Breaking News

యువకుడు

కరాటేలో కిర్రాక్

కరాటేలో కిర్రాక్​

అంతర్జాతీయ స్థాయికి ఆటోవాలా గ్రామీణ యువకుడిలో విశేష ప్రతిభ యువతకు శిక్షణ ఇచ్చి పలువురిలో స్ఫూర్తి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చనే విషయాన్ని ఓ మారుమూల గ్రామీణ యువకుడు నిరూపించాడు. ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించాడు. ఓ వైపు ఆటోడ్రైవర్​గా తన జీవిత ప్రస్థానం కొనసాగిస్తూనే మరోవైపు తనకు ఇష్టమైన కరాటే రంగంలో పేరు తెచ్చుకున్నాడు. మనసుంటే మార్గం ఉంటుందని, నచ్చిన రంగంపై ఆసక్తి పెంచుకుని, అందులో కృషిచేస్తే ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని పరుశురాం నిరూపించాడు. సామాజిక […]

Read More
శభాష్.. శివ!

శభాష్.. శివ!

యువకుడి సేవాస్ఫూర్తి సొంత ఖర్చుతో రోడ్డుపై గుంతల పూడ్చివేత అభినందన తెలిపిన వాహనదారులు సామాజిక సారథి, వర్ధన్నపేట: నిత్యం మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతోమంది ఉన్నతాధికారులు వెళ్లే జాతీయ రహదారి అది. ప్రతిరోజూ వందలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ప్రధాన మార్గం. ఆ హైవేపై గుంతలు ఏర్పడి ప్రయాణికులకు ప్రాణసంకటంగా మారాయి. ఎన్నో ప్రమాదాలు కూడా జరిగాయి. కానీ ఎవరూ పట్టించుకున్న దాఖలాల్లేవ్. ఎవరూ బాధ్యతగా ముందుకొచ్చి ఆ గుంతలను పూడ్చే ప్రయత్నమూ చేయలేదు. కానీ ఐనవోలు […]

Read More

లారీ ఢీకొని యువకుడు మృతి

సారథి న్యూస్, హుస్నాబాద్: వేగంగా వస్తున్న లారీ ఢీకొని ఓ యువకుడు మృతిచెందిన ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో చోటుచేసుకున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కొండసముద్రంకు చెందిన తాటిపర్తి చంద్రమౌళి(37) శనివారం హస్నాబాద్​కు వచ్చాడు. కాగా పట్టణంలోని నాగారం వద్ద రోడ్డు దాటుతుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రమౌళి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు లారీ డ్రైవర్​ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

Read More