సారథి న్యూస్, మానవపాడు: మండలంలో నిర్వహించిన పల్స్‌పోలియో కార్యక్రమం విజయవంతమైందని జిల్లా పోగ్రాం అధికారి డాక్టర్ సౌజన్య అన్నారు. మానవపాడు మండలంలో 4,892 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశామని వివరించారు. మండలం పరిధిలో 33 పోల్స్ పోలియో బూత్‌లను ఏర్పాటు చేయడంతో పాటు ఒక మొబైల్ టీమ్ ద్వారా పోలియో చుక్కలను వేశామన్నారు. రెండురోజుల పాటు ఇంటింటికీ తిరిగి చుక్కల మందు వేస్తామని తెలిపారు. కార్యక్రమంలో హెల్త్ అధికారులు చంద్రన్న సత్యనారాయణ, సంధ్యారాణి, తిరుమల్, ఆరోగ్యశ్రీ […]
సారథి న్యూస్, మానవపాడు: సీపీఎస్ విధానం ద్వారా 1.5లక్షల మంది ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని సీపీఎస్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు అన్నారు. గురువారం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో అగ్రికల్చర్ ఆఫీసర్ శ్వేత, డిప్యూటీ తహసీల్దార్ రవికుమార్ చేతులమీదుగా టీఎస్సీపీఎస్ ఈయూ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. సీపీఎస్ విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ వచ్చేనెల 14న జిల్లా కేంద్రంలో భారీర్యాలీ నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఓపీఎస్ విధానాన్ని తీసుకొచ్చి ఉద్యోగులను కాపాడాలని రాష్ట్ర సలహాదారుడు విష్ణు కోరారు. […]
సారథి న్యూస్, మానవపాడు: పరిహారం ఇవ్వకుండా తమ పొలాల గుండా హెచ్‌పీసీఎల్ గ్యాస్ పైప్లైన్వేయొద్దని జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పల్లెపాడు గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆదివారం ఆందోళనకు దిగారు. తగిన పంట నష్టపరిహారం ఇవ్వకుండా కోర్టు నోటీసులు పంపించి దౌర్జన్యంగా పైప్‌లైన్ వేయడం ఏమిటని ప్రశ్నించారు. మిరప పంట, పత్తి పనులు పూర్తయ్యే వరకు సమయం ఇవ్వాలని కోరినా ఇవ్వడం లేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
సారథి న్యూస్, మానవపాడు: ఏడాది పాటు ఒకరికి మరొకరు కలవకుండా, తల్లికి పిల్లభారమనేలా కరోనా చేసిందని, మహమ్మారిని తట్టుకునే శక్తి మనకు దేవుడిచ్చిన గొప్ప వరమని జోగుళాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్పర్సన్ సరిత అన్నారు. జిల్లాలోని మానవపాడు ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రంలో మంగళవారం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను డాక్టర్ దివ్య, డాక్టర్ ఇర్షద్, డాక్టర్ సవిత సమక్షంలో ఆమె ప్రారంభించారు. వాక్సిన్ ను మొదట హెల్త్ వర్కర్, రెండో వ్యాక్సిన్ డాక్టర్ కు ఇచ్చారు. కరోనా […]
సారథి న్యూస్, మానవపాడు: తమ వ్యవసాయ పంట పొలాల గుండా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ వారు గ్యాస్ పైప్ లైన్ వేయొద్దని జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం గోకులపాడు గ్రామస్తులు రాయచూర్– కర్నూలు అంతర్రాష్ట్ర రహదారిపై రోడ్డుపై భైఠాయించి ఆందోళనకు దిగారు. తక్షణమే గ్యాస్ పైప్ లైన్ పనులను ఆపివేయాలని డిమాండ్ చేశారు. పైప్‌లైన్‌ద్వారా ప్రాణనష్టం వాటిల్లుతుందన్నారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసు అధికారులు వచ్చి నచ్చజెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.
సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. సమస్యలపై నిలదీస్తూ పలువురు సర్పంచ్‌లు సమావేశాన్ని అడ్డుకున్నారు. పంచాయతీలో చేస్తున్న ప్రతి పనికి కమీషన్లు అడుగుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని అధికారుల తీరుకు నిరసనగా జడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్య, సర్పంచ్‌లతో కలిసి నేలపై కూర్చుని నిరసన తెలిపారు. బుధవారం ఎంపీడీవో ఆఫీసులో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ కోట్ల అశోక్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జడ్పీ చైర్పర్సన్ సరిత […]
పురుగు మందు తాగి అన్నదమ్ముల ఆత్మహత్యాయత్నం మానవపాడు తహసీల్దార్ ఆఫీసు ఎదుట ఆందోళన సారథి న్యూస్, మానవపాడు: భూమిని తమ పేర చేయడం లేదని, అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా న్యాయం జరగడం లేదని ఇద్దరు అన్నదమ్ములు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట కలకలం రేపింది. బాధిత రైతుల కథనం మేరకు.. మండలంలోని చెన్నిపాడు గ్రామానికి చెందిన రైతులు శేషిరాజు, నాగరాజుకు […]
మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సారథి న్యూస్, మానవపాడు: మూడు రైతు వ్యతిరేక చట్టాలను పార్లమెంట్లో ఆమోదించి రైతులను రోడ్ల పైకి వచ్చేలా చేసిన బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఏఐసీసీ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే ఎస్సంపత్కుమార్ అన్నారు. మంగళవారం రైతు సంఘాల పిలుపు మేరకు భారత్ బంద్ కార్యక్రమాన్ని అలంపూర్ నియోజకవర్గంలో చేపట్టారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు రోడ్డుపైనే బైఠాయించి వంటావార్పుతో అక్కడే భోజనాలు చేశారు. ‘మోడీ.. కేడి, బీజేపీ హఠావో.. […]