Breaking News

మొక్కలు

మొక్కలు నాటడమే కాదు పరిరక్షించడం ముఖ్యం

మొక్కలను పరిరక్షించాలి

సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండల గోపాల్​రావుపేటలో మార్కెట్​ కమిటీ పాలకవర్గం ఆధ్వర్యంలో మార్కెట్​ ఆవరణలో 500 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ మాట్లాడుతూ.. మొక్కలను నాటడం గొప్పకాదు వాటిని పరిరక్షించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్​ కమిటీ చైర్మన్​ గంట్ల వెంకట్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More

మొక్కలు నాటడం మన బాధ్యత

సారథిన్యూస్​, ఖమ్మం: మొక్కలు నాటడం మనందరి బాధ్యత అని ఖమ్మం పోలీస్​ కమిషనర్​ తఫ్సీర్​ ఇక్బాల్​ పేర్కొన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో కమిషనర్​ క్యాంప్​ కార్యలయంలో ఇక్చాల్​ కుటుంబసభ్యలు ఆరో విడత హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కమిషనర్​ మాట్లాడుతూ.. మొక్కలు నాటడమే కాక వాటిని బతికించుకోవడం ఎంతో ముఖ్యమని చెప్పారు. కార్యక్రమంలో తఫ్సీర్ ఇక్బాల్ తనయుడు తైముర్ ఇక్బాల్ , కమిషనర్ సతీమణి జెబాఖానమ్ పోలీస్​ సిబ్బంది పాల్గొన్నారు.

Read More

మొక్కలు నాటడం మనబాధ్యత

సారథిన్యూస్​, మంచిర్యాల/ సిద్దిపేట/చిన్నకోడూర్ : మొక్కలు నాటడం సామాజిక బాధ్యత అని మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి పేర్కొన్నారు. ఆరోవిడుత హరితహారం కార్యక్రమంలో రామగుండం పోలీస్​ కమిషనరేట్​ పరిధిలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ఆర్మ్​డ్​ పోలీస్ హెడ్​క్వార్టర్స్​లో ఆయన మొక్కలు నాటారు. మరోవైపు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామంలోని హరీశ్​రావు కాలనీలో సర్పంచ్ బోయినపల్లి నర్సింగరావు అధ్వర్యంలో మొక్కలు నాటారు. చిన్నకోడూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్సై సాయికుమార్​, సిబ్బంది మొక్కలు నాటారు. కార్యక్రమంలో రామగుండం పోలీస్ […]

Read More

నిరాడంబరంగా హరితహారం

సారథిన్యూస్​, నెట్​వర్క్​: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా అధికారులు, ప్రజాప్రతినిధులు నిరాడంబరంగా ప్రారంభించారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం, చింతకాని మండలాల్లో జెడ్పీ చైర్మన్​ లింగాల కమల్​రాజ్​, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్​ కొండబాల కోటేశ్వర్​రావు మొక్కలు నాటారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బయ్యారం క్రాస్ రోడ్ లో తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మొక్కలు నాటారు. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​, జిల్లా కలెక్టర్​ […]

Read More

మొక్కలు నాటిన సీతక్క

సారథిన్యూస్​, ములుగు: మొక్కలతో పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని ములుగు ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు. బుధవారం ఆమె ములుగు జిల్లాలోని తన జగ్గన్నపేటలో తల్లిదండ్రులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో వెంకన్న, రామచందర్​, ముతయ్య భూషన్​ తదితరులు పాల్గొన్నారు.

Read More
మొక్కలు బాగున్నయ్

మొక్కలు బాగున్నయ్

సారథి న్యూస్, హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర అటవీ ప్రాంతంలో కలెక్టర్ వి.వెంకటేశ్వర్లు, అటవీశాఖ సిబ్బందితో కలిసి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. హరితహారంలో భాగంగా గతేడాది మాస్ ప్లాంటేషన్ లో ఎంపీ సంతోష్ కుమార్ నాటిన మొక్కలు బాగున్నాయని అభిప్రాయపడ్డారు. ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో వర్షాకాలంలో మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు. ఎకో పార్క్ పార్కులో వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు చేయాలన్నారు. కీసరలోని చెరువును సుందరీకరించి పర్యాటక […]

Read More