సామాజిక సారథి, ఏటూరు నాగారం: పీఎల్జీఏ 21వ వార్షిక వారోత్సవాలు డిసెంబర్ 2నుంచి డిసెంబర్10 వరకు జరుపుకోవాలని మావోయిస్టులు పిలుపునివ్వడంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. ఏజెన్సీ సరిహద్దు ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రత్యేక పోలీసు బలగాలతో అడవులను జల్లడ పడుతున్నారు. రహదారులు, గోదావరి పరీవాహక ప్రాంతాలపై డేగ కన్నుతో సోదాలు నిర్వహిస్తూ అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసుల కళ్లుగప్పి మావోయిస్టులు వారి ఉనికిని చాటుకున్న ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం […]
మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా ఏటపల్లి తాలూకా గట్టా పోలీస్ స్టేషన్ పై బుధవారం అర్ధరాత్రి మావోయిస్టులు రాకెట్ లాంచర్ తో దాడిచేశారు. గోడకు తగలడంతో పెద్ద రంధ్రం పడింది. హ్యాండ్ మేడ్ రాకెట్ లాంచర్ గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు ఆరాతీస్తున్నారు. ఈ దాడిలో ప్రమాదం జరగకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. డ్రోన్ కెమెరాలతో అడవిలో మావోయిస్టులపై దాడి చేస్తున్నారని ఆరోపణలు చేసిన కొన్నిగంటల వ్యవధిలోనే లాంచర్ తో ఠాణాపై దాడికి పాల్పడడం గమనార్హం. […]
సారథి ప్రతినిధి, ములుగు: ములుగు జిల్లావ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఏటూరునాగారంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. 200 మంది సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ బలగాలతో ప్రతీ ఇంట్లోనూ సోదాలు చేశారు. అనుమానితులను రానివ్వద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఛత్తీస్‌గఢ్ ఎన్ కౌంటర్ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు సోదాలు చేపట్టారు. ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) పోలీసులు కూడా ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు. ఎస్సై తిరుపతి నేతృత్వంలో మండలంలోని బర్లగూడెం గ్రామ సమీపంలో […]
సారథి న్యూస్, ఖమ్మం: తెలంగాణలో ఇటీవల మావోయిస్టుల కదలికలు కనిపిస్తుండటంతో పోలీస్‌శాఖ ఇప్పటికే అప్రమత్తమైంది. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ముగ్గురు యువతులు ఓకే రోజు అదృశ్యమయ్యారు. అయితే వీరికి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయా? వీరు అడవి బాటపట్టారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. అశ్వారావుపేట మండలం చెన్నాపురం కాలనీకి(గొత్తికోయ కాలనీ) చెందిన ముగ్గురు యువతులు ఈ నెల 16వ నుంచి కనిపించకుండా పోయారు. అందులో ఓ యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుమేరకు పోలీసులు […]
సారథి న్యూస్, వాజేడు(ములుగు): మావోయిస్టులు వారోత్సవాల పేరుతో బంద్ లు చేయడం, అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం సరికాదని, వారికి సహకరించినట్లు తేలితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ములుగు జిల్లా ఓఎస్డీ సురేష్ కుమార్ హెచ్చరించారు. జిల్లాలో ఓవైపు కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో మావోయిస్టులు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పూనుకోవడంతో ప్రజల్లో వారిపట్ల వ్యతిరేకత పెరిగిందన్నారు. అడవుల్లో ఉండే గిరిజనులకు విద్య, వైద్యం, ఆర్థిక స్వావలంబన అందకుండా పురోగతికి మావోయిస్టులు అడ్డుపడుతున్నారని అన్నారు. గిరిజనుల అభివృద్ధికి అడ్డుపడకుండా […]
సారథి న్యూస్, హైదరాబాద్: విరసం నేత వరవరరావు అక్రమ నిర్బంధానికి నిరసనగా ఈనెల 25వ తేదీన రాష్ట్ర ప్రజలు బంద్ పాటించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదల చేసింది. అర్బన్ నక్సల్స్ పేరుతో అరెస్టు చేసిన వరవరరావు, ప్రొఫెసర్ సాయిబాబాతో సహా 12 మందిని, 60 ఏళ్లు పైబడిన రాజకీయ ఖైదీలను ప్రభుత్వం బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ ఉపా, ఎన్‌ఐఏ కేసులను […]
సారథిన్యూస్, ఖమ్మం: మావోయిస్టుల పేరుతో బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన కొంతమంది యువకులు ఓ ముఠాగా ఏర్పడి మావోయిస్టుల మంటూ సింగరేణి మహాలక్ష్మి క్యాంప్ హెచ్ఆర్ మేనేజర్‌కు ఫోన్‌చేసి డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో మేనేజర్ వారికి డబ్బులు ఇచ్చాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదుచేయగా.. రంగంలోకి దిగిన పోలీసులు సదురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
దండకారణ్యంలో విస్తృతంగా తనిఖీలు భారీ సంఖ్యలో పోలీసు బలగాల మోహరింపు సారథి న్యూస్, వాజేడు: కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న దండకారణ్యంలో మళ్లీ అలజడి మొదలైంది. మావోయిస్టులు తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నారన్న ఇంటలిజెన్స్సమాచారం మేరకు పోలీసులు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికుల్లో కలవరం నెలకొంది. ములుగు జిల్లా, చత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో కొద్దిరోజులుగా పెద్దసంఖ్యలో పోలీసు బలగాలు కుంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం సీఐ శివప్రసాద్ నేతృత్వంలో సివిల్ […]