సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికల సమరానికి తెలంగాణ రాష్ట్రంలో నేటితో ఎన్నికల ప్రచార గడువు ముగియనుంది. నాలుగో విడతలో భాగంగా సోమవారం తెలంగాణ రాష్ట్రంలోని 17 నియోజకవర్గాలలో పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి నేటి సాయంత్రంతో ప్రచార గడువు ముగుస్తుండటంతో అభ్యర్థులు పోల్ మేనేజ్ మెంట్ పైన దృష్టిపెట్టనున్నారు. దీనికి ఆదివారం ఒక్కరోజు కీలక కావడంతో ఏయే నియోజకవర్గాల్లో ఏ వ్యూహాలను అనుసరించాలి, ఎక్కడెక్కడ తమకు అనుకూలంగా లేని పరిస్థితులను మార్చుకోవాలన్న దానిపై దృష్టిసారించారు. […]
ఎన్డీఏలో చేరాలని ఏపీ జగన్‌ను ప్రధాని మోదీ ఆహ్వానించారా? ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏలో భాగస్వాములుగా మారి వైఎస్సార్సీపీ కి చెందిన ఇందరు ఎంపీలకు మంత్రి పదవులు తీసుకోవాలని మోదీ ఒత్తిడి తెస్తున్నారా? అంటే ఢిల్లీ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తున్నది. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లాక జాతీయ మీడియాలో పలు ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే ప్రత్యక్షంగా పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇస్తున్న వైఎస్సార్సీపీ త్వరలోనే ఎన్డీఏలో చేరబోతున్నదంటూ వార్తలు వస్తున్నాయి. రెండు వారాల క్రితమే సీఎం […]
న్యూఢిల్లీ : కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్ అంగడి కరోనా సోకి మరణించారు. లక్షణాలేమీ లేకున్నా (అసింప్టమేటిక్) కరోనాతో రెండువారాల క్రితం ఢిల్లీలోని ఏయిమ్స్‌లో చేరిన ఆయన.. బుధవారం తుదిశ్వాస విడిచారు. చికిత్స తీసుకుంటున్న సమయంలోనే ఆయనకు శ్వాసకోస ఇబ్బందులు తలెత్తడంతో ఆరోగ్యం క్షీణించింది. కోవిడ్ వల్ల మరణించిన తొలి కేంద్ర మంత్రి ఆయనే. కర్నాటకకు చెందిన సురేశ్ అంగడి.. బెల్గావి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2004 నుంచి వరుసగా నాలుగుసార్లు […]
న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో అరుదైన ఘనత సాధించారు. మోదీ దేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా లక్షల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ప్రధాని మోదీ చురుకుగా ఉంటూ రాజకీయ, పాలనాపరమైన విషయాలను ప్రజలతో పంచుకుంటారు. తాజాగా ప్రధాని మోదీ తన ట్విటర్ ఖాతాలో 60 మిలియన్ల (6కోట్లు) ఫాలోవర్స్ మైలు రాయిని చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న రాజకీయ నాయకుల్లో మోదీ […]
సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రధాని మోదీ పాలన జనరంజకంగా సాగుతున్నదనికరీంనగర్ జిల్లా బీజేపీ అక్కన్నపేట మండల అధ్యక్షుడు గొల్లపల్లి వీరాచారి పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం రామవరం, గండిపల్లి గ్రామాల్లో బీజేపీ ఏడాది పాలనపై నిర్వహించిన ఇంటింటా ప్రచారంలో మాట్లాడారు. దేశంలోని అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి చేతివృత్తులపై ఆధారపడిన ప్రతి కుటుంబానికి చేయూతనిస్తున్న ప్రజా నాయకుడు మోదీ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సాగర్, మనోహర్, అజయ్, కృష్ణ, మహేష్, నాగేష్, భిక్షపతి తదితరులు […]