ్చారు. సింగపూర్ లో ఉన్న రామడుగు వాసులు తోట శ్రీనివాస్, […]

Read More

పేదల సొంతింటి కల సాకారం

సారథిన్యూస్, రామడుగు: టీఆర్​ఎస్​ ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్​ బెడ్రూం ఇండ్లతో పేదల సొంత ఇంటి కల సాకారమవుతున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పథకం బృహత్తరమైనదని పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణం పనులు వేగవంతం చేసి పేదలకు త్వరితగతిన అందించేలా అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో […]

Read More

రాజీవ్ సేవలు చిరస్మరణీయం

సారథి న్యూస్, రామడుగు: మాజీ ప్రధాని రాజీవ్​గాంధీ సేవలు చిరస్మరణీయమని కరీంనగర్ యూత్ కాంగ్రెస్ పార్లిమెంట్ అధ్యక్షుడు నాగి శేఖర్ కొనియాడారు. గురువారం రాజీవ్ గాంధీ 76వ జయంతి సందర్భంగా రాజీవ్ సద్భావాన దినోత్సవాన్ని నిర్వహించారు. కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని దళిత కాలనీలో నాగిశేఖర్​ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలపడానికి రాజీవ్ గాంధీ కృషి ఎనలేనిదని కొనియాడారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్​ ఉపాధ్యక్షుడు నీలం దేవకిషన్, […]

Read More