సారథి న్యూస్, హైదరాబాద్: ఓ వైపు భారీవర్షం.. హాస్పిటల్ లో పేషెంట్ ఆపరేషన్ కోసం మెడిసిన్ ఆపరేషన్ కిట్ అవసరం.. అవును ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నడుముల్లోతు నీటి ప్రవాహంలో వెళ్లి కమలానగర్ లోని రవీంద్ర హాస్పిటల్ లో పేషెంట్‌కు అత్యవసర మెడిసిన్ అందించారు ఎల్బీనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్అంజపల్లి నాగమల్లు. పక్కనే కరెంట్ స్థంభం ఉన్నా నీటి ప్రవాహ ఉధృతిని లెక్కచేయకుండా ప్రజల ప్రాణాలు రక్షించేందుకు తమ ప్రాణాన్ని ఫణంగా పెట్టారు. ఆయన ధైర్యం చూసి […]
సారథి న్యూస్, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో శనివారం అర్ధరాత్రి సుమారు రెండుగంటల పాటు ఏకధాటిగా వాన దంచికొట్టింది. ఉరుములు, మెరుపులతో ఆకాశమంతా దద్దరిల్లింది. చెరువులు, కుంటలు ఏమయ్యాయి. లోతట్టు కాలనీలు జలమయం అయ్యాయి. హైదరాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్, వనపర్తి, నల్లగొండ, సిద్దిపేట, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీవర్షం కురిసింది. భారీవర్షానికి హైదరాబాద్ లోని ఎల్బీనగర్ నుంచి […]
హైదరాబాద్: రాజధాని నగరం హైదరాబాద్‌లో శనివారం సాయంత్రం పలు ప్రాంతాల్లో మరోసారి భారీవర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో నగర వాసులను వణికించింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, కొత్తపేట, సరూర్‌నగర్, కర్మాన్‌ఘాట్, మీర్‌పేట, ఉప్పల్, రామంతపూర్, మేడిపల్లి తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. పాతబస్తీలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కాగా, మధ్య బంగాళాఖాతంలో ఈనెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఇది ఏర్పడిన 24 గంటల […]
సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): ఎన్నడూ లేని విధంగా కృష్ణానది పోటెత్తుతోంది. 2009లో కృష్ణమ్మ ఓ ప్రళయం సృష్టించింది. 2019లో రికార్డు స్థాయిలో పరవళ్లు తొక్కింది. 2020లో జూరాల మరో విధ్వంసాన్ని సృష్టించబోతుందా..? అవుననే సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే గతంలో కన్నా ఈ సారి జూరాల ప్రాజెక్టుకు ఈ రెండు రోజుల్లో రికార్డు స్థాయిలో వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉందని జూరాల అధికారులు అంచనా వేస్తున్నారు. జూరాలకు వస్తున్న వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని మొత్తం […]
సారథి న్యూస్, నెట్వర్క్: మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రమంతా అతలాకుతలమైంది. భాగ్యనగరం ఒక్కసారిగా స్తంభించిపోయింది. మూసీ ఉగ్రరూపం దాల్చింది. సరూర్‌నగర్‌చెరువు ఉప్పొంగింది. వరద ప్రళయమే సృష్టించింది. వరద ఉధృతికి కార్లు కొట్టుకొచ్చాయి. ఆ గల్లీ.. ఈ గల్లీ.. ఏది చూసినా జలసంద్రమైంది. అలాగే రాష్ట్రంలో పలు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరి చేలు నీట మునిగిపోయాయి. రోడ్లు, వంతెనలు వరద ఉధృతికి ధ్వంసమయ్యాయి.
హైదరాబాద్: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో హైదరాబాద్ శివారు ప్రాంతాలు వణికిపోతున్నాయి. నగరంలోని అనేక కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సుమారు 1500 కాలనీల్లో నడుముల లోతు మేర వరద నీరు చేరింది. కాలనీల్లో వరద నీరు ఉధృతంగా ప్రహహిస్తుండడంతో అధికారులు బోట్లు, నాటుపడవల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కనీసం మూడు రోజుల వరకు నగరవాసులు బయటకు రావొద్దని హెచ్చరించారు.అత్యవసర సేవల కోసం 040 – 211111111, జీహెచ్‌ఎంసీ […]
సీఎస్, డీజీపీతో ప్రత్యేకంగా చర్చించిన ముఖ్యమంత్రి జీహెచ్‌ఎంసీ పరిస్థితిపై అప్రమత్తం చేసిన మంత్రి కేటీఆర్ సారథి న్యూస్, హైదరాబాద్: రెండు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు తెలంగాణ తడిసి ముద్దయింది. ఈ నేపథ్యంలో రాష్ర్ట ప్రభుత్వం బుధ, గురువారాల్లో సెలవులు ప్రకటించింది. అత్యవసరమైతేనే ప్రజలు బయటికి రావాలని సూచించింది. పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పాత భవనాలను తక్షణమే ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు, పోలీస్‌శాఖను అప్రమత్తం చేసింది. వర్షాలు, వరదలు బీభత్సం […]
జలదిగ్బంధంలో హైదరాబాద్ మహానగరం నిండుకుండలా హుసేన్సాగర్, హిమాయత్‌సాగర్ భాగ్యనగరంలో చాలా ప్రాంతాల్లో కరెంట్ కట్ ఎడతెరిపిలేని వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం హైదరాబాద్– విజయవాడ హైవేపై రాకపోకలు బంద్ :: ఆర్కే, సారథి న్యూస్, హైదరాబాద్ ప్రత్యేక ప్రతినిధి భారీ వర్షాలకు హైదరాబాద్ చిగురుటాకుల వణుకుతోంది.. ఎక్కడ చూసినా వరదే కనిపిస్తోంది.. అడుగు బయటికేస్తే ఎక్కడి డ్రెయినేజీలో కొట్టుకుపోతావేమోనన్నభయం వెంటాడుతోంది.. చాలా ప్రాంతాల్లో కరెంట్ పోయి అంధకారం అలుముకుంది. ఏ ఇల్లు చూసినా చెరువును తలపిస్తోంది.. వరద నీటితో […]